సాక్షి, హైదరాబాద్: ప్రకృతిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని ఆదుకుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో ప్రకృతి మనకు వెంటనే ప్రతిఫలాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని ఆదుకుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఇది రైతు విజ్ఞత. గత కొన్ని నెలలుగా మన నీటి వనరులు, మన పర్యావరణ సంపదను మన భవిష్యత్తు కోసం మన వారసత్వం కోసం రక్షిస్తున్నాం. ప్రకృతి మనకు వెంటనే ప్రతిఫలాన్ని ఇస్తుంది. హైడ్రా ద్వారా పునరుద్ధరించబడిన అమీన్‌పూర్ సరస్సులో కనిపించిన 12-సెంటీమీటర్ల రెడ్ బ్రెస్ట్ ఫ్లైక్యాచర్ చూస్తే మనం చేసేది సరైనదే అని తెలుస్తుంది.. ఇది దేవుడి ఆశీస్సులాంటిది’ అంటూ కామెంట్స్ చేశారు.
I always believed that if we take care of nature, nature will take care of us. It is farmer’s wisdom.
We stopped lake encroachments after years of constant depletion and destruction of our water bodies, our ecological wealth, our legacy for our future in the last few months.… pic.twitter.com/GgFCj64wYG— Revanth Reddy (@revanth_anumula) December 2, 2024
Comments
Please login to add a commentAdd a comment