నా ఇష్టాన్ని అమ్మ కాదనలేదు! - శ్రేయాన్ | Not deny my favorite mom! - shreyan | Sakshi
Sakshi News home page

నా ఇష్టాన్ని అమ్మ కాదనలేదు! - శ్రేయాన్

Jun 20 2015 12:03 AM | Updated on Sep 3 2017 4:01 AM

నా ఇష్టాన్ని అమ్మ కాదనలేదు! - శ్రేయాన్

నా ఇష్టాన్ని అమ్మ కాదనలేదు! - శ్రేయాన్

సహజ నటి జయసుధ తనయుడు శ్రేయాన్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయనున్నారు. వజ్మన్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రేయాన్, ప్రగతి జంటగా స్వీయదర్శకత్వంలో వాసు మంతెన నిర్మిస్తున్న చిత్రం ‘బస్తీ’.

సహజ నటి జయసుధ తనయుడు శ్రేయాన్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయనున్నారు. వజ్మన్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రేయాన్, ప్రగతి జంటగా స్వీయదర్శకత్వంలో వాసు మంతెన నిర్మిస్తున్న చిత్రం ‘బస్తీ’. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. జయసుధ మాట్లాడుతూ -‘‘మా అబ్బాయి మొదటిసారిగా హీరోగా నటిస్తున్నాడు.
 
 ఓ అందమైన ప్రేమకథ ద్వారా మా అబ్బాయి పరిచయం అయితే బాగుంటుందనుకున్నారు. ఈ చిత్రానికి అలాంటి కథే కుదిరింది’’ అని అన్నారు. ‘‘అనుకోకుండా ఓ జంటకు ఓ సమస్య ఎదురవుతుంది. దాన్నుంచి ఆ జంట ఎలా తప్పించుకుంది? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. 36 రోజుల్లో సినిమా పూర్తి చేసి, 42 గంటల్లోనే డబ్బింగ్ పూర్తి చేశాం. ఈ నెల 21న పాటలను విడుదల చేస్తాం’’ అని దర్శక, నిర్మాత వాసు మంతెన చెప్పారు.
 
 శ్రేయాన్ మాట్లాడుతూ -‘‘క్రీడారంగం అంటే నాకు ఆసక్తి. జాతీయ స్థాయిలో ఓ పతకం కూడా గెల్చుకున్నా. పదో తరగతిలో ఉన్నప్పుడు లగడపాటి శ్రీధర్ ఓ సినిమాకి అడిగితే, ఇంట్రస్ట్ లేదన్నాను. మూడేళ్ల క్రితం ఆసక్తి ఏర్పడటంతో నటనలో శిక్షణ తీసుకున్నాను. నేను సినిమాల్లోకి రావడం అమ్మకిష్టం లేకపోయినా, నా కోసం ఒప్పుకుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మాటల రచయితలు వడ్డాలపు ప్రభాకర్, మని రాయపు రెడ్డి, ఛాయాగ్రాహకుడు వీకే గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement