స‌ర్వే ఆఫ్ ఇండియా ఆఫీసుకు హైడ్రా.. 1971 నాటి మ్యాప్‌ల పరిశీలన | HYDRA Ranganath Review Meeting At Survey Of India Office | Sakshi
Sakshi News home page

స‌ర్వే ఆఫ్ ఇండియా ఆఫీసుకు హైడ్రా.. 1971 నాటి మ్యాప్‌ల పరిశీలన

Published Tue, Oct 8 2024 7:47 PM | Last Updated on Tue, Oct 8 2024 8:01 PM

 HYDRA Ranganath Review Meeting At Survey Of India Office

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో హైడ్రా అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు, ఏ చోటకు హైడ్రా అధికారులు వస్తారోనని టెన్షన్‌ పడుతున్నారు. ఇక, పలుచోట్ల అక్రమ నిర్మాణాలను టార్గెట్‌ చేస్తూ హైడ్రా ముందుకు సాగుతోంది. మరోవైపు.. కబ్జాలకు గురైన చెరువులను గుర్తించేందుకు హైడ్రా భారీ కసరత్తు చేస్తోంది.

గొలుసు క‌ట్టు చెరువుల‌కు ప్ర‌సిద్ధి చెందిన న‌గ‌రంలో అసలు ఎన్ని చెరువులుండేవి?. ఇప్పుడు ఎన్ని ఉన్నాయనే లెక్క‌లు తేల్చేందుకు స‌ర్వే ఆఫ్ ఇండియాతో క‌లిసి హైడ్రా ప‌ని చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో చెరువులను గుర్తించేందుకు మంగళవారం సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయంలో హైడ్రా అధికారులు సమీక్ష చేపట్టారు. హ‌బ్సీగూడలో ఉన్న స‌ర్వే ఆఫ్ ఇండియా కార్యాల‌యానికి మంగ‌ళ‌వారం హైడ్రా అధికారుల బృందంతో వెళ్లారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌. స‌ర్వే ఆఫ్ ఇండియా డైరెక్ట‌ర్ బీసీ ప‌రీడా, సూప‌రింటెండెంట్ ఆఫ్ స‌ర్వే డేబ‌బ్ర‌త పాలిట్‌తో పాటు ఇత‌ర అధికారుల‌తో హైడ్రా ఉన్న‌తాధికారుల‌ స‌మావేశమయ్యారు. ఈ సందర్భంగా స‌ర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన పాత మ్యాప్‌లను కమిషనర్‌ రంగనాథ్‌ పరిశీలించారు.

1971-72 స‌ర్వే ప్ర‌కారం న‌గ‌రంలో ఎన్ని చెరువులు ఉన్నాయి. చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉండేవి. ప్ర‌స్తుతం వాటి ప‌రిస్థ‌తి ఏంటి?. నాలాలు ఎలా.. ఎంత విస్తీర్ణంలో ఉండేవి. ఇప్పుడు ఎంత మేర క‌బ్జా అయ్యాయి అనే అంశాలను మ్యాప్‌ల ద్వారా పరిశీలించారు. ద‌శాబ్దాల క్రితం నాటి మ్యాప్‌ల‌తో పాటు.. నేటి ప‌రిస్థితిని స‌రిపోల్చుతూ చెరువులు, నాలాల వివ‌రాల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌ద‌ర్శ‌న ద్వారా కమిషనర్‌కు వివ‌రించారు స‌ర్వే ఆఫ్ ఇండియా అధికారులు. ఇప్ప‌టికే హెచ్ఎండీఏ, ఇరిగేష‌న్‌, జీహెచ్ఎంసీ నుంచి సేక‌రించిన చెరువుల జాబితాతో.. స‌ర్వే ఆఫ్ ఇండియా వ‌ద్ద ఉన్న స‌మాచారాన్ని క్రోఢీక‌రించి చెరువులు, నాలాల ప‌రిస్థితి, క‌నుమ‌రుగైన చెరువులపై అవ‌గాహ‌న‌ కల్పించారు. ఈ నేపథ్యంలో చెరువులను ఆక్రమించి కట్టిన మరిన్ని కట్టడాలను హైడ్రా కూల్చివేసే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి: పవన్‌ కల్యాణ్‌పై కేఏ పాల్‌ ఫిర్యాదు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement