
సాక్షి,హైదరాబాద్:హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్(హైడ్రా) కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవి రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా తనపై కేసు పెట్టడంపై దానం మంగళవారం(ఆగస్టు13) మీడియాతో మాట్లాడారు.
‘ఆయనకు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లుంది. అందుకే నాపై కేసు పెట్టాడు. సీఎంకు ఫిర్యాదు చేస్తా. అధికారులు వస్తుంటారు పోతుంటారు. కానీ నేను లోకల్ నందగిరి హిల్స్ హుడా లే ఔట్‌లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందునే నేను అక్కడకి వెళ్లాను. జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్ళాను.
నందగిరి హిల్స్ హుడా లే ఔట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజీషన్ నోటీసులు ఇస్తా. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా. ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది... నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు’అని దానం ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment