‘అద్దాల మేడలు, అందమైన భామల కోసం మేం పని చేయడం లేదు’ | CM Revanth Reddy Speech On Musi River, Hydra | Sakshi
Sakshi News home page

‘అద్దాల మేడలు, అందమైన భామల కోసం మేం పని చేయడం లేదు’

Published Thu, Oct 17 2024 5:33 PM | Last Updated on Thu, Oct 17 2024 6:18 PM

CM Revanth Reddy Speech On Musi River, Hydra

సాక్షి,హైదరాబాద్‌: మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం. ‘అద్దాల మేడల కోసం అందమైన భామల కోసం మేం పనిచేయడం లేదు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నదీ ప్రక్షాళనపై సెక్రటేరియట్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.  

  • మూసీ పరివాహక ప్రాంతాల్లో 33మంది అధికారుల బృందం పనిచేసింది.

  • పేదలతో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల్ని విన్నారు.

  • మూసీపై 10 నెలలుగా అధికారులు సీరియస్‌గా పనిచేస్తున్నారు.

  • మూసీ పునరురజ్జీవనం కోసం మేం ప్రయత్నిస్తున్నాం.

  • మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఆదుకోవడం ఎలా అనేదానిపై దృష్టి పెట్టాం

  • మూసీ సుందరీకరణను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.

  • ప్రజల్లో అపోహాలు సృష్టిస్తున్నారు

  • బ్యూటిఫికేషన్‌ మీద విష ప్రచారం చేస్తున్నారు

  • మూసీ కంటే బీఆర్‌ఎస్‌ నేతల మొదళ్లలో ఉంది.

  • ఇప్పుడు ప్రజల్లో అపోహలు కల్పించి విషప్రచారం చేస్తున్నారు.

  • మూసీ 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

  • మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం

  • 10ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. రాష్ట్రాన్ని బందిపోటు దొంగల్లా దోచుకున్నారు.

  • మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం

  • అద్దాల మేడల కోసం... అందమైన భామల కోసం మేం పనిచేయడం లేదు

  • మూసీ 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది

  • బఫర్‌ జోన్‌లో 10వేల ఇళ్లు ఉన్నాయి

  • మూసీ బాధితులను ఆదుకోవడం కోసమే ఈ ప్రాజెక్ట్‌

  • మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం

  • చెన్నై ముంబైలాంటి నగరాల్లో వరదలు ఎలా ఉన్నాయి?

  • చెన్నై,ముంబై నగరాల్లో ఏం జరుగుతుందో కనపడతలేదా?

  • చెరువులు,నాళాలు ఆక్రమించారు. మూసీ పరిస్థితి ఏంటి?

  • నగరాన్ని మూసీలో ముంచదల్చుకున్నారా?

  • హైదరాబాద్‌ మహానగరాన్ని ఏం చేయదలుచుకున్నారు?

  • వద్దంటే చెప్పండి మూసీ టెండర్లు రద్దు చేస్తాం

  • నాకు స్వార్థం ఉన్నట్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు

  • అధికారం కోల్పోయిన వారు ప్రతీది అడ్డుకోవాలని చూస్తున్నారు

  • మూసీ విషం హైదరాబాద్‌లోనే కాదు నల్గొండకు వెళ్తుంది

  • ఖమ్మం,విజయవాడ కళ్లముందే వరదల్లో మునిగిపోయింది.

  • హైదరాబాద్‌ను కూడా అలాగే ముంచాలనుకుంటున్నారా?

  • నల్గొండ ప్రజలు మౌనంగా ఉంటే ఎలా? 

  •  ఇది మూసీ సుందరీకణ కాదు, పునరుజ్జీవన ప్రాజెక్టు

  • మూసీ పునరుజ్జీవంపై కొంతమంది అపోహాలు సృష్టిస్తున్నారు

  • హైదరాబాద్‌లోని అద్భుత కట్టడాలను నాశనం చేయాలని చూస్తున్నారు

  • హైదరాబాద్‌ సర్వనాశనం అవుతుంటే మీకు రాజకీయాలే ముఖ్యమా?

  • హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి డీపీఆర్‌ కోసం.. ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలను కన్సార్టియంగా మార్చాం

  • దీనిపై అందురు ఒప్పుకుంటేనే ముందుకుపోదాం, లేదంటే వద్దు

  • మూసీకి వెళ్తామంటున్న నేతలు అక్కడ మూడు నెలలు ఉండండి

  • కేటీఆర్‌,హరీష్‌రావు,ఈటలకు మూసీలో ఇళ్లు ఇస్తాం

  • మూసీ అద్భుతంగా ఉంటే అక్కడే మూడు నెలలు ఉండండి

  • మూసీలో కేటీఆర్‌,హరీష్‌,ఈటల మూడునెలల ఉంటే ప్రాజెక్ట్‌ ఆపేస్తాం


దేశ భద్రత విషయంలో రాజీపడం

  • దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదు
  • రాడార్ స్టేషన్ కు గత ప్రభుత్వం లోనే అన్ని అనుమతులు ఇచ్చారు.
  • రాడార్ స్టేషన్‌ వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్.. బతుకమ్మ చీరల విషయంలో గగ్గోలు పెడుతుంది
  • హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు.. గ్రౌండ్ ఫ్లోర్ వాల్లకు డబ్బులు ఇవ్వలేదు..5వ అంతస్తు వాల్లకు ఇచ్చారు
  • దీనిపై ఏంక్వరీకి సిద్దమా.. సిద్దమైతే 24 గంటల్లో ఏసీబీ ఏంక్వరీకి ఆదేశిస్తా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement