కమిషనర్ రంగనాథ్ స్వయంగా సమాధానమిస్తారు..
ఫిర్యాదులు, సందేహాలు, సమాచారం కోసం 89777 94588కు వాట్సాప్ చేయండి..
హైడ్రా.. ఇప్పుడు అందరి నోటా ఇదే మాట. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఈ హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఆండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటైంది. బుల్డోజర్లతో చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న పార్కులు, ఫాంహౌస్‌లు, విల్లాలు, ఇళ్లు, ఇతర నిర్మాణాలను కూల్చేస్తోంది. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రజలను సవాలక్ష సందేహాలు చుట్టుముడుతున్నాయి.
అసలు హైడ్రా ఏ నిర్మాణాలు కూల్చేస్తుంది? వేటిని వదిలేస్తుంది? ఏది ఎఫ్‌టీఎల్? ఏది బఫర్ జోన్? భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ప్లాట్లు, ఇళ్లు ఖరీదు చేసే ముందు ఏఏ అంశాలు సరి చూసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ వేధిస్తున్నాయి. మరోవైపు తమ చుట్టూ కబ్జాలు జరుగుతున్నా ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి మరికొందరిది. ఈ నేపథ్యంలోనే ‘మీతో సాక్షి’మీ ముందుకొస్తోంది.
హైడ్రాకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా, సమాచారం కావాలన్నా, ఫిర్యాదు చేయాలనుకున్నా 89777 94588 నంబర్‌కు వాట్సాప్ చేయండి. సందేశం, వాయిస్ మెసేజ్, ఫొటోల రూపంలో పంపండి. వీటిని ‘సాక్షి’హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్తుంది. ఆయన స్పందన మీకు చేరేలా చేస్తుంది. అసలు హైడ్రా ఏం చేయబోతోందో తెలియజేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment