158 అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా
వీఐపీలతో పాటు బడా రియల్టర్లకు చెందినవీ కూలి్చవేత
చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా చర్యలు
అదనపు సిబ్బంది, ప్రత్యేక ఠాణా వస్తే మరిన్ని ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో ఉన్న జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో మొత్తం 43.94 ఎకరాలు పరిరక్షించింది. వీటిలో ఎన్–కన్వెన్షన్ ఆక్రమించిన తమ్మిడికుంటతో పాటు ఇతర చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులు ఉన్నాయి. తొలుత జీహెచ్‌ఎంసీ అ«దీనంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) ఈ కూలి్చవేతలు ప్రారంభించింది.
ఈ విభాగం డైరెక్టర్‌గా వచి్చన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ నేతృత్వంలోని బృందం ఈ ఏడాది జూన్ 27న ఫిల్మ్‌నగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టింది. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్‌లోని 0.16 ఎకరాలకు విముక్తి కలి్పంచడం తొలి ఆపరేషన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. ఆపై జూలై 1, 4, 5, 14 తేదీల్లో మన్సూరాబాద్, ఎమ్మెల్యేస్ కాలనీ, మిథిలానగర్, బీజేఆర్ నగర్‌లపై పంజా విసిరింది. ఆ నాలుగు చోట్ల ఉన్న ఏడు నిర్మాణాలను కూలి్చ వేసింది. అప్పటివరకు ఆ ఆపరేషన్లు జీహెచ్‌ఎంసీ వరకే పరిమితం అయ్యాయి. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) వరకు పరిధిని విస్తరించడమే కాకుండా హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే హైడ్రా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్.. దూకుడు పెంచారు.
మహదేవ్‌పురంలో తొలి ఆపరేషన్
గత నెల 21న మహదేవ్‌పురంలో పార్కు స్థలంలోని ఆక్రమణల తొలగింపుతో హైడ్రా ఆపరేషన్లు మొదలయ్యాయి. ఇలా శనివారం వరకు 18 చోట్ల ఉన్న 158 అక్రమ నిర్మాణాలను తొలగించింది. మొత్తం 43.94 ఎకరాల మేర ప్రభుత్వ భూములు, చెరు వులు పరిరక్షించింది. వీటిలో పలువురు వీఐపీలతో పాటు బడా రియల్టర్లకు చెందినవీ ఉన్నాయి. హైడ్రా ఏర్పాటై నెల రోజులు దాటినా ఇప్పటివరకు దానికి అదనంగా ఒక్క పోస్టును కానీ సిబ్బందిని కానీ కేటాయించలేదు. దీంతో ఇప్పటివరకు కేవలం ఈవీడీఎం, జీహెచ్‌ఎంసీలోని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసుల సహకారంతోనే కార్య కలాపాలు సాగిస్తోంది.
దీనికోసం ప్రతిపాదించిన అదనపు సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ను కేటాయిస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైడ్రా షాక్ తగిలిన వారిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునతో పాటు ప్రో కబడ్డీ యజమాని అనుపమ, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, మంథని బీజేపీ నేత సునీల్‌రెడ్డి, బహదూర్‌పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (ఈయనపై కేసు నమోదైంది), చింతల్‌కు చెందిన బీఆర్‌ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సంబంధీకులు ఉన్నారు.
హైడ్రా కూలి్చవేతల్లో కీలకమైనవి..
⇒ మహదేవ్‌పురంపార్క్ స్థలంలోని నిర్మాణం
⇒ భూదేవిహిల్స్‌లో చెరువులను ఆక్రమించి చేపట్టిన ఐదు నిర్మాణాలు
⇒గాజులరామారంలోని చింతల్‌చెర్వులో ఉన్న 54 నిర్మాణాలు
⇒నందగిరి హిల్స్ పార్కులో 16 నిర్మాణాలు
⇒రాజేంద్రనగర్‌లోని బుమ్‌రాఖ్ దౌలా లేక్ లోని 45 నిర్మాణాలు
⇒ ఖానాపూర్, చిల్కూరుల్లోని గండిపేట చెరు వులో ఉన్న 24 నిర్మాణాలు
⇒తమ్మిడికుంట చెరువులోని ఎన్–కన్వెన్షన్‌తో పాటు ఇతర నిర్మాణాలు
⇒ ఫుట్‌పాత్‌లు, నాలాలపైన, ప్రభుత్వ స్థలా ల్లోని అక్రమ నిర్మాణాలు
Comments
Please login to add a commentAdd a comment