సాక్షి,హైదరాబాద్:అమీన్‌పూర్ కూల్చివేతలపై విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్,అమీన్‌పూర్ ఎమ్మార్వోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్‌పూర్ మండలం శ్రీకృష్ణానగర్‌లో మహమ్మద్ రఫీకి చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడంపై హైకోర్టుకు రంగనాథ్ వివరణ ఇచ్చారు. అమీన్‌పూర్ కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని తెలిపారు. విచారణకు రంగనాథ్ సోమవారం(సెప్టెంబర్30) ఉదయం హైకోర్టు ముందు వర్చువల్‌గా హాజరయ్యారు.
సెప్టెంబర్ 5వ తేదీన తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఆసుపత్రి భవనాన్ని ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం ఎలా కూలుస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా అని నిలదీసింది. తాము అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఈ సందర్భంగా హైకోర్టు చురకంటించింది. అమీన్‌పూర్ గురించి అడిగితే కావేరి హిల్స్‌పై సమాధానం ఎందుకు చెప్తున్నారని సున్నితంగా మందలించింది.
హైడ్రాకు కూల్చివేతలు తప్ప వేరే పాలసీ లేదని ప్రజలనుకుంటున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.అధికారుల వివరణపై సంతృప్తి చెందని హైకోర్టు అమీన్‌పూర్ కూల్చివేతలపై స్టే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. హైడ్రాతో పాటు అమీన్‌పూర్ ఎమ్మార్వో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.
చార్మినార్ ఎమ్మార్వో చెబితే చార్మినార్ కూల్చేస్తారా..హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- ఎన్ని చెరువులకు ఎఫ్‌టీఎల్ ఫిక్స్ చేశారు
- చెరువుల్లో వర్షపు నీరు చేరకపోవడంపై ఏం చర్యలు తీసుకున్నారు
- అసలు విషయాలు వదిలేసి కూల్చివేతలెందుకు
- చార్మినార్ కూల్చేయమంటే కూల్చేస్తారా
- కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో ఎలా కూల్చివేతలు చేపడతారు
- కూల్చివేతలు ఇలానే చేస్తే ఇంటికెళ్లిపోతారు
- హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పండి
- కూల్చివేతలు తప్ప మీకు వేరే పాలసీ ఏం లేనట్లుంది
- అమీన్‌పూర్‌పై మాత్రమే సమాధానం చెప్పండి
- కావేరిహిల్స్ గురించి మేం అడగలేదు
- అనుమతులిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టండి
- ప్రభుత్వ భూముల్ని రక్షించండి.. మేం అండగా ఉంటాం
- ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదు
- ప్రభుత్వ శాఖలకు ఆదాయం కావాలి
- మీ బాస్‌లను సంతృప్తి పరిచేలా పనులు చేయొద్దు
- సామాన్యులు, పెద్ద వాళ్ల మధ్య వ్యత్యాసం చూపిస్తున్నారు
- ఆదివారం కూల్చడం ఏంటి?
- భయపెట్టాలని చూస్తున్నారా?
- వీకెండ్‌లోనే కూల్చివేతలు ఎందుకు
- కూల్చివేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా
- చట్ట వ్యతిరేకంగా పనిచేసే అధికారులను చంచల్‌గూడ, చర్లపల్లికి పంపిస్తాం
ఇదీ చదవండి: కూల్చివేతలపై వెనక్కి..!
Comments
Please login to add a commentAdd a comment