సాక్షి, హైదరాబాద్: నగ రంలోని రామ్మమ్మ కుంట ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో ఎలాంటి నిర్మా ణం చేపట్టడం లేదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు ఆదేశించింది. చట్టబద్ధమైన సంస్థ అయిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహ నం వ్యక్తం చేసింది.
నగరంలోని చెరువులు, కుంటలు ఇతర నీటి వనరుల ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణకు నోటిఫికేషన్ జారీ చేయాలని, దీన్ని తదుపరి విచారణ రోజున కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. అలాగే హెచ్‌ఎండీఏ పరిధిలో ఎన్ని కుంటలు, చెరువులకు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ ఫిక్స్ చేశారు.. ఇంకా ఎన్ని చేయా లి.. పూర్తి వివరాలతో రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని చెప్పింది.
రామ్మమ్మ కుంట బఫర్ జోన్ పరిధిలోని 4 ఎకరాల స్థలంలో టూరిజం పేరిట నిర్మిస్తున్న భవనానికి అక్రమంగా ఆడిటోరియం, అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నా పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై తీవ్రంగా మండిపడింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.
స్టేటస్ కో ఆదేశాలను ఎత్తివేయాలని కోరిన ప్రభుత్వం
రామ్మమ్మ కుంట బఫర్ జోన్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం భవనం నిర్మించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం జూన్‌లో స్టేటస్ కో విధించింది.మళ్లీ ఈ పిటిషన్ గురువారం సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం ముందు విచారణకొచ్చింది.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే భవన నిర్మాణం దాదాపు పూర్తయిందని, భవనాన్ని పెంచడానికి అన్ని అనుమతులున్నందున స్టేటస్ కో ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు. అక్కడ విద్యనభ్య సిస్తున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు.
రామ్మమ్మ కుంట ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ మ్యాప్‌ను పరిశీలించిన ధర్మాసనం.. భవనంలో ఎక్కువ భాగం బఫర్ జోన్‌లో లేదని, కొద్దిభాగం మాత్రమే ఉందంది. స్టేటస్ కో ఆదేశాలను సవరిస్తూ బఫర్ జోన్‌లోకి రాకుండా భవన నిర్మాణం చేసుకోవచ్చని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment