హైదరాబాద్: ‘ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో.. సరిగా నడవడానికి సైతం బాటల్లేవు.. నిలబడే జాగా లేదు.. ఇరుకు సందులు.. మురికి కూపాలు’ అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మంగళవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా గుడిసెల మధ్య ఉన్న మురికి కాల్వల మీదుగా.. ఇరుకు సందుల నుంచి బయటకి వస్తూ.. ‘ఇదేం సందయ్యా..
నేనంటే సన్నగా ఉన్నాను కాబట్టి ఇందులో నుంచి రాగలిగాను. అదే కొంచెం దొడ్డుగా ఉన్నోడి పరిస్థితి ఏంది? అసలు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారయ్యా’ అంటూ బస్తీవాసుల పరిస్థితిని చూసి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అనే పాట విన్నదే కానీ ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా కనిపించింది’ అంటూ ముందుకు సాగారు.
Comments
Please login to add a commentAdd a comment