Clock Tower
-
టిక్.. టిక్..టిక్..
నిత్యం జన సంద్రంతో కిటకిటలాడుతూ ఉండే జగదాంబ జంక్షన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యంత ఆకర్షణీయంగా జంక్షన్‌ను తీర్చిదిద్దింది. ముఖ్యంగా ఈ జంక్షన్‌కు కళ్లు చెదిరే అందాన్ని తీసుకొచ్చింది క్లాక్ టవర్. రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతూ పాతనగరానికి కొత్త జీవం పోసింది. భారీ గడియారాలు నగర వాసులకు కాలాన్ని గుర్తు చేస్తూనే.. ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. రాత్రి వేళల్లో ఈ క్లాక్ టవర్‌ను చూడటం ఓ ప్రత్యేక అనుభూతి కలిగిస్తోంది. ఇక్కడ భారీ గడియారాలను ఢిల్లీకి చెందిన మెడివల్ ఇండియా సంస్థ ఏర్పాటు చేసింది. అసలు ఈ గడియారాల ప్రత్యేక ఏమిటి? మెడివల్ సంస్థ కథేంటి.? ఆ వివరాలను ఓ సారి చదివేద్దామా.? – సాక్షి, విశాఖపట్నం పూర్వ కాలంలో సూర్యుడు ఎండ వల్ల ఏర్పడే నీడని బట్టి టైమ్ తెలుసుకునేవారు. నిజాం నవాబులు, బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు వారి కింద పనిచేసే వారికి, సైనికులకు చేతి గడియారాలు ఉండేవి కాదు. వారికి సమయం తెలియజేసేందుకు ప్రధాన కేంద్రాల వద్ద క్లాక్ టవర్లు నిర్మించారు. సమయానికి విధులకు రాని వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ఈ క్లాక్ టవర్లు ఉపయోగపడేవి. క్రమంగా.. ప్రజలంతా ప్రధాన జంక్షన్లలో ఉండే క్లాక్ టవర్ల వద్దకు వచ్చి టైమ్ తెలుసుకునేవారు. హైదరాబాద్ మహానగరంలో నిజాంలు, బ్రిటిషర్లు మొత్తం 12 క్లాక్ టవర్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు కేవలం అమెరికా, లండన్‌లో మాత్రమే క్లాక్ టవర్లు కనిపించేవి. అప్పట్లో క్లాక్ టవర్లలోని గడియారాలన్నీ లండన్ నుంచి దిగుమతి చేసుకునేవారు. క్రమంగా.. భారత్‌లోనూ గడియారాలు తయారవడం ప్రారంభమైంది.నగరంలో తొలి క్లాక్ టవర్ భారీ గడియారాలు మహా విశాఖ నగరానికి కొత్తేం కాదు. భీమిలిలో 18వ శతాబ్దంలో డచ్ వారు నిర్మించిన గంట స్తంభం రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైంది. 1923లో అప్పటి మద్రాస్ ప్రావెన్సీ ముఖ్యమంత్రి దివాన్ బహద్దూర్ పానుగంటి రామయ్యంగార్ ఆధ్వర్యంలో కేజీహెచ్‌లో భారీ గడియారాలు ఏర్పాటు చేశారు. 1926లో ఏయూ ఫిజిక్స్ విభాగంలో జైపూర్ మహారాజా భారీ గడియారాన్ని ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్, రాజస్థాన్, ఢిల్లీ నగరాల్లో మాదిరిగా.. క్లాక్ టవర్లు మాత్రం విశాఖలో లేవు. జగదాంబ జంక్షన్లో ఏర్పాటు చేసిందే మొట్టమొదటి అతి పెద్ద క్లాక్ టవర్గా చెప్పవచ్చు. గత ప్రభుత్వ హయాంలో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ నగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. ఆహ్లాదంలోనూ, అభివృద్ధిలోనూ కొత్త వైజాగ్ పరిచయమైంది. ఎటు చూసినా పార్కులు, ప్రధాన సర్కిళ్లలో సరికొత్త డిజైన్లతో ఫౌంటెన్స్.. ఇలా విభిన్న విశాఖ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే జగదాంబ జంక్షన్లో.. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా 2023 నవంబర్‌లో క్లాక్ టవర్ నిర్మాణానికి మేయర్ గొలగాని హరివెంకటకుమారి శంకుస్థాపన చేశారు. రూ.2.80 కోట్లతో నిర్మించిన ఈ క్లాక్ టవర్‌లో 4 గడియారాల ఏర్పాటు పనులను మాత్రం ఢిల్లీకి చెందిన మెడివల్ ఇండియా సంస్థకు అప్పగించారు. 60 అడుగుల పొడవైన ఈ టవర్‌తో పాటు అద్భుతమైన ల్యాండ్ స్కేపింగ్‌తో కూడిన ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన నగరాల్లో ‘మెడివల్’ క్లాక్స్ చరిత్ర పుటల్లో తమకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న ఈ సౌధ గడియారాలు తయారు చేసిన మెడివల్ ఇండియా సంస్థ ఢిల్లీకి చెందింది. దేశంలోని పలు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్స్, భారీ గడియారాలన్నీ మెడివల్ ఇండియా సంస్థకు చెందినవే. ఢిల్లీ, యూపీలోని ఖతౌలీ, ఐఐటీ రూర్కెలా, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, సిమ్లా, ముస్సోరీ, పానిపట్, బెంగళూరు, గుర్‌గ్రామ్, జైపూర్, కోల్‌కతా, చెన్నై, డెహ్రాడూన్, రాజస్థాన్, అరుణాచల్‌ప్రదేశ్.. ఇలా ప్రతి నగరానికీ అక్కడి ప్రజల అభిరుచులకు తగ్గట్లుగా గడియారాలు అందించడం వీరి ప్రత్యేకత. కొన్ని కోట్ల మందికి వీరి గడియారాలు టైమ్‌ను చూపిస్తున్నాయి. ప్రతి గడియారంలోనూ ‘సీటీటీ’ ఉండేలా చూసుకోవడమే వీరి ప్రత్యేకత. సీ అంటే క్రాఫ్ట్‌మెన్ షిప్, టీ అంటే ట్రెడిషన్, టీ అంటే టెక్నాలజీతో తీర్చిదిద్దుతారు. విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన నాలుగు గడియారాలు డిజిటల్ కంట్రోల్‌తో పాటు సరైన సమయాన్ని చూపించేలా జీపీఎస్ ద్వారా అనుసంధానం చేశారు. టవర్ క్లాక్ కంట్రోలర్ ద్వారా నాలుగు గడియారాలను నడిపిస్తారు. విద్యుత్ సరఫరాలో ఏదైనా లోపాలు తలెత్తితే.. 48 నుంచి 72 గంటల పాటు నిర్విరామంగా నడిచేలా ప్రతి గడియారంలోనూ ఇన్‌బిల్ట్ పవర్ బ్యాకప్ ఉంది. 20 రకాలుగా క్లాక్ డయల్స్ తయారు చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. క్లాక్ టవర్‌తో జంక్షన్‌కు కొత్త రూపు తీసుకొచ్చిన మెడివల్ ఇండియా పనితనానికి వైజాగ్ నగరం సెల్యూట్ చేస్తూ మురిసిపోతోంది. నగర అభిరుచికి తగ్గట్టుగా తయారు చేస్తాం దేశంలోని ప్రతి నగరంలోనూ దాదాపు మా సంస్థకు చెందిన గడియారాలు ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా క్లాక్ టవర్ ఏర్పాటు చేశాం. ముందుగా వైజాగ్ విశిష్టత తెలుసుకున్నాం. ఏ తరహా డిజైన్ ఇక్కడ సరిపోతుందో అంచనా వేసి.. నగర అభిరుచికి తగ్గట్లుగా తయారు చేశాం. భారతీయ సంప్రదాయం, చరిత్ర మిళితమయ్యేలా నైపుణ్యం కలిగిన హస్త కళాకారులతో గడియారాలు తయారు చేస్తుంటాం. చాలాకాలం మన్నికగా ఉండేలా.. ఇక్కడ సముద్రపు గాలులను తట్టుకుని నిలబడేలా క్లాక్ టవర్లోని వాచ్‌లు రూపొందించాం. –అంబికా బక్షి, మెడివల్ ఇండియా సీఈవో -
మహా విశాఖలో తొలి క్లాక్ టవర్
నిత్యం జన సంద్రంతో కిటకిటలాడుతూ ఉండే జగదాంబ జంక్షన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యంత ఆకర్షణీయంగా జంక్షన్‌ను తీర్చిదిద్దింది. ముఖ్యంగా ఈ జంక్షన్‌కు కళ్లు చెదిరే అందాన్ని తీసుకొచ్చింది క్లాక్ టవర్. రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతూ పాతనగరానికి కొత్త జీవం పోసింది. భారీ గడియారాలు నగర వాసులకు కాలాన్ని గుర్తు చేస్తూనే.. ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. రాత్రి వేళల్లో ఈ క్లాక్ టవర్‌ను చూడటం ఓ ప్రత్యేక అనుభూతి కలిగిస్తోంది. ఇక్కడ భారీ గడియారాలను ఢిల్లీకి చెందిన మెడివల్ ఇండియా సంస్థ ఏర్పాటు చేసింది. అసలు ఈ గడియారాల ప్రత్యేక ఏమిటి? మెడివల్ సంస్థ కథేంటి.? ఆ వివరాలను ఓ సారి చదివేద్దామా.? – సాక్షి, విశాఖపట్నంపూర్వ కాలంలో సూర్యుడు ఎండ వల్ల ఏర్పడే నీడని బట్టి టైమ్ తెలుసుకునేవారు. నిజాం నవాబులు, బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు వారి కింద పనిచేసే వారికి, సైనికులకు చేతి గడియారాలు ఉండేవి కాదు. వారికి సమయం తెలియజేసేందుకు ప్రధాన కేంద్రాల వద్ద క్లాక్ టవర్లు నిర్మించారు. సమయానికి విధులకు రాని వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ఈ క్లాక్ టవర్లు ఉపయోగపడేవి. క్రమంగా.. ప్రజలంతా ప్రధాన జంక్షన్లలో ఉండే క్లాక్ టవర్ల వద్దకు వచ్చి టైమ్ తెలుసుకునేవారు. హైదరాబాద్ మహానగరంలో నిజాంలు, బ్రిటిషర్లు మొత్తం 12 క్లాక్ టవర్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు కేవలం అమెరికా, లండన్‌లో మాత్రమే క్లాక్ టవర్లు కనిపించేవి. అప్పట్లో క్లాక్ టవర్లలోని గడియారాలన్నీ లండన్ నుంచి దిగుమతి చేసుకునేవారు. క్రమంగా.. భారత్‌లోనూ గడియారాలు తయారవడం ప్రారంభమైంది.నగరంలో తొలి క్లాక్ టవర్భారీ గడియారాలు మహా విశాఖ నగరానికి కొత్తేం కాదు. భీమిలిలో 18వ శతాబ్దంలో డచ్ వారు నిర్మించిన గంట స్తంభం రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైంది. 1923లో అప్పటి మద్రాస్ ప్రావెన్సీ ముఖ్యమంత్రి దివాన్ బహద్దూర్ పానుగంటి రామయ్యంగార్ ఆధ్వర్యంలో కేజీహెచ్‌లో భారీ గడియారాలు ఏర్పాటు చేశారు. 1926లో ఏయూ ఫిజిక్స్ విభాగంలో జైపూర్ మహారాజా భారీ గడియారాన్ని ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్, రాజస్థాన్, ఢిల్లీ నగరాల్లో మాదిరిగా.. క్లాక్ టవర్లు మాత్రం విశాఖలో లేవు. జగదాంబ జంక్షన్లో ఏర్పాటు చేసిందే మొట్టమొదటి అతి పెద్ద క్లాక్ టవర్గా చెప్పవచ్చు.గత ప్రభుత్వ హయాంలో..గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ నగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. ఆహ్లాదంలోనూ, అభివృద్ధిలోనూ కొత్త వైజాగ్ పరిచయమైంది. ఎటు చూసినా పార్కులు, ప్రధాన సర్కిళ్లలో సరికొత్త డిజైన్లతో ఫౌంటెన్స్.. ఇలా విభిన్న విశాఖ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే జగదాంబ జంక్షన్లో.. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా 2023 నవంబర్‌లో క్లాక్ టవర్ నిర్మాణానికి మేయర్ గొలగాని హరివెంకటకుమారి శంకుస్థాపన చేశారు. రూ.2.80 కోట్లతో నిర్మించిన ఈ క్లాక్ టవర్‌లో 4 గడియారాల ఏర్పాటు పనులను మాత్రం ఢిల్లీకి చెందిన మెడివల్ ఇండియా సంస్థకు అప్పగించారు. 60 అడుగుల పొడవైన ఈ టవర్‌తో పాటు అద్భుతమైన ల్యాండ్ స్కేపింగ్‌తో కూడిన ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేశారు.ప్రధాన నగరాల్లో ‘మెడివల్’ క్లాక్స్చరిత్ర పుటల్లో తమకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న ఈ సౌధ గడియారాలు తయారు చేసిన మెడివల్ ఇండియా సంస్థ ఢిల్లీకి చెందింది. దేశంలోని పలు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్స్, భారీ గడియారాలన్నీ మెడివల్ ఇండియా సంస్థకు చెందినవే. ఢిల్లీ, యూపీలోని ఖతౌలీ, ఐఐటీ రూర్కెలా, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, సిమ్లా, ముస్సోరీ, పానిపట్, బెంగళూరు, గుర్‌గ్రామ్, జైపూర్, కోల్‌కతా, చైన్నె, డెహ్రాడూన్, రాజస్థాన్, అరుణాచల్‌ప్రదేశ్.. ఇలా ప్రతి నగరానికీ అక్కడి ప్రజల అభిరుచులకు తగ్గట్లుగా గడియారాలు అందించడం వీరి ప్రత్యేకత. కొన్ని కోట్ల మందికి వీరి గడియారాలు టైమ్‌ను చూపిస్తున్నాయి. ప్రతి గడియారంలోనూ ‘సీటీటీ’ ఉండేలా చూసుకోవడమే వీరి ప్రత్యేకత. సీ అంటే క్రాఫ్ట్‌మెన్ షిప్, టీ అంటే ట్రెడిషన్, టీ అంటే టెక్నాలజీతో తీర్చిదిద్దుతారు. విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన నాలుగు గడియారాలు డిజిటల్ కంట్రోల్‌తో పాటు సరైన సమయాన్ని చూపించేలా జీపీఎస్ ద్వారా అనుసంధానం చేశారు. టవర్ క్లాక్ కంట్రోలర్ ద్వారా నాలుగు గడియారాలను నడిపిస్తారు. విద్యుత్ సరఫరాలో ఏదైనా లోపాలు తలెత్తితే.. 48 నుంచి 72 గంటల పాటు నిర్విరామంగా నడిచేలా ప్రతి గడియారంలోనూ ఇన్‌బిల్ట్ పవర్ బ్యాకప్ ఉంది. 20 రకాలుగా క్లాక్ డయల్స్ తయారు చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. క్లాక్ టవర్‌తో జంక్షన్‌కు కొత్త రూపు తీసుకొచ్చిన మెడివల్ ఇండియా పనితనానికి వైజాగ్ నగరం సెల్యూట్ చేస్తూ మురిసిపోతోంది.నగర అభిరుచికి తగ్గట్టుగా తయారు చేస్తాందేశంలోని ప్రతి నగరంలోనూ దాదాపు మా సంస్థకు చెందిన గడియారాలు ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా క్లాక్ టవర్ ఏర్పాటు చేశాం. ముందుగా వైజాగ్ విశిష్టత తెలుసుకున్నాం. ఏ తరహా డిజైన్ ఇక్కడ సరిపోతుందో అంచనా వేసి.. నగర అభిరుచికి తగ్గట్లుగా తయారు చేశాం. భారతీయ సంప్రదాయం, చరిత్ర మిళితమయ్యేలా నైపుణ్యం కలిగిన హస్త కళాకారులతో గడియారాలు తయారు చేస్తుంటాం. చాలాకాలం మన్నికగా ఉండేలా.. ఇక్కడ సముద్రపు గాలులను తట్టుకుని నిలబడేలా క్లాక్ టవర్లోని వాచ్‌లు రూపొందించాం.–అంబికా బక్షి, మెడివల్ ఇండియా సీఈవోమరిన్ని విశే షాలు..● ప్రపంచంలో మొట్టమొదటి క్లాక్ టవర్‌ను ఏథెన్స్లో ఒకటో శతాబ్దంలో రోమన్ గ్రీస్ కాలంలో ఏర్పాటు చేశారు.● భారత్‌లో తొలి క్లాక్ టవర్ 1870లో ఢిల్లీలోని షాజహనాబాద్లో ఏర్పాటైంది.● ఏపీలో అత్యంత పురాతనమైన గంటస్తంభం భీమిలిలో ఉంది.● విజయనగరంలో 1885లో 68 అడుగుల గంట స్తంభం ఏర్పాటుకై న ఖర్చు రూ.5400● రాష్ట్రంలో పురాతన, ప్రసిద్ధ క్లాక్ టవర్ అనంతపురంలో ఉంది. 42 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ టవర్‌ను 1892లో బ్రిటిష్ ఇంజినీర్ రీస్ రెడ్‌వుడ్ విక్టోరియా రాణి పట్టాభిషేకానికి గుర్తుగా నిర్మించారు. లండన్‌లోని బిగ్‌బెన్ క్లాక్‌టవర్ డిజైన్‌తో దీన్ని నిర్మించడం విశేషం.● వైజాగ్‌లో నిర్మించిన క్లాక్ టవర్ వ్యయం రూ.2.80 కోట్లు. పొడవు 60 అడుగులు -
సికింద్రాబాద్ క్లాక్ టవర్.. ఆగిపోయిన టిక్ టిక్
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో ఉన్న చరిత్రాత్మక క్లాక్ టవర్ టిక్ టిక్ అనడం ఆగిపోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్ గడియారంలో టైమ్ ఆగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) సిబ్బంది పట్టించుకోవడం లేదు. అయితే తాము సోమవారం క్లాక్‌ను రిపేర్ చేస్తామని జీహచ్ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. సాధారణంగా క్లాక్ పనిచేయడం ఆగిపోతే స్థానికులు తమకు సమాచారమిస్తారని, ఈసారి అలాంటి ఫిర్యాదు ఏదీ రాకపోవడం వల్లే రిపేర్ ఆలస్యమైందని జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చెప్పారు. ఇదీచదవండి.. కిటికీలు తొలగించి చొరబాటు -
క్లాక్ టవర్‌ను కూల్చేయాలని ఎమ్మెల్యే ఆదేశం.. తల పట్టుకున్న అధికారులు!
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణలో భాగంగా స్థానిక వినాయక్‌చౌక్‌లోని క్లాక్‌టవర్ ని ర్మాణం రాజకీయ దుమారానికి కారణమవుతుంది. ఈ టవర్ కూల్చివేయాలంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటీవల మున్సిపల్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ కౌన్సి లర్లు ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తుండటం రాజకీయ వేడి రాజేస్తోంది. ఈ క్రమంలో బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రూ.కోటి వ్యయంతో నిర్మాణం.. పట్టణ ప్రగతి నిధులు రూ.కోటి వ్యయంతో వినా యక్చౌక్ సుందరీకరణలో భాగంగా 40 అడుగుల ఎత్తులో క్లాక్ టవర్ నిర్మించారు. చుట్టూరా గోడలను అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్ (ఏసీపీ క్లాడింగ్)తో చేపట్టారు. టవర్ గోడలకు వినాయకుడి ప్రతిమలతో పైభాగాన గ్లోబు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఏటా అట్టహాసంగా నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఈ చౌక్‌లోని శిశు మందిర్ నుంచే చేపట్టడంతో ఆరు రోడ్లతో కూడిన ఇక్కడి కూడలి వినాయక్ చౌక్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ చౌక్‌లో వినాయకుడి విగ్రహాన్నే ఏర్పా టు చేయాలంటూ టవర్ నిర్మాణ సమయంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆందోళనలు చేపట్టారు. అందుకు అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న స్పందిస్తూ వినాయకుడి విగ్రహాంతో పాటు వినాయక్చౌక్గానే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కూల్చివేతకు ఎమ్మెల్యే ఆదేశం ఈ టవర్ నిర్మాణంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, నిర్మాణం కూడా ప్రణాళికాబద్ధంగా చేపట్టలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటీవల బల్దియా అధికారులతో నిర్వహించిన సమీక్షలో అభిప్రాయపడ్డారు. తక్షణమే కూల్చివేయాలని, నిబంధనలు అడ్డంకిగా ఉంటే ప్రభుత్వానికి రాయాలని మున్సి పల్ అధికారులను ఆదేశించారు. అయితే బల్దియా కౌన్సిల్ ఆమోదంతోనే చేపట్టిన టవర్‌ను కూల్చివేయడమేంటని, ఎమ్మెల్యే వ్యాఖ్యలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు తప్పుపడుతున్నారు. రాజకీయాల కోసం టవర్ కూల్చివేత సరికాదంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ల భిన్నమైన వ్యాఖ్యలతో ఏం చేయాలో తెలియక బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కూల్చివేత సాధ్యమేనా... ఎమ్మెల్యే