
సాక్షి,హైదరాబాద్ : హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్ పేద,మధ్య తరగతి మాత్రమేనా అని ప్రశ్నించింది. పేదల ఇళ్లే కాకుండా అక్రమ నిర్మాణలకు పాల్పడ్డ పెద్దల నిర్మాణాలకు కూల్చివేసినప్పుడే సార్థకత చేకూరుతుందని సూచించింది.
ప్రభుత్వ భూములను కాపాడాలంటే పేదల నిర్మాణాలే కాదు. పెద్దల నిర్మాణాలు కూడా కూల్చాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. కేవలం పేదల నిర్మాణాలను తొలగిస్తే సరిపోదని హైకోర్టు తేల్చి చెప్పింది.
మిర్ అలం ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో నివసించే గృహ యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ జారీ చేసిన నోటీసులపై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా, దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది.
చెరువులను రక్షించడం ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పిన హైకోర్టు.. అందరికీ సమాన న్యాయం జరిగేలా చూడాలని సూచించింది. మిర్ అలం ట్యాంక్ చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment