పవన్‌ కల్యాణ్‌పై కేఏ పాల్‌ ఫిర్యాదు | Tirupati Laddu Row: KA Paul Files Complaint Against Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌పై కేఏ పాల్‌ ఫిర్యాదు

Published Tue, Oct 8 2024 8:21 AM | Last Updated on Tue, Oct 8 2024 9:19 AM

Tirupati Laddu Row: KA Paul Files Complaint Against Pawan Kalyan

పంజగుట్ట (హైదరాబాద్‌): తిరుపతి లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కేఏ పాల్‌ సోమవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పాల్‌ మాట్లాడుతూ లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధపు మాటలు మాట్లాడారని, లడ్డూపై విచారణ జరిగిందే జూన్‌లో కాగా, అయోధ్య ప్రారంభోత్సవం జనవరిలో జరిగిందని కల్తీ ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. 

14 సెక్షన్ల కింద ఫిర్యాదు చేశానని,ఆర్టికల్‌ 8 ప్రకారం ఆయన్ను వెంటనే ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని, లేదా ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పవన్‌కల్యాణ్‌కు ఎవరు స్క్రిప్ట్‌ ఇస్తే.. అది సినిమాలో మాదిరి చదువుతున్నాడని, గతంలోనే చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఏపీ స్పీకర్, గవర్నర్, దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఛీప్‌ జస్టిస్, సీబీఐ అతనిపై విచారణ చేయాలని, వెంటనే పవన్‌కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement