చిరుద్యోగిని సస్పెండ్‌ చేసి.. అక్రమాలపై ‘మట్టి’ కప్పి.. | Secretariat In charge Planning Secretary Suspension | Sakshi
Sakshi News home page

చిరుద్యోగిని సస్పెండ్‌ చేసి.. అక్రమాలపై ‘మట్టి’ కప్పి..

Published Thu, Jul 18 2024 5:23 AM | Last Updated on Thu, Jul 18 2024 10:54 AM

Secretariat In charge Planning Secretary Suspension

ఎర్రమట్టి దిబ్బల అక్రమ తవ్వకాలపై తూతూ మంత్రంగా చర్యలు 

సచివాలయం ఇన్‌చార్జి ప్లానింగ్‌ సెక్రటరీ సస్పెన్షన్‌

అసలైన పాత్రధారులను తప్పించేందుకు కుయుక్తులు 

‘సాక్షి’ కథనంతో కూటమి ప్రభుత్వంలో వణుకు

బుధవారం తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన జేసీ 

విచారణకు ఆదేశం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక 

ఎంత విస్తీర్ణంలో తవ్వేశారో గనుల శాఖ లెక్కలు  

సాక్షి, విశాఖపట్నం: ఎర్రమట్టి దిబ్బల్ని టీడీపీ నేతలు ధ్వంసం చేసిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం విచారణను మమ అనిపించేసింది. ఓ చిరుద్యోగిని బలి చేసి, అసలు పాత్రధారులు, సూత్రధారులైన కూట­మి నేతల్ని పక్కకి తప్పించేసింది. భౌగోళిక వార­సత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బల్ని పరిరక్షించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బఫర్‌ జోన్‌ని దాటి అక్రమంగా తవ్వకాలు జరుపు­తున్న దారుణాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసింది. 

‘మట్టి దిబ్బలు మటాష్‌.!’ శీర్షికతో బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనంతో కూటమి ప్రభు­త్వం ఉలిక్కిపడింది. అధికార కూటమి నేతలే ఎర్ర­మట్టి దిబ్బల్ని హరిస్తుండటంతో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు నాటకమా­డింది. ప్రభుత్వ ఆదేశంతో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) మయూర్‌ అశోక్, రెవెన్యూ, గనులశాఖ అధికారులు బుధవారం ఆ ప్రాంతాన్ని మొక్కుబడిగా పరిశీలించారు. అక్రమ తవ్వకాలపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అనుమ­తులు లేకుండా చేస్తున్న పనులను వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణకు ఆదేశించారు. స్థానిక అధి­కారులదే తప్పని, బాధ్యులపై చర్యలు తీసు­కుంటామంటూ హడావుడి చేశారు. ఈ ప్రాంతాన్ని సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించారు. ఎంత విస్తీ­ర్ణంలో తవ్వేశారో గనుల శాఖ అధికారులు కూడా లెక్కలు వేస్తున్నారు. వెంటనే ఇక్కడ తవ్వకాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

చిరుద్యోగిపై చర్య
ఎర్రమట్టి దిబ్బలు నిడిగడ్డు సచివాలయం పరిధి­లో ఉండటంతో ఆ సచివాలయం ఇన్‌చార్జి ప్లానింగ్‌ సెక్ర­టరీ కాగిత అజయ్‌కుమార్‌ సరిగా స్పందించలే­దని ఆయన్ని సస్పెండ్‌ చేశారు. వాస్తవానికి అజ­య్‌కుమార్‌ భీమిలి తోట వీధి సచివాలయం ప్లానింగ్‌ సెక్రటరీ. నిడిగడ్డుకు ఇన్‌చార్జిగా వచ్చారు.  తుది విచారణలోనూ ఉద్యో­గుల్నే బలి చేయాలని, నేతల పేర్లు బయటికి తేవద్దంటూ ఇప్పటికే జిల్లా అధికా­రులకు ప్రభు­త్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమా­చా­రం. 

గత వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం బఫర్‌ జోన్‌కు బయట 70, 80 ఏళ్లుగా జీడి తోటలు వేసుకొన్న రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ చేసిన వ్యవహారంపై బాబు, పవన్‌ పెద్ద రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారు అధికా­రంలోకి వచ్చిన నెలలోనే టీడీపీ, జనసేన నేతలు కుమ్మక్కై బఫర్‌జోన్‌ దాటి తవ్వకాలు జరిపి మట్టి తరలించేస్తున్నారు. 

దీనిపై సాక్షి కథనంతో ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిపై తక్షణమే చర్య­లు తీసుకోవాలని పర్యావరణ­వేత్తలు డిమాండ్‌ చేస్తు­న్నారు. పవన్‌  ఇప్పుడు సంబం­ధిత శాఖ మంత్రిగా ఉండి స్పందించకపోవ­డాన్ని తప్పుబడుతున్నారు.

ప్రభుత్వ పెద్దల సహకారంతోనే తవ్వకాలు
కొమ్మాది: ప్రభుత్వ పెద్దల సహకారంతో, స్థానిక కూటమి నేతల మద్దతుతోనే ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం తవ్వకాల వద్ద సెల్ఫీ తీసుకుని ఈమే­రకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బాబు కూటమి అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లో భౌగోళిక వారస­త్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బల పరిస్థితి ఇదంటూ పోస్టు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement