‘డెక్కన్‌ మాల్‌ కూల్చివేత’ టెండర్‌ మార్పు | Demolition of Deccan Mall Tender Change To Krishna Prasad Agency | Sakshi
Sakshi News home page

‘డెక్కన్‌ మాల్‌ కూల్చివేత’ టెండర్‌ మార్పు.. ఎస్కే మల్లు నుంచి కృష్ణ ప్రసాద్‌ ఏజెన్సీకి

Published Thu, Jan 26 2023 8:18 PM | Last Updated on Thu, Jan 26 2023 8:19 PM

Demolition of Deccan Mall Tender Change To Krishna Prasad Agency - Sakshi

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదానికి గురైన రాంగోపాల్‌ పేట డెక్కన్‌ మాల్‌ కూల్చివేత టెండర్‌లో మార్పు చోటు చేసుకుంది. ఆ టెండర్‌ను ఎస్కే మల్లు కంపెనీ నుంచి కృష్ణ ప్రసాద్‌ ఏజెన్సీ దక్కించుకుంది. ఎస్కే మల్లు కంపెనీ వద్ద సరైన యంత్రాలు లేకపోవడంతో దాన్ని రద్దు చేశారు. ఆ స్థానంలో కృష్ణ ప్రసాద్‌ ఏజెన్సీకి కూల్చివేత టెండర్‌ దక్కింది. 

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదానికి గురైన రాంగోపాల్‌ పేట డెక్కన్‌ మాల్‌  కూల్చివేత పనులకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమలోనే జీహెచ్‌ఎంసీ మంగళవారం ఒక రోజు గడువుతో సంబంధిత కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆహ్వానించి సుమారు రూ. 33.86 లక్షల అంచనాలతో టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ టెండర్‌ను హైదరాబాద్‌కు చెందిన ఎస్కే మల్లు కంపెనీ రూ. 22 లక్షలకు దక్కించుకుంది. అయితే భారీ భవనాన్ని కూల్చివేసే క్రమంలో పూర్తిస్థాయి యంత్రాలు అందుబాటులో ఉండాలి. ఈ విషయంలో ఎస్కే మల్లు కంపెనీ ఫెయిల్‌ కావడంతో టెండర్‌లో మార్పు చోటు చేసుకుంది. ఎస్కే మల్లు కంపెనీ టెండర్‌ను రద్దు చేసి కృష్ణ ప్రసాద్‌ ఏజెన్సీకి ఆ టెండర్‌ను అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement