హైదరాబాద్, సాక్షి: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న ఆయన.. అయితే హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని స్పష్టత ఇచ్చారు. మంగళవారం కాముని చెరువు, మైసమ్మ చెరువులను ఆయన పరిశీలించి.. మీడియాతో మాట్లాడారు.
హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం. జులై తర్వాత.. అంటే హైడ్రా ఏర్పాటు తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్నవాటి వైపు కూడా వెళ్లం. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదు అని ప్రకటించారాయన. అలాగే..
కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుందని, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుందని స్పష్టత ఇచ్చారు. హైడ్రా ఎప్పుడూ పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి పోదు. ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన నమ్మొద్దు అని ప్రజలకు రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment