HYD: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు | HYDRA Ready For Demolish Illegal Constructions At Madhapur, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

HYD: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

Published Sun, Jan 5 2025 8:19 AM | Last Updated on Sun, Jan 5 2025 1:36 PM

 HYDRA Ready For Demolish Illegal Constructions At Madhapur

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. తాజాగా హైడ్రా.. నగరంలోని మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. 

మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా(HYDRA) ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేస్తోంది. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఆరు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. అయితే, అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు మార్లు అధికారులు హెచ్చరించినా బిల్డర్‌ మాత్రం పట్టించుకోలేదు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా.. ఆదివారం నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. 

ఇక, అంతకుముందు.. ఈ భవన నిర్మాణంపై స్థానికులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, హైడ్రా రంగనాథ్‌ మాదాపూర్‌(Madhapur)లో పర్యటించారు. ఈ క్రమంలో​ అక్కడ భవన నిర్మాణానికి అనుమతులు లేవని తేలడంతో రంగనాథ్‌ కూల్చివేతకు ఆదేశించారు. దీంతో, నేడు భవనాన్ని కూల్చివేశారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement