నా దగ్గర ఇలాంటి తిరకాసు ప్రశ్నలు వద్దు: జయసుధ | Jayasudha Comments On Kamal Haasan | Sakshi
Sakshi News home page

కమల్‌ హాసన్‌తో ఎక్కువ సినిమాలు.. అందుకే ఆ మాటలు: జయసుధ

Published Sun, Mar 10 2024 11:06 AM | Last Updated on Sun, Mar 10 2024 11:39 AM

Jayasudha Comments On Kamal Haasan - Sakshi

అలనాడు హీరోయిన్‌గా కుర్రకారు మనసులు దోచుకున్న జయసుధ.. ఇప్పుడు అమ్మగా, పెద్దమ్మగా, అమ్మమ్మగా.. నానమ్మగా మారి సహజనటిగా తెరపై అలరిస్తూనే ఉన్నారు. సుమారుగా 50 ఏళ్లుగా వెండితెరపై తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. జయసుధ అద్భుతంగా నటించగల గొప్ప స్టార్. అందుకే, ఆమె మాత్రమే 'సహజనటి' అవగలిగింది. బాలనటిగా గ్లామర్ ప్రపంచంలో కాలుమోపిన జయసుధ హీరోయిన్ గా అన్ని విధాల పాత్రల్ని అవలీలగా చేసింది. నటన ఆమె ప్రధానమైన బలమైనప్పటికీ కమర్షియల్, గ్లామర్ రోల్స్ కి కూడా జయసుధ ఎన్నోసార్లు వన్నెతెచ్చింది.

ఈ క్రమంలో ఆమె సౌత్‌ ఇండియాలోని స్టార్‌ హీరోలకు ధీటుగా అభిమానులను సొంతం చేసుకుంది. 350కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్‌ హాసన్‌, తనపై వస్తున్న రూమర్స్‌ గురించి స్పందించారు. కమల్‌తో జయసుధ పెళ్లంటూ అప్పట్లో జరిగిన ప్రచారంపై రియాక్ట్‌ అయ్యారు. ముందుగా ఆ ప్రశ్న ఎదురు అయిన వెంటనే ఆమె చాలా అసహనానికి లోనయ్యారు. ప్రశ్న అడిగిన వ్యక్తితో చాలా ఎళ్లుగా పరిచయం ఉంది కాబట్టి ఏం అనలేక వదిలేస్తున్నాను అంటూనే ఎంతో హూందాగా సమాధానం చెప్పారు.

'ఇప్పుడు కమల్‌తో పెళ్లి విషయం అవసరమా? చాలామంది పాత సంగతులను  ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి..? ఆ రోజుల్లో    బాలచందర్ గారు తీసిన చాలా సినిమాల్లో కమల్‌తో పాటుగా నేను నటించాను. ఆ సినిమాలకి సంబంధించిన పలు పాటలను స్టేజ్ పై ఇద్దరమూ పాడే వారం. వాస్తవంగా కమల్ మంచి సింగర్. ఆయనతో పాటు నేను కూడా పాటలు పాడేదానిని. ఆ సమయంలో మా పెయిర్‌ బాగుందని అందరూ అనేవారు. అందువలన మేము జంటగా ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుని ఉండొచ్చు.

ఈ విషయంపై అప్పట్లో కొన్ని తమిళ పేపర్లు రాసి ఉండొచ్చు. పత్రికల వాళ్లు ఏదో ఒకటి రాయకపోతే ఎలా..? దీంతో అలాంటి తప్పుడు ప్రచారం జరిగి ఉంటుంది. వాస్తవంగా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారనే చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు.  నేను గొప్పనటిని అంటున్నందుకు సంతోషమే కానీ ఇలాంటి తిరకాసు ప్రశ్నలు అడిగితే మాత్రం సమాధానం చెప్పను.' అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement