సాక్షి,హైదరాబాద్ : తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్‌లో లేదు. మధురా నగర్‌లో మేం ఉంటున్న ఇల్లుని 4 దశాబ్దాల క్రితం మా తండ్రి నిర్మించారు. కృష్ణకాంత్ పార్కు దిగువున వున్న వేలాది ఇళ్ళ తర్వాత మా ఇల్లు ఉంది.
మా తండ్రి నిర్మించిన ఈ ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఒకప్పటి పెద్ద చెరువునే రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే.
అయినప్పటికీ చెరువు కట్టకు దిగువున10 మీటర్లు దాటితే.. కింద ఉన్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావు. చెరువు కట్టకు దాదాపు కిలో మీటర్ దూరంలో మా ఇల్లు ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment