సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో ఉన్న చరిత్రాత్మక క్లాక్ టవర్ టిక్ టిక్ అనడం ఆగిపోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్ గడియారంలో టైమ్ ఆగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) సిబ్బంది పట్టించుకోవడం లేదు.
అయితే తాము సోమవారం క్లాక్‌ను రిపేర్ చేస్తామని జీహచ్‌ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. సాధారణంగా క్లాక్ పనిచేయడం ఆగిపోతే స్థానికులు తమకు సమాచారమిస్తారని, ఈసారి అలాంటి ఫిర్యాదు ఏదీ రాకపోవడం వల్లే రిపేర్ ఆలస్యమైందని జీహెచ్‌ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment