buffer zone
-
హైదరాబాద్‌లో చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే: హైకోర్టు
హైదరాబాద్: నగరంలోని అన్ని చెరువులపై పూర్తి పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని జులైలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలపగా.. వాటన్నింటికీ బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ నిర్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.రామమ్మ చెరువు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇవాళ హెచ్ఎండీఏ కమిషనర్ విచారణకు హాజరై.. ఇప్పటి వరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్టు తెలిపారు. అలాగే.. 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు పూర్తయినట్టు వెల్లడించారు. అయితే..మూడు నెలల్లోగా హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధరిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబరు 30కి వాయిదా వేసింది. -
మా ఇల్లు బఫర్ జోన్లో లేదు : హైడ్రా కమిషనర్ రంగనాథ్
సాక్షి,హైదరాబాద్ : తన ఇల్లు బఫర్ జోన్లో ఉందంటూ సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్లో లేదు. మధురా నగర్లో మేం ఉంటున్న ఇల్లుని 4 దశాబ్దాల క్రితం మా తండ్రి నిర్మించారు. కృష్ణకాంత్ పార్కు దిగువున వున్న వేలాది ఇళ్ళ తర్వాత మా ఇల్లు ఉంది. మా తండ్రి నిర్మించిన ఈ ఇల్లు బఫర్ జోన్లో ఉందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఒకప్పటి పెద్ద చెరువునే రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చెరువు కట్టకు దిగువున10 మీటర్లు దాటితే.. కింద ఉన్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావు. చెరువు కట్టకు దాదాపు కిలో మీటర్ దూరంలో మా ఇల్లు ఉంది. వాస్తవాలు ఇలా ఉంటే తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. -
తొలుత బాపూఘాట్ వరకే!
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై కసరత్తు ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలిదశలో బాపూఘాట్ ప్రాంతం వరకే పనులను పరిమితం చేయాలని భావిస్తోంది. నదీ తలంతోపాటు బఫర్ జోన్‌లోని నిర్మాణాల తొలగింపులో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నగర శివార్లలోని బాపూఘాట్ వరకు పునరుజ్జీవం, సుందరీకరణ పనులు పూర్తిచేశాక.. దానిని నమూనాగా చూపి హైదరాబాద్ నగరం నడిబొడ్డున మిగతా పనులు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. భూసేకరణ సమస్య లేకపోవడంతో.. వికారాబాద్ అడవుల్లో జన్మంచే మూసీ నది.. ఈసీ, మూసా అనే రెండు పాయలుగా ప్రవహిస్తూ వచి్చ, లంగర్‌హౌజ్ ప్రాంతంలోని బాపూఘాట్ వద్ద సంగమిస్తుంది. ఇందులో ఈసీపై హిమాయత్‌సాగర్, మూసాపై ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ రిజర్వాయర్ల దిగువ నుంచి ఈసీ, మూసా నదుల సంగమం బాపూఘాట్ వరకు భూసేకరణ సమస్యలు పెద్దగా ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. రెండు నది పాయల తీరప్రాంతం, బాపూఘాట్‌ను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇందుకు అనుగుణంగా విభిన్న ప్రణాళికలు, నమూనాలతో సీఎం అధ్యక్షతన మూసీ పునరుజ్జీవంపై త్వరలో జరిగే భేటీకి రావాల్సిందిగా ప్రాజెక్టు కన్సల్టెంట్లను ఆదేశించింది. నిజానికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు స్థితిగతులపై రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ జరిగింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు, కన్సల్టెంట్ సంస్థ మెయిన్‌హార్ట్ కన్సార్షియం ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ కోసం చేపట్టాల్సిన పనులపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా ‘బఫర్’ మూసీకి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా గుర్తించాలని ఇప్పటికే నిర్ణయించినా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బఫర్ జోన్‌ను డిజైన్ చేయాలని సర్కారు భావిస్తోంది. భవిష్యత్తులో మూసీకి ఇరువైపులా రోడ్లు, వంతెనలు, భారీ కూడళ్లు, మెట్రో రైలు మార్గం వంటివి నిర్మించేందుకు వీలుగా ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తారు. బఫర్ జోన్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, రాళ్లు, వ్యర్థాలను తొలగించి సమతలం చేస్తారు.ప్రభుత్వ భూముల లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ విభిన్న డిజైన్లలో పర్యాటకులను ఆకర్షించేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. అయితే.. బాపూఘాట్ సమీపంలో ఈసీ, మూసా నదుల సంగమం తీర ప్రాంతంలో రక్షణశాఖ భూములు ఉన్నాయి. ఆ భూముల వివరాలను రెవెన్యూ విభాగం ద్వారా సేకరించి.. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు కేటాయించేలా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా బాపూఘాట్ ⇒ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూ ఘాట్ ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటకులను ఆకర్షించేలా బాపూఘాట్ వద్ద స్కైవే, బ్రిడ్జితో కూడిన బరాజ్, పాదచారుల వంతెనను నిర్మించేలా నమూనాలు, ప్రణాళికలు సిద్ధం చేసే బాధ్యతను కన్సల్టెంట్‌కు అప్పగించారు. బాపూఘాట్‌కు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రతి బింబించేలా ఈ డిజైన్లు, ప్రణాళికలు ఉంటాయి.గుజరాత్‌లోని నర్మదానది వద్ద నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం తరహాలో బాపూఘాట్ వద్ద మహాత్మాగాంధీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయా లని భావిస్తున్నారు. ఇక ఈసీ, మూసా సంగమ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని కన్సల్టెంట్‌ను ఆదేశించారు. సంగమ స్థలం వద్ద మహాప్రస్థానం, స్నాన ఘట్టాలతో ఘాట్ల నిర్మాణం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఉస్మాన్‌సాగర్‌కు గోదావరి జలాలు ⇒ జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వర కు భారీ అభివృద్ధి ప్రణాళికల నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, సేకరించాల్సిన భూమిపై రెవెన్యూ శాఖ కసరత్తు చేయాల్సి ఉంది. గోదావరి జలాలను హి మాయత్‌సాగర్ మీదుగా ఉస్మాన్‌సాగర్‌కు తరలించేందుకు కాలువ తవ్వాలా లేక టన్నె ల్ నిర్మించాలా? అన్న అంశాలను తేల్చే బా ధ్యతను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు కు అప్పగించారు. ఈ నెల 24న జరిగిన సమావేశంలో వీటిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ మరో సమావేశం ఏర్పాటు చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
చిరుద్యోగిని సస్పెండ్ చేసి.. అక్రమాలపై ‘మట్టి’ కప్పి..
సాక్షి, విశాఖపట్నం: ఎర్రమట్టి దిబ్బల్ని టీడీపీ నేతలు ధ్వంసం చేసిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం విచారణను మమ అనిపించేసింది. ఓ చిరుద్యోగిని బలి చేసి, అసలు పాత్రధారులు, సూత్రధారులైన కూటమి నేతల్ని పక్కకి తప్పించేసింది. భౌగోళిక వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బల్ని పరిరక్షించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బఫర్ జోన్‌ని దాటి అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న దారుణాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ‘మట్టి దిబ్బలు మటాష్.!’ శీర్షికతో బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనంతో కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడింది. అధికార కూటమి నేతలే ఎర్రమట్టి దిబ్బల్ని హరిస్తుండటంతో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు నాటకమాడింది. ప్రభుత్వ ఆదేశంతో జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) మయూర్ అశోక్, రెవెన్యూ, గనులశాఖ అధికారులు బుధవారం ఆ ప్రాంతాన్ని మొక్కుబడిగా పరిశీలించారు. అక్రమ తవ్వకాలపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా చేస్తున్న పనులను వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణకు ఆదేశించారు. స్థానిక అధికారులదే తప్పని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ హడావుడి చేశారు. ఈ ప్రాంతాన్ని సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించారు. ఎంత విస్తీర్ణంలో తవ్వేశారో గనుల శాఖ అధికారులు కూడా లెక్కలు వేస్తున్నారు. వెంటనే ఇక్కడ తవ్వకాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.చిరుద్యోగిపై చర్యఎర్రమట్టి దిబ్బలు నిడిగడ్డు సచివాలయం పరిధిలో ఉండటంతో ఆ సచివాలయం ఇన్చార్జి ప్లానింగ్ సెక్రటరీ కాగిత అజయ్‌కుమార్ సరిగా స్పందించలేదని ఆయన్ని సస్పెండ్ చేశారు. వాస్తవానికి అజయ్‌కుమార్ భీమిలి తోట వీధి సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ. నిడిగడ్డుకు ఇన్చార్జిగా వచ్చారు. తుది విచారణలోనూ ఉద్యోగుల్నే బలి చేయాలని, నేతల పేర్లు బయటికి తేవద్దంటూ ఇప్పటికే జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బఫర్ జోన్‌కు బయట 70, 80 ఏళ్లుగా జీడి తోటలు వేసుకొన్న రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ చేసిన వ్యవహారంపై బాబు, పవన్ పెద్ద రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చిన నెలలోనే టీడీపీ, జనసేన నేతలు కుమ్మక్కై బఫర్‌జోన్ దాటి తవ్వకాలు జరిపి మట్టి తరలించేస్తున్నారు. దీనిపై సాక్షి కథనంతో ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. పవన్ ఇప్పుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉండి స్పందించకపోవడాన్ని తప్పుబడుతున్నారు.ప్రభుత్వ పెద్దల సహకారంతోనే తవ్వకాలుకొమ్మాది: ప్రభుత్వ పెద్దల సహకారంతో, స్థానిక కూటమి నేతల మద్దతుతోనే ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం తవ్వకాల వద్ద సెల్ఫీ తీసుకుని ఈమేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాబు కూటమి అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లో భౌగోళిక వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి ఇదంటూ పోస్టు చేశారు. -
బఫర్ జోన్లో ఎలా నిర్మిస్తారు?
