సాక్షి,హైదరాబాద్ : నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ‘హైడ్రా’ నేలమట్టం చేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించి ఒక్కొక్కటిగా కూల్చివేస్తోంది. ఈ చర్యలను కొన్ని వర్గాలు అభినందిస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆ విమర్శలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.
‘ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా మాకు సంబంధం లేదు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వాళ్లకు సమయం ఇస్తాం. అన్నీ పార్టీల నేతల అక్రమ నిర్మాణలను కూల్చేస్తున్నాం’ అని అన్నారు.
ఎఫ్‌టీఎల్ అనేది ముఖ్యమైన అంశం.ధర్మసత్రమైన ఎఫ్‌టీఎల్‌లో ఉంటే కూల్చేస్తాం. హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment