అక్రమ కట్టడాలను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ
హైదరాబాద్: నగరంలోని అక్రమ కట్టడాల తొలగింపునకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మరోసారి సిద్ధమైంది. సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఇంద్రానగర్ లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టిపెట్టారు.
అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్ననేపథ్యంలో ఇంద్రానగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారుల కూల్చివేతకు స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.