సాక్షి, హైదరాబాద్: నగ రంలోని రామ్మమ్మ కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎలాంటి నిర్మా ణం చేపట్టడం లేదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు ఆదేశించింది. చట్టబద్ధమైన సంస్థ అయిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహ నం వ్యక్తం చేసింది. నగరంలోని చెరువులు, కుంటలు ఇతర నీటి వనరుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణకు నోటిఫికేషన్ జారీ చేయాలని, దీన్ని తదుపరి విచారణ రోజున కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ని కుంటలు, చెరువులకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్స్ చేశారు.. ఇంకా ఎన్ని చేయా లి.. పూర్తి వివరాలతో రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని చెప్పింది. రామ్మమ్మ కుంట బఫర్ జోన్ పరిధిలోని 4 ఎకరాల స్థలంలో టూరిజం పేరిట నిర్మిస్తున్న భవనానికి అక్రమంగా ఆడిటోరియం, అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నా పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై తీవ్రంగా మండిపడింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. స్టేటస్ కో ఆదేశాలను ఎత్తివేయాలని కోరిన ప్రభుత్వం రామ్మమ్మ కుంట బఫర్ జోన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం భవనం నిర్మించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం జూన్‌లో స్టేటస్ కో విధించింది.మళ్లీ ఈ పిటిషన్ గురువారం సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం ముందు విచారణకొచ్చింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే భవన నిర్మాణం దాదాపు పూర్తయిందని, భవనాన్ని పెంచడానికి అన్ని అనుమతులున్నందున స్టేటస్ కో ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు. అక్కడ విద్యనభ్య సిస్తున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. రామ్మమ్మ కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మ్యాప్‌ను పరిశీలించిన ధర్మాసనం.. భవనంలో ఎక్కువ భాగం బఫర్ జోన్లో లేదని, కొద్దిభాగం మాత్రమే ఉందంది. స్టేటస్ కో ఆదేశాలను సవరిస్తూ బఫర్ జోన్లోకి రాకుండా భవన నిర్మాణం చేసుకోవచ్చని చెప్పింది. -
చైనా బల ప్రదర్శన.. ఏకంగా 27 విమానాలు బఫర్ జోన్లో ప్రవేశం
తైవాన్: చైనా దేశం తైవాన్‌పై మరోసారి బలప్రదర్శనకు దిగింది. తమ యుద్ధవిమానాలను తైవాన్ గగనతలంలోకి పంపించింది. మొత్తం 27 విమానాలు బఫర్ జోన్లోకి ప్రవేశించాయని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. తమ యుద్ధవిమానాల ద్వారా హెచ్చరించగా.. చైనా విమానాలు పసిఫిక్ మహా సముద్రం మీదుగా వెనుతిరిగాయని అధికారులు తెలిపారు. చదవండి: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ప్రకంపనలు..భారత్‌లోనూ దడ ఏడాది కాలంగా తైవాన్‌పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుతూ.. చైనా ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో 150కిపైగా యుద్ధ విమానాలను తైవాన్ దేశం మీదకు వెళ్లాయి. కాగా, తైవాన్ను తన అంతర్భాగంగా చెబుతున్న చైనా.. ఆ దేశాన్ని పూర్తిగా తమలో కలుపుకుంటామని, అవసరమైతే సైనిక చర్యకూ వెనకాడబోయేది లేదంటోంది. -
వీటిల్లో కొంటే అంతే!
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొనుగోలు చేయొద్దు సాక్షి, హైదరాబాద్: ప్రతి రోజు ఎక్కడో అక్కడ అక్రమ నిర్మాణం అనో, బఫర్ జోన్‌లోనో, ఎఫ్టీఎల్లోనో అపార్ట్మెంట్ కట్టారనో వింటుంటాం. తక్కువ ధరకు వస్తుందనో లేక లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్నారనో తొందరపడి ఫ్లాట్ కొన్నారో ఇక అంతే సంగతులు. అసలు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలుసా? లేకపోతే కష్టపడి సంపాదించిన సొమ్ము కాంక్రీట్ పాలవడం తప్పదంటున్నారు నిపుణులు. బఫర్ జోన్ అంటే: బఫర్ జోన్ అంటే నీటి పరీవాహక ప్రాంతం. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు పారుతుంటుంది. దీన్ని అలుగు అంటారు. ఇక్కడి నుంచి పొలాలకు నీరు మళ్లుతుంటుంది. ఈ మధ్య ఉన్న ప్రాంతాన్నే అంటే చెరువుకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారన్నమాట. ఉస్మాన్‌సాగర్ కింద ఉన్న భూములన్నీ బఫర్‌జోన్ కిందికే వస్తాయి. ఈ కింద ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించకూడదు. కొనకూడదు కూడా. ఎఫ్టీఎల్ అంటే: ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) అంటే చెరువు కట్ట ప్రాంతం. ఈ ప్రాంతం నీటి పారుదల శాఖ విభాగం కిందికొస్తుంది. చెరువు కట్ట ప్రాంతంను ఆనుకొని నగరంలో బడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే వీటిలో ఫ్లాట్ కొనేముందు కొనుగోలుదారులు కొన్ని కీలక పత్రాలు చూడాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రాంతంలోని నిర్మాణాలకు నీటి పారుదల శాఖ నుంచి «ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అలాగే సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఎంఆర్ఓ), జీహెచ్ఎంసీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ మూడు పత్రాల్లో ఏ ఒక్కటీ లేకపోయినా సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కులు ప్రభుత్వానికుంది. ఫ్లాట్లు కొన్న కొనుగోలుదారులు కోర్టుకెళ్లినా లాభముండదు. -
అక్కడ కొంటే కాస్త జాగ్రత్త
యథేచ్ఛగా 111 జీవోలో వెంచర్లు, ప్రాజెక్ట్‌లు {పగతి ఇక్కడేనంటూ నిలువెల్లా ముంచేస్తున్న బిల్డర్లు అసలు నిర్మాణాలే చేపట్టరాదంటున్న జీవో ఎన్నారై అయిన శ్రీధర్.. భాగ్యనగరంలో స్థిరాస్తి కొనుగోలుకు ముందడుగేశాడు. విమానాశ్రయం ఉందనో.. ఔటర్‌కు దగ్గరుందనో.. మెట్రో రానుందనో.. చెప్పి.. ఫ్లాటో/ప్లాటో కొనకపోతే సువర్ణావకాశాన్ని కోల్పోయినట్టేనని బిల్డర్లు, రియల్టర్లు నమ్మించారు. దీంతో తొందరపడి స్థిరాస్తిని కొనుగోలు చేశాడతను. తీరా చూస్తే.. తాను కొన్న స్థిరాస్తి బయో కన్జర్వేషన్ జోన్ కిందికొస్తుందని.. అసలక్కడ ఎలాంటి శాశ్వత నిర్మాణాలూ చేపట్టరాదని తెలిసింది. దీంతో ఎటూ పాలుపోలేదు శ్రీధర్‌కు.. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి సంఘటనలు నగరంలో చాలా మందికి అనుభవమే. ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా అలాంటి సంఘటనలు ఎవరికైనా పునరావృతమవుతాయనేది నిపుణుల సూచన. ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పారిశ్రామిక విధానం, త్వరలో తెరమీదికి రానున్న హౌసింగ్ పాలసీ వంటి వాటితో రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెద్ద ఎత్తున రానున్నాయి. దీంతో మళ్లీ భాగ్యనగరంలో స్థిరాస్తికి మంచి రోజులు రానున్నాయి. ఇలాంటి సమయంలోనే రియల్టర్లు అందమైన మాటలతో, కలలోని అభివృద్ధిని అరచేతిలో చూపిస్తూ అక్రమ నిర్మాణాలను కొనుగోలుదారులకు అంటగడతారు. ఇలాంటి పరిస్థితుల్లో 111 జీవో పరిధిలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను కాపాడేందుకు, నీటి పరివాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలోని 84 గ్రామాలను జీవ పరిరక్షణ ప్రాంతం (బయో కన్జర్వేషన్ జోన్) పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 2006 మార్చిలో ప్రభుత్వం జీవో నంబర్ 111ను విడుదల చేసింది. జీవో పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు, లే-అవుట్లు వేయకూడదని స్పష్టం చేసింది కూడా. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. 90 శాతం భూమిని బయో కన్జర్వేషన్ జోన్ కిందికి తీసుకొచ్చారు. మిగిలిన 10 శాతంలో నిర్మాణాలుంటాయి. రెండు చెరువుల్లోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) 10 కి.మీ. చుట్టూ కాలుష్య పరిశ్రమలు, హోటళ్లు, నివాస, వాణిజ్య సముదాయాల వంటి నిర్మాణాలను అనుమతించరు. 84 గ్రామాల్లోని 90 శాతం భూమి రిక్రియేషనల్, కన్వర్జేషన్ కింద ఉంటుంది. మిగిలిన 10 శాతం స్థలంలో గ్రౌండ్+2 అంతస్తుల వరకే అనుమతిస్తారు. ఉల్లంఘనలు జరుగుతున్నదిక్కడే.. జీవో పరిధిలో 10 శాతంలో నిర్మాణాలను అనుమతిస్తారు అంటే దానర్థం.. మాస్టర్ ప్లాన్ ప్రకారం జీవో పరిధిలోని మొత్తం స్థలంలో 10 శాతం భూమన్నమాట. ఇప్పటికే ఇక్కడ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ పట్టణం, 84 గ్రామ కంఠాలు, ఇతర అభివృద్ధి పనులకు స్థలాన్ని కేటాయించారు. అంటే 10 శాతం స్థలం పూర్తయింది. కానీ, రియల్టర్లు ఏం చేస్తున్నారంటే.. 111 జీవో పరిధిలోని ప్రతి లే-అవుట్లో 10 శాతం స్థలాన్ని నివాస సముదాయాలకు కేటాయించొచ్చంటూ బుకాయిస్తున్నారు. ‘ప్రగతి’ ఇక్కడే అంటూ.. దశాబ్దకాలంగా 111 జీవో పరిధిలో సుమారు 5,000కు పైగా అక్రమ నిర్మాణాలు వెలిశాయని అంచనా. నిర్మాణాలే కాదు.. ఇక్కడ లెక్కలేనన్ని ఇంజనీరింగ్ కళాశాలలు, రెండు మెడికల్ కాలేజీలూ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదానికీ అనుమతులు లేవు. ఇదిలా ఉంటే అంతరించిపోతున్న ఔషద మొక్కలు పెంచుతున్నాన ంటూ వేల ఎకరాల్లో రిసార్ట్‌ను నిర్మించి.. వాటి మధ్యలో రియల్టీ వ్యాపారం చేస్తున్నారు కొందరు రియల్టర్లు. పచ్చని ప్రకృతి మధ్యలో ఆహ్లాదకరంగా జీవించొచ్చని చెబుతూ కొనుగోలుదారులను నిలువునా ముంచుతున్నాయీ సంస్థలు. ఇవే కాదు. 111 జీవో పరివాహక ప్రాంతాల్లో లెక్కలేనన్ని ఫామ్ హౌస్‌లు, రిసార్టులు వెలిశాయి. ఈ అక్రమ నిర్మాణాలను కొనుగోలు చే సిన వారిలో సామాన్యులే కాదు ఉన్నతోద్యోగులు, ప్రవాసాలూ ఉండటం గమనార్హం. ఇక్కడ ఆకాశహర్మ్యాలు నిర్మించడానికీ అనుమతి లేదు. ఎఫ్ఎస్ఐ (బిల్టప్ స్పేస్ ఏరియా), పరివాహక ప్రాంతం (క్యాచ్మెంట్ ఏరియా) 1:0.5 నిష్పత్తిలో ఉండాలి కూడా. కానీ ఇక్కడ చాలా నిర్మాణాలు జీ+3 అంతస్తులను దాటిపోతున్నాయి. ఎప్పుడో ఒకనాడు ప్రభుత్వం కనక కొరఢా ఝుళిపిస్తే ఈ రియల్టర్ల దగ్గర కొనుగోళ్లు చేసిన సామాన్యులు రోడ్డున పడతారన్నది నిపుణుల మాట. ఇవి చూడాల్సిందే.. ‘బఫర్’ అంటే భయమే.. బఫర్ జోన్ అంటే నీటి పరివాహక ప్రాంతం. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు పారుతుంటుంది. దీన్ని అలుగు అంటారు. ఇక్కడి నుంచి పొలాలకు నీరు మళ్లుతుంటుంది. ఈ మధ్య ఉన్న ప్రాంతాన్నే అంటే చెరువుకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారన్నమాట. ఉస్మాన్‌సాగర్ కింద ఉన్న భూములన్నీ బఫర్‌జోన్ కిందికే వస్తాయి. ఈ కింద ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించకూడదు. కొనొద్దు కూడా. ఎఫ్టీఎల్ అంటే జేబు నిల్లే.. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) అంటే చెరువు కట్ట ప్రాంతం. ఈ ప్రాంతం నీటి పారుదల శాఖ విభాగం కిందికొస్తుంది. చెరువు కట్ట ప్రాంతాన్ని ఆనుకొని నగరంలో బడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే వీటిలో ఫ్లాట్ కొనేముందు కొనుగోలుదారులు కొన్ని కీలక పత్రాలు చూడాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రాంతంలోని నిర్మాణాలకు నీటి పారుదల శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అలాగే సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఎంఆర్ఓ), జీహెచ్ఎంసీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పసరండోయ్. ఈ మూడు పత్రాల్లో ఏ ఒక్కటి లేకపోయినా సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికుంది. -
ఎన్ కన్వెన్షన్‌పై హైకోర్టు స్టే
* కఠినచర్యలు తీసుకోకుండా నియంత్రించాలని నాగార్జున పిటిషన్ * మరో పిటిషన్ దాఖలు చేసిన లీజుదారు * రెండింటిపై విచారణ నేడు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై యథాతథస్థితిని కొనసాగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, ఖానామెట్ గ్రామంలోని తుమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్టు రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేయడాన్ని సవాల్‌చేస్తూ సినీనటుడు అక్కినేని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ కన్వెన్షన్‌పై కఠినచర్యలు తీసుకోకుండా అధికారులకు ఆదేశాలివ్వాలని నాగార్జున సోమవారం మధ్యాహ్నం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి స్టే మంజూరు చేశారు. ఇదే అభ్యర్థనతో నాగార్జున నుంచి ఎన్ కన్వెన్షన్‌ను లీజ్‌కు తీసుకున్న ఎన్3 ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి నల్లా ప్రీతమ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. న్యాయబద్ధంగానే కొన్నాను... గురుకుల్ ఘట్కేసర్ ట్రస్ట్ అధ్యక్షుడు బి.కిషన్‌లాల్ నుంచి 1982లో కొందరు వ్యక్తులు భూమిని కొనుగోలు చేయగా, 1992లో వారి నుంచి తాను 27 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కొన్నట్టు నాగార్జున తన పిటిషన్లో వివరించారు. చట్టపరంగా, న్యాయబద్ధంగానే కొన్న ఈ స్థలంలో హుడా అనుమతితో ప్రహరీగోడ నిర్మించినట్టు చెప్పారు. నిబంధనల ప్రకారం అక్కడ ఫంక్షన్ హాల్ నిర్మించి జీహెచ్ఎంసీ నుంచి లెసైన్స్ తీసుకున్నట్టు, ఆస్తి పన్ను కూడా చెల్లిస్తున్నట్టు నాగార్జున తెలిపారు. భవనాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నట్టు కూడా ఆయన వివరించారు. తన బీఆర్ఎస్ దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ, ఫంక్షన్‌హాల్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గతంలోనే హైకోర్టును కూడా ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఆ వ్యాజ్యాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ఆ ఫంక్షన్‌హాల్‌ను వివిధకార్యక్రమాలకు పలువురు ఇప్పటికే బుక్ చేసుకున్నారని ఆయన తెలిపారు. బఫర్‌జోన్‌లో లేదు... తన ఫంక్షన్‌హాల్ బఫర్జోన్కి వస్తుందని అధికారులు మార్క్ చేసినట్టు తెలిసిందని, 1992లో తాను కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బఫర్‌జోన్‌ను ఎందుకు నిర్ణయించలేదని ఆయన తన పిటిషన్లో ప్రశ్నించారు. అంతేకాక ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ ప్రక్రియంతా చేస్తున్నారు. ఇది అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఆరోపించారు. 10 హెక్టార్లు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉంటే, 30 మీటర్లను బఫర్‌జోన్‌గా గుర్తిస్తారని, రికార్డుల ప్రకారం, హెచ్ఎండీఏ వెబ్సైట్ ప్రకారం తుమ్మిడికుంట చెరువు విస్తీర్ణం 10 హెక్టార్లలోపే ఉందని, దీంతో తన నిర్మాణాలు బఫర్‌జోన్ వెలుపలే ఉన్నాయన్నారు. అధికారుల తాజా మార్కింగ్‌ల వల్ల వారికి, తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.