Basti
-
ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో..
హైదరాబాద్: ‘ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో.. సరిగా నడవడానికి సైతం బాటల్లేవు.. నిలబడే జాగా లేదు.. ఇరుకు సందులు.. మురికి కూపాలు’ అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మంగళవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా గుడిసెల మధ్య ఉన్న మురికి కాల్వల మీదుగా.. ఇరుకు సందుల నుంచి బయటకి వస్తూ.. ‘ఇదేం సందయ్యా.. నేనంటే సన్నగా ఉన్నాను కాబట్టి ఇందులో నుంచి రాగలిగాను. అదే కొంచెం దొడ్డుగా ఉన్నోడి పరిస్థితి ఏంది? అసలు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారయ్యా’ అంటూ బస్తీవాసుల పరిస్థితిని చూసి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అనే పాట విన్నదే కానీ ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా కనిపించింది’ అంటూ ముందుకు సాగారు. -
అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు
లాలాపేట (హైదరాబాద్): హైదరాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం తార్నాక డివిజన్ లాలాపేటలోని బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులంతా పలు సమ స్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు కిషన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడు తూ... హైదరాబాద్ నగరంలోని బస్తీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ మొత్తం సింగపూర్, డల్లాస్ అయినట్లు బీఆర్ఎస్ నేతలు మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, బంధులు వంటి పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నాలుగు రైల్వే స్టేషన్ల నిర్మాణం చేపట్టిందన్నారు. చర్లపల్లిలో మరో టెర్మినల్ నిర్మాణంలో ఉందన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తు న్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ట్రిపుల్ ఆర్ రోడ్డును రూ.26 కోట్లతో మంజూరు చేశామన్నారు. సర్వే ఆఫ్ ఇండియా దగ్గర రూ.450 కోట్లతో నేషనల్ సైన్స్ సిటీని మంజూరు చేశామని కానీ దాని కోసం 25 ఎకరాల స్థలం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీ కార్యాలయాలకు తప్ప ఇప్పటివరకు సైన్స్ సిటీకి స్థలం కేటాయించలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి బీజేపీ నేతలు బండ చంద్రారెడ్డి, రాము వర్మ పాల్గొన్నారు. -
చింతబావి బస్తీలో నల్లాల ద్వారా కలుషిత నీటి సరఫరా
-
వదిలిన దేశం తాలూకు ఇంటి బెంగ
అబ్బూ చనిపోతూ, ఇంక తమది కాని పూర్వీకుల రూప్‌నగర్ ఇంటి తాళాలను జాకిర్ చేతుల్లో పెడుతూ, ‘ఇవి నమ్మకానికి చిహ్నం. దాన్ని కాపాడుకో. మనం వదిలిన భూమి, మనపై చూపిన దయని జాపకం పెట్టుకో’ అని చెప్తాడు. ఏనాటి కిందటో, ‘ప్రపంచం కొత్తగానూ, ఆకాశం స్వచ్ఛంగానూ ఉన్నప్పుడు, భూమి ఇంకా మలినపడనప్పుడు’ కాల్పనిక ఊరైన రూప్‌నగర్ (ఇండియా) లో ‘బస్తీ’ నవల మొదలవుతుంది. కథకుడైన జాకిర్ పుట్టినది అక్కడే. అతని అబ్బూజాన్, అమ్మీ, చెల్లెల్నీ– పరిచయం చేస్తారు రచయిత ఇంతిజార్ హుసేన్. ‘తాబేలు మీద నిలుచున్న ఏనుగు తలపైనే భూమి ఉంటుంది’ అనే ఊరి పెద్దయిన భగత్జీ కథకీ, ‘కాదు, చేప మీద నిలుచున్న ఆవుకొమ్ము మీద భూమి ఉంటుంది’ అనే అబ్బూ కథకీ మధ్యన ఏ వైరుధ్యతా కనపడని హిందూ–ముస్లిమ్లకున్న సామరస్యమైన వాతావరణంలో పెరుగుతాడు జాకిర్. దేశ విభజన సమయంలో, పాకిస్తాన్ తరలి వెళ్తుంది అతని కుటుంబం. జాకిర్ చిన్నప్పటి స్నేహితురాలైన సబీరా మాత్రం ఊర్లోనే ఉండిపోతుంది. జాకిర్, లాహోర్‌లో ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం పెట్టుకోకుండా, టీ తాగుతూ దేశ భవిష్యత్తు గురించి చర్చిస్తుంటాడు. హిస్టరీ ప్రొఫెసర్‌గా చేరతాడు. సబీరాను తలచుకుంటూ– గతం, వర్తమానం, కల, యథార్థతలకి మధ్య ఊగిసలాడుతూ– రూప్‌నగర్, లాహోర్ కలిసిపోతాయన్న ఆశ వదలడు. తన ఊరి వేపచెట్టుని తలచుకుంటూ, లాహోర్‌లో ఉన్న మర్రిచెట్టుకి అలవాటు పడతాడు. అయితే, ‘పాత తరం మాత్రం తమ శరీరాలనైతే కొత్త దేశానికి తెచ్చుకుంది కానీ తమ ఆత్మలను తమ ఇళ్ళలోనే వదిలి వచ్చినది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారలేకపోతూ, గతంలోనే బతుకుతున్నది’. కొత్త దేశానికి వెళ్ళినవారి ఆశలు, ఆశయాలు నవలంతటా ప్రతిధ్వనిస్తాయి. నవల పాకిస్తాన్ దేశపు మొదటి పాతికేళ్ళనీ ఒక శరణార్థి దృష్టితో చూపిస్తుంది. లాహోర్ పట్టణానికి– చరిత్ర గురించి రూప్‌నగర్‌కు ఉన్నంత పట్టింపు ఉండదు. ‘సూర్యుడు, తుపాన్లు, వర్షం, పక్షి రెట్టల వల్ల తప్ప– దేశంలో కలిగిన సంక్షోభం– ఊర్లో ఉన్న ఏ బిల్డింగుకీ గతంతో సంబంధం కల్పించదు. ఉన్న కేంద్రీకరణంతా రాజకీయాల మీదే’. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడ్డాక, జాకిర్ ఆశావాదం మాయం అవుతుంది. ‘రూప్‌నగర్ సాంప్రదాయాలు, లాహోర్ నాగరికత కూడా పోయాయి. మాట్లాడగలిగేవారు మౌనంగా ఉన్నప్పుడు బూట్ల లేసులే మాట్లాడతాయి’ అన్న తండ్రి మాటలు తలచుకుంటాడు. మొదటి రోజున లాహోర్‌లో గమ్యం లేకుండా తిరుగుతూ, ‘సంతోషమైన రోజది. తాజా భూమి మీద, నిర్మలమైన ఆకాశం కింద నడిచాను. ఎంతో స్వచ్ఛంగా అనిపించింది’ అనుకున్న జాకిర్ కొన్నేళ్ళ తరువాత, ‘రోజులు మురికి పట్టాయి. ఆ రోజుల తేటదనం ఎక్కడ పోయిందో?’ అని దిగులు పడి, ‘నా అడుగులు ఏ భూమ్మీద పడుతున్నాయో!’ అన్న అయోమయ స్థితికి చేరతాడు. అబ్బూ చనిపోతూ, ఇంక తమది కాని పూర్వీకుల రూప్‌నగర్ ఇంటి తాళాలను జాకిర్ చేతుల్లో పెడుతూ, ‘ఇవి నమ్మకానికి చిహ్నం. దాన్ని కాపాడుకో. మనం వదిలిన భూమి, మనపై చూపిన దయని జాపకం పెట్టుకో. అదే నీ కర్తవ్యపాలన’ అని చెప్తాడు. ‘ఏ కథా అంతం అవదు. దానినుండి మరొక కొత్త కథ పుడుతుంది. అలా కథలు పుట్టుకొస్తూనే ఉంటాయి’ అనే హుసేన్– గతంలోనే కూరుకుపోకుండా, దానినుండి ప్రేరణ పొందుతారు. ఏ దేశాన్నీ సమర్థించరు. పుస్తకంలో–విభజన వివరాలు కానీ విషాదం కానీ కనిపించదు. ఒక కాలక్రమాన్ని పాటించని నవలకి నిర్దిష్టమైన ముగింపేదీ ఉండదు. 1979లో రాసిన యీ పుస్తకాన్ని ఉర్దూ నుండి ఇంగ్లిష్‌లోకి అనువదించినది ఫ్రాన్సిస్ డబ్ల్యూ ప్రిట్చెట్. -కృష్ణ వేణి -
1,400 కిమీ దూరం, 4 ఏళ్లు సా...గింది
