దేశ వ్యాప్త ఎన్నికల నిధుల కోసం భారీ కుంభకోణానికి శ్రీకారం: కేటీఆర్
వివేక్, కేవీపీ లాంటి వారి ఇళ్లతోపాటు మీ సోదరుడి ఇంటిని కూల్చండి
మూసీ బాధితులపాలిట రేవంత్‌రెడ్డి కాలయముడిలా మారారు
సాక్షి, హైదరాబాద్/అత్తాపూర్: మూసీ ప్రాజెక్టు పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కాంగ్రెస్ రిజర్వు బ్యాంకులా వాడుకోవాలని చూస్తోందన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ ఎన్నికల నిధుల కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టిందన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న వారి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాల యముడిలా మారారన్నారు. ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూలుస్తోందన్నారు.
రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి ఎలాంటి ప్రయోజనం లేని మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, ఎమ్మెల్యే గోపీనాథ్ తదితరులతో కలిసి సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2400 కిలోమీటర్ల ‘నమామీ గంగే’ప్రాజెక్టుకు రూ.40వేల కోట్లు ఖర్చయితే 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళనకు రూ.లక్షన్నర కోట్లు ఎందుకని ప్రశ్నించారు.
కూల్చివేత బాధలు మాకు తెలుసు
‘పేద మధ్య తరగతి ప్రజలకు సొంతిళ్లు ఒక భావోద్వేగం. అప్పర్, మిడ్ మానేరు నిర్వాసితులుగా కూ ల్చివేత బాధ ఏంటో మాకు తెలుసు. చట్టబద్దంగా అనుమతులు పొందిన వారిని కూడా ఆక్రమణదారులుగా కాంగ్రెస్ ప్రచారం చేయిస్తోంది. నాలాల మీద నిర్మించిన హైడ్రా, జీహెచ్‌ఎంసీ భవనాలు కూల్చకుండా పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లు పంపిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్ల లేకుండా చేసేందుకు సచివాలయాన్ని కూడా సీఎం రేవంత్ కూల్చివేస్తారేమో? రేవంత్‌ను ప్రజలు తిడుతున్న తిట్లు గతంలో ఎప్పుడూ నేను వినలేదు.
రేవంత్ మీడియాకు ముఖం చాటేసి మంత్రులకు బదులు గా అధికారులను ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నాడు. ఢిల్లీ పారీ్టలను ఎప్పుడు గెలిపించినా గల్లీల్లో ప్రజల ఆక్రందనలు ఇలాగే ఉంటాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు కూల్చిన తర్వాతే పేదల మీదకు రావాలి. చిత్తశుద్ధి ఉంటే కొడంగల్‌లోని తన ఇంటితోపాటు హైదరాబాద్‌లో తన సోదరుడు ఇంటిని కూడా రేవంత్ కూల్చివేయాలి. బాధితులకు భరోసా ఇచ్చేందుకు మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటిస్తాం. బుల్డోజర్లకు మేము అడ్డుగా నిలబడతాం. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’ అని కేటీఆర్ అన్నారు.
మీ సోదరుడి ఇంటిని కూల్చండి
కేటీఆర్ అత్తాపూర్ డివిజన్‌లోని మూసీ పరీవాహక ప్రాంతంలోని లక్ష్మీనగర్ పార్కులో నిర్వాసితులను కలిసి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. గృహ నిర్మాణాలు చేసుకున్నందుకు ప్రభుత్వం నుంచి అన్ని రకా ల పర్మిషన్లు పొందుతూ రూ.లక్షలు బ్యాంకుల ద్వా రా అప్పుగా తీసుకుని ఇళ్లు కట్టుకుంటే ఎలా కూలుస్తారని నిలదీశారు. పర్మిషన్ ఇచ్చిన అధికారులను వదిలేసి సామాన్య ప్రజలపై ప్రతాపం చూపడం సరికాదన్నారు. దుర్గంచెరువు బఫర్ జోన్ ప్రాంతంలో వివేక్, కేవీపీ లాంటి వారి ఇళ్లతోపాటు మీ సోద రుడు తిరుపతిరెడ్డి ఇంటిని బుల్డోజర్లతో నేలమట్టం చేయాలన్నారు. అనంతరం కేటీఆర్ కిషన్‌బాగ్ మహమూద్ నగర్‌లో మూసీ బాధితులను కలిసి మీ వెంట తాము ఉంటామంటూ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment