సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు
దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే ఎంపీగా పోటీ
కాంగ్రెస్ అధిష్టానం స్పష్టీకరణ.. ససేమిరా అంటే బరిలో మరొకరు!
సీఎం రేవంత్‌ను కలసిన బీఆర్‌ఎస్ ఎంపీ కేకే
కడియం శ్రీహరి నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షీ, ఇతర నేతలు
నేడు కాంగ్రెస్‌లో చేరనున్న కేకే కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి
కేకే, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఎప్పుడు చేరతారన్నదానిపై అస్పష్టత..
సుదీర్ఘంగా టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ
తుక్కుగూడ సభ ఏర్పాట్లు, లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చ
రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్‌ఎస్ కీలక నేతలు పార్టీని వీడుతుండటం కలకలం రేపుతోంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీకి దింపుతామని కాంగ్రెస్ అధిష్టానం తేల్చినట్టు వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. దీనికితోడు మంత్రి కోమటిరెడ్డి కూడా దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేస్తే ఇబ్బందులు వస్తాయని వ్యాఖ్యానించారు. ఇక వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించే సభ, లోక్‌సభ మేనిఫెస్టోపై చర్చించేందుకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ శుక్రవారం భేటీ అయింది.
కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యను కలిసిన దీపాదాస్ మున్షీ, మల్లురవి, సంపత్ కుమార్
అంతకుముందు గాం«దీభవన్ వేదికగా టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ అయింది. ఇక బీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, మల్లు రవి, ఇతర నేతలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌లోకి ఆహ్వనించారు. కె. కేశవరావు కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా చేరేందుకు రంగం సిద్ధమైంది. నర్సాపూర్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కూడా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. – సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment