
'రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు'
హైదరాబాద్: సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటాడని తాము ఊహించలేదంటూ ఆయన బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రశాంతంగా ఉండాలని రంగనాథ్ ఒంటరిగా ఉండేవారని చెప్పారు. రంగనాథ్ శనివారం ఆయన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందిన సంగతి తెలిసిందే. రంగనాథ్కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల క్రితం భార్య మరణించాక ఒంటరిగా ఉంటున్న రంగనాథ్.. ఒంటరి తనం, ఆర్థిక ఇబ్బందులతోనే మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
రంగనాథ్ భౌతికకాయానికి గాంధీ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం పోస్టుమార్టం పూర్తియినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలించాంబర్‌కు తరలించనున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బన్సీలాల్ పేటలో రంగనాథ్‌కు అంత్యక్రియలు జరుగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.