సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన కల్పించామని.. త్వరలోనే హైడ్రా పోలీస్‌స్టేషన్ (Hydra Police Station) ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చెరువులు, కుంటలను కబ్జాల నుంచి కాపాడుతున్నామన్నారు. శాటిలైట్ చిత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆక్రమణలను గుర్తిస్తున్నాం. ఇప్పటివరకు 5,023 ఫిర్యాదులు మాకు అందాయి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తాం’’ అని రంగనాథ్ చెప్పారు.
‘‘300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం. చెరువుల పునరుద్ధరణకు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటాం. హైడ్రా కూల్చివేతలు(Hydra demolitions) ఆగవు. కొంత గ్యాప్ మాత్రమే వచ్చిందన్న రంగనాథ్.. ఎఫ్‌టిఎల్ గుర్తింపు తరువాత హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయన్నారు. హైడ్రాకు 15 టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. హైడ్రా నోటీసులు ఇవ్వదు. వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కమిషనర్ స్పష్టం చేశారు.
‘‘హైడ్రా అనగానే కూల్చడం అనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. త్వరలో హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల పునరుద్ధరణ చేయబోతున్నాం. హైడ్రా ఆధ్వర్యంలో త్వరలో ఎఫ్‌ఎం ఛానెల్ రాబోతుంది. కబ్జాలు చేసి నిర్మాణాలు చేపడితే హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుంది. కొత్తగా కొనుగోలు చేసే వాళ్లు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాతే కొనుగోలు చేయాలి. హైడ్రా ఆధ్వర్యంలో ఎఫ్‌టిఎల్ లిస్ట్ త్వరలో వెబ్‌సైట్‌లో పెడతాం. చెరువుల వద్ద ఉన్న షెడ్స్ కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
..హైడ్రా 12 వందల చెరువులను గుర్తించింది. హైడ్రాపై కొందరు గిట్టని వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను కబ్జాకు గురైతే వదిలేద్దామా?. త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయి. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. ఎఫ్‌టీఎల్ గుర్తించిన తరువాత అనధికారిక నిర్మాణాలు అయితే కఠిన చర్యలు తప్పవు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 550 చెరువుల ఎఫ్‌టీఎల్ వర్క్ నడుస్తోంది. పేదలను ముందు చూపి వెనకాల మాఫియా వేరే ఉంటుంది. మూసీ రివర్ ప్రాజెక్ట్‌కు, హైడ్రాకు సంబంధం లేదు. మూసీలో కబ్జాలపై హైడ్రా ఫోకస్ పెట్టనుంది. కబ్జా నిర్మాణాలను హైడ్రా కచ్చితంగా కూల్చుతుంది. ఇప్పటికే పలువురు బిల్డర్స్‌కి వార్నింగ్ ఇచ్చాము. మూసీ కబ్జాలపై చర్యలు ఉంటాయి కానీ మూసి రివర్ ప్రాజెక్ట్‌కు హైడ్రాకు సంబంధం లేదు. 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది.
..హైడ్రా ఛైర్మన్‌గా సీఎం ఉంటారు. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా మా వద్ద ఉంది. సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇమేజ్ రికార్డులు సేకరించాం. హైడ్రాపై సోషల్ మీడియాలో మాత్రమే తప్పుడు ప్రచారం చేశారు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నా ఇళ్లు బఫర్ ఎఫ్‌టిఎల్‌లో లేదు. ఎఫ్‌టిఎల్ బఫర్ జోన్ అంటే చెరువుపైనే వస్తుంది. నా ఇల్లు చెరువుకి కింద కిలో మీటర్ దూరంలో ఉంటుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లు చర్యలు ఎదుర్కొంటారు’’ అని రంగనాథ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు..
Comments
Please login to add a commentAdd a comment