బస్తీ, ఉత్తరప్రదేశ్ : బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి.. దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఈ పాట మన రైల్వేలకు చాలా బాగా సరిపోతుంది. మన రైల్లు గంటలు, నిమిషాలు మాత్రమే కాక అప్పుడప్పుడు రోజుల తరబడి కూడా ఆలస్యంగా నడుస్తుంటాయి. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే రైలు బండి మాత్రం ఏకంగా సంవత్సరాల తరబడి ఆలస్యంగా వచ్చింది. ఏపీ నుంచి యూపీకి అంటే దాదాపు 1, 400 కిమీ దూరాన్ని చేరడానికి ఈ గూడ్స్ వ్యాగన్ బండికి ఏకంగా నాలుగేళ్లు పట్టింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి చెందిన రామచంద్ర గుప్తా అనే వ్యాపారి ఆంధ్రప్రదేశ్, విశాఖపట్టణంలో ఉన్న ఇండియన్ పొటాషియమ్ లిమిటెడ్ (ఐపీఎల్) కంపెనీ నుంచి 1, 316 బస్తాల డీఏపీ ఎరువును బుక్ చేశాడు. దాంతో ఐపీఎల్ కంపెనీ ఈ ఎరువును సరఫరా చేసేందుకు రామచంద్ర గుప్తా పేరు మీద ఒక గూడ్స్ వ్యాగన్‌ను బుక్ చేశారు. సాధరంణంగా విశాఖ నుంచి యూపీలోని బస్తీని చేరడానికి పట్టే సమయం దాదాపు 42 గంటలు, అంటే మూడు రోజులు. కానీ మన రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ గూడ్స్ వ్యాగన్ యూపీకి చేరడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టింది. 2014 నవంబర్‌లో ప్రయాణం ప్రారంభించిన ఈ గూడ్స్ వ్యాగన్ ఈ రోజు (జులై 28) మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బస్తీని చేరుకుంది. దాంతో ఆశ్యర్యపోయిన రైల్వే అధికారులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2014లో ప్రయాణం ప్రారంభించిన ఈ వ్యాగన్ ఫిజికల్ కండిషన్ సరిగా లేకపోవడం చేత దానికి మరమత్తులు చేసే ఉద్దేశంతో బోగిని తప్పించారు. తరువాత ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇన్నాళ్ల తర్వాత దాన్ని తిరిగి తన గమ్యస్థానికి చేర్చే ప్రయత్నం చేశారు. ఫలితంగా దాదాపు 3 సంవత్సరాల 8 నెలల తర్వాత ఈ బోగీ బస్తీని చేరుకుంది. దాంతో రైల్వే అధికారులు రామచంద్ర గుప్తాకు ఈ వ్యాగన్ గురించి సమాచారం అందించారు. కానీ గుప్తా మాత్రం ఆ ఎరువులను తీసుకోవడానికి నిరాకరించారు. పాడైపోయిన ఈ ఎరువులను తీసుకుని ఏం చేసుకోవాలి అని ప్రశ్నించారు. అంతేకాక తాను గతంలోనే పలుమార్లు ఈ వ్యాగన్ గురించి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశానని కానీ వారు మాత్రం దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఇప్పుడు ఈ విషయం కంపెనీ యాజమాన్యం, రైల్వే బోర్డు మాట్లాడుకోని నిర్ణయించుకుంటారని తెలిపారు. వ్యాగన్‌లోని ఎరువుల ఖరీదు దాదాపు 10 లక్షల రూపాయల వరకూ ఉంటుందని తెలిపారు. -
సచ్చిదానంద్ మమ్మల్ని రేప్ చేశాడు: నలుగురు సాధ్వీలు
లక్నో: ఓ ఆశ్రమానికి చెందిన బాబా, అతని అనుచరులు తమపై వరుసగా అత్యాచారం జరుపుతూ.. చిత్రహింసలకు గురిచేశారని నలుగురు మహిళా భక్తులు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ ఆశ్రమంలో ప్రధాన గురువుగా ఉన్న బాబా సచ్చిదానంద్, అతని ఇద్దరు అనుచరులు తమపై అత్యాచారం జరిపారని మంగళవారం ఇద్దరు సాధ్వీలు ఆరోపించగా.. తాజాగా బుధవారం మరో ఇద్దరు సాధ్వీలు పోలీసులను ఆశ్రయించారు. సచ్చిదానంద, అతని ఇద్దరి అనుచరులు తమపై వరుసగా అత్యాచారం జరిపారని నలుగురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. బాధిత సాధ్వీలపై కొంతకాలంగా ఆశ్రమంలోని మహాంత్లు ఒత్తిడి తెచ్చారని, తమ లైంగిక కోరికలు తీర్చేందుకు నిరాకరించడంతో వారిని ఆశ్రమంలో బంధించి అత్యాచారం జరిపారని పోలీసుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. బస్తీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. బాధితులకు వైద్యపరీక్షలు నిర్వహించామని, కేసు దర్యాప్తు జరుగుతోందని బస్తీ జిల్లా ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. 2008 నుంచి తాము ఆశ్రమంలో నివసిస్తున్నామని సాధ్వీలు తెలిపారు. 'నేను ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చాను. 12 ఏళ్ల వయస్సులో 2008లో నేను ఇక్కడికి వచ్చాను. అమాయకురాలిని కావడంతో నాపట్ల ఏం జరిగిదో తెలిసేది కాదు. నేను నిరాకరించినా ఇక్కడి ముగ్గురు బాబాలు నాపై అత్యాచారం జరిపారు. నన్ను బందీగా ఉంచి.. కొడుతూ,, తరచూ అత్యాచారం జరిపారు' అని ఓ సాధ్వీ తెలిపారు. -
గాంధీనగర్ బస్తీ సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్
-
శ్రేయాన్ గొప్ప స్టార్ అవుతాడు
‘‘ఈరోజు ఫాదర్స్ డే. ఇంటర్నేషనల్ యెగా డే. అన్నింటినీ మించి మొదటిసారి కేసీఆర్‌గారు సినిమా వేడుకకు వచ్చిన రోజిది. దీన్నిబట్టి సినిమాల పట్ల, కళాకారుల పట్ల ఆయనుకున్న గౌరవం ఏంటో తెలుస్తోంది. సినిమా పరిశ్రమ ఒక బస్తీలాంటిది. చిన్న నిర్మాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. సినిమా పరిశ్రమను కేసీఆర్‌గారు కాపాడాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. వజ్మన్ ప్రొడక్షన్స్ పతాకంపై సహజ నటి జయసుధ తనయుడు శ్రేయాన్ని హీరోగా పరిచయం చేస్తూ, స్వీయదర్శకత్వంలో వాసు మంతెన రూపొందించిన చిత్రం ‘బస్తీ’. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఆడియో సీడీని కూడా ఆయనే ఆవిష్కరించి, దాసరికి ఇచ్చారు. ఈ వేదికపై దాసరి ఇంకా మాట్లాడుతూ -‘‘నా దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించింది జయసుధ. 43ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసింది. ఇప్పుడు తన బిడ్డని దర్శకుడు వాసు చేతుల్లో పెట్టింది. వాసు ఒకే ఒక్కసారి నన్ను కలిశాడు. అప్పుడే అతనికి ఎంత క్రియేటివిటీ ఉందో అర్థమైంది. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. శ్రేయాన్ గొప్ప స్టార్ అవుతాడు. కొత్త హీరోతో సినిమా తీయడం అంటే అంత సులువు కాదు. దానికి గట్స్ కావాలి’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘కేసీఆర్ ఆశీస్సులతో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి. ఆయనతో నాకు చనువు తక్కువ. రెండు, మూడు సార్లు కలిసినప్పుడు ఆయన ఆలోచనలు తెలుసుకునే అవకాశం దక్కింది. ఆ ఆలోచనలన్నీ సక్రమంగా జరిగితే భారతదేశంలోనే మన కేసీఆర్‌గారు నంబర్ వన్ ముఖ్యమంత్రి అవుతారు. ఇది అతిశయోక్తి కాదు. జయసుధ హీరోయిన్గా చేసిన ఓ సినిమాకి నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా క్లాప్ కొట్టాను. ఆ తర్వాత మేమిద్దరం కలిసి జంటగా నటించాం. నా బిడ్డల్లానే శ్రేయాన్ గొప్ప నటుడు కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.జయసుధ మాట్లాడుతూ - ‘‘మా అబ్బాయి సినిమాల్లోకి వస్తాడని ఊహించలేదు. ఎందుకంటే, తను స్పోర్ట్స్ పర్సన్. హఠాత్తుగా సినిమాల్లోకి రావాలనుకున్నాడు.. వచ్చాడు. నలభైమూడేళ్లుగా నన్ను ఆశీర్వదించినట్లుగానే మా అబ్బాయిని కూడా ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. వాసు మంతెన మాట్లాడుతూ -‘‘నా తొలి చిత్రం ఆడియో వేడుకను ఇంతమంది దిగ్గజాల సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది. నా జీవితంలో అపురూపమైన రోజిది. దర్శకుడిగా నేనెక్కడా శిక్షణ తీసుకోలేదు. ఒక సినిమా తీద్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు జయసుధగారు నన్ను ప్రోత్సహించి, నన్ను నమ్మి, వాళ్ల అబ్బాయిని నా చేతుల్లో పెట్టారు. ఇది వండర్ఫుల్ స్వీట్ స్టోరీ. శ్రేయాన్, ప్రగతి అద్భుతంగా నటించారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది’’ అని చెప్పారు. విచ్చేసిన అతిథులకు శ్రేయాన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ కొడాలి వెంకటేశ్వరరావు, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి. రామ్మోహనరావు, పార్లమెంట్ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, నిర్మాతలు డి. సురేశ్‌బాబు, ‘దిల్’ రాజు, లగడపాటి శ్రీధర్, యలమంచిలి సాయిబాబు, దర్శకులు కె. రాఘవేంద్రరావు, ఎన్ శంకర్, నటులు మురళీమోహన్, రాజశేఖర్, సీనియర్ నటీమణులు, దర్శకులు విజయనిర్మల, శ్రీప్రియ, నటి, దర్శకురాలు జీవిత, చిత్రసంగీతదర్శకుడు {పవీణ్ ఇమ్మడి, చిత్రకథానాయిక ప్రగతి తదితరులు పాల్గొన్నారు. -
నా ఇష్టాన్ని అమ్మ కాదనలేదు! - శ్రేయాన్
సహజ నటి జయసుధ తనయుడు శ్రేయాన్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయనున్నారు. వజ్మన్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రేయాన్, ప్రగతి జంటగా స్వీయదర్శకత్వంలో వాసు మంతెన నిర్మిస్తున్న చిత్రం ‘బస్తీ’. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. జయసుధ మాట్లాడుతూ -‘‘మా అబ్బాయి మొదటిసారిగా హీరోగా నటిస్తున్నాడు. ఓ అందమైన ప్రేమకథ ద్వారా మా అబ్బాయి పరిచయం అయితే బాగుంటుందనుకున్నారు. ఈ చిత్రానికి అలాంటి కథే కుదిరింది’’ అని అన్నారు. ‘‘అనుకోకుండా ఓ జంటకు ఓ సమస్య ఎదురవుతుంది. దాన్నుంచి ఆ జంట ఎలా తప్పించుకుంది? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. 36 రోజుల్లో సినిమా పూర్తి చేసి, 42 గంటల్లోనే డబ్బింగ్ పూర్తి చేశాం. ఈ నెల 21న పాటలను విడుదల చేస్తాం’’ అని దర్శక, నిర్మాత వాసు మంతెన చెప్పారు. శ్రేయాన్ మాట్లాడుతూ -‘‘క్రీడారంగం అంటే నాకు ఆసక్తి. జాతీయ స్థాయిలో ఓ పతకం కూడా గెల్చుకున్నా. పదో తరగతిలో ఉన్నప్పుడు లగడపాటి శ్రీధర్ ఓ సినిమాకి అడిగితే, ఇంట్రస్ట్ లేదన్నాను. మూడేళ్ల క్రితం ఆసక్తి ఏర్పడటంతో నటనలో శిక్షణ తీసుకున్నాను. నేను సినిమాల్లోకి రావడం అమ్మకిష్టం లేకపోయినా, నా కోసం ఒప్పుకుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మాటల రచయితలు వడ్డాలపు ప్రభాకర్, మని రాయపు రెడ్డి, ఛాయాగ్రాహకుడు వీకే గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.