ఆదేశాలకనుగుణంగా టవర్ నిర్మాణాన్ని కూల్చివేయడం సాధ్యపడుతుందా అనే ప్రశ్నలు త లెత్తుతున్నాయి. ఎందుకంటే నిర్మాణ సమయంలో పలు శాఖల అధికారులతో కూడిన ఓ కమిటీ స్థలాన్ని పరిశీలించి నివేదిక అందజేసింది. తదనుగుణంగా కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారుల అనుమతులు సైతం తీసుకున్నారు. అనంతరమే బల్దియా కౌన్సిల్ తీర్మానంతో టవర్ నిర్మాణం చేపట్టారు. ఇంతటి ప్రక్రియతో చేపట్టిన క్లాక్ టవర్ కూల్చివేత అసలు సాధ్యపడుతుందా సందేహాం తలెత్తుతుంది. ఇప్పటికిప్పుడు దాన్ని కూల్చివేయాలంటే రూ.10లక్షలు అవసరమవుతాయని, మరో కొత్త నిర్మాణం చేపట్టా లన్నా రూ.20లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని బల్ది యా అధికారులు చెబుతుండడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఇటీవల జరిగిన సమావేశంలో క్లాక్ టవర్‌ను కూల్చివేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కౌన్సిల్ తీర్మానంతో ఉన్నతాధికారుల అనుమతితో నిర్మించిన ఈ టవర్ కూల్చివేత సాధ్యపడదు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దానిపై తదుపరి చర్యలు తీసుకుంటాం. – అరుణ్‌కుమార్, ఏఈ, ఆదిలాబాద్ -
Vizianagaram: గంటస్తంభానికి కొత్త సొబగులు
విజయనగరం: చారిత్రక నేపథ్యం కలిగిన విజయనగరం గంటస్తంభం కొత్త సొబగులు అద్దుకుంటోంది. సుమారు రెండు శతాబ్దాల కిందట నగరం నడిబొడ్డున నిర్మించిన గంటస్తంభం... ఆధునీకరణ పనులతో మరింత ఆకర్షణీయంగా దర్శనమివ్వనుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో జరుగుతున్న ఆధునీకరణ పనులు తుదిదశకు చేరుకోగా... వచ్చే నెల 5న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. పనుల ప్రగతిని డిప్యూటీ స్పీకర్ క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. గంట స్తంభం చరిత ఇది... 25 అడుగుల కైవారం, రూ.4,680 వ్యయంతో 8 కుంభుజాలతో 18వ శతాబ్దంలో గంటస్తంభాన్ని నిర్మించారు. గంటస్తంభానికి నలువైపులా నాలుగు పెద్ద గడియారాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12, రాత్రి 8 గంటలకు పెద్ద శబ్దంతో అలారం మోగేది. కాలక్రమేణా గంటస్తంభం చెక్కు చెదరనప్పటికీ దానికి అమర్చిన గడియారాలు పాడైనప్పుడు సాంకేతిక నిపుణులను రప్పించి మరమ్మతు చేయించేవారు. ప్రస్తుతం వాటి స్థానంలో అధునాతన గడియారాలు ఏర్పాటు చేయడంతో పాటు కట్టడంలో ఉన్న కిటికీలను మార్పు చేశారు. అలనాటి వైభవం దెబ్బతినకుండా కట్టడానికి పుట్టీపెట్టించి నూతనంగా రంగులతో కొత్త సొబగులు అద్దారు. గంటస్తంభం చుట్టూరా విద్యుత్ దీపాలంకరణతో వాటర్ ఫౌంటౌన్ నిర్మించారు. ఈ పనులతో రాత్రి వేళ చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించనుంది. మొత్తం ఆధునీకరణ పనులను దాతల సహకారంతో చేపట్టగా.. రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్టు అంచనా. పనులను పరిశీలించిన కోలగట్ల... గంటస్తంభం ఆధునికీకరణ పనులను అధికారులతో కలిసి కోలగ్ల వీరభద్రస్వామి పరిశీలించారు. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గంటస్తంభం చుట్టూ కలియతిరిగి ఆక్రమణల తొలగింపుపై టౌన్ ప్లానింగ్ అధికారులకు తగుసూచనలిచ్చారు. విజయనగర వైశిష్ట్యం ప్రతిబింబించేలా అలరారుతున్న గంటస్తంభాన్ని ఆధునీకరించి మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పూర్తయిన పనులతో మరింత శోభాయమానంగా అలరారబోతోందని చెప్పారు. నగరాన్ని కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ప్రధాన కూడళ్లను ఇప్పటికే అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కేదారశెట్టి సీతారామమూర్తి, 4వ డివిజన్ కార్పొరేటర్ మరోజు శ్రీనివాసరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కాళ్ల సూరిబాబు, ఏసీపీ మధుసూదన్‌రావు, డీఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ఘోరం: సెల్ఫీల కోసం టవర్‌పై కిక్కిరిసిన జనం, పిడుగుపాటుతో..
జైపూర్: చల్లబడిన వాతావరణం.. వానలో ‘సెల్ఫీ’ అత్యుత్సాహం ప్రాణాలు తీసింది. పిడుగుపాటుతో పదహారు మంది చనిపోగా.. డజన్ల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారుల చెప్తున్నారు. ఆదివారం సాయంత్రం వాన కురుస్తుండగా అమెర్ప్యాలెస్(అమర్ ప్యాలెస్)ను సందర్శిస్తున్న వాళ్లలో కొందరు ఆనందంతో క్లాక్‌టవర్‌పైకి ఎక్కారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా టవర్‌పై పిడుగుపడింది. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఆ కంగారులో పక్కనున్న హిల్ ఫారెస్ట్‌లోకి కొందరు దూకేశారు. ఇప్పటిదాకా 16 మంది మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారు. #Rajasthan | "With the help of locals, we rescued around 29 people from the Amer Fort area after lightning struck them. They were taken to the hospital. Of these, 16 people have died," Anand Srivastava, Police Commissioner, Jaipur said yesterday Visuals from the spot. pic.twitter.com/4RJLOJ661E — ANI (@ANI) July 11, 2021 కాగా, మరో 29 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకశాం ఉందని భావిస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
గంట గంటకు ఠంగ్... ఠంగ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న మొజంజాహీ మార్కెట్ క్లాక్ టవర్‌ను జీహెచ్ఎంసీ అధికారులు ఎట్టకేలకు పునరుద్ధరించారు. మొజంజాహీ మార్కెట్‌ను దత్తత తీసుకున్న మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ దాని పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన కొత్త గడియారం అమర్చారు. నాలుగు వైపులా లైట్లను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని గడియారాలు పని చేసేలా చర్యలు తీసుకున్నారు. చాలా ఏళ్ల తరువాత గడియారం ఠంగ్.. ఠంగ్.. మంటూ మోగడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ కాలంలో గడియారాలు అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో సమయం తెలుసుకునేందుకు ఇలా క్లాక్‌టవర్లను ఏర్పాటు చేసేవారు. ఇలాగే మొజంజాహీ మార్కెట్లోనూ ఎత్తైన గోపురం నిర్మించి నాలుగు వైపుల గడియారాలను అమర్చారు. ఇది ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడేది. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం అయ్యాక నగరం నడిబొడ్డున ఉన్న మొజంజాహీ మార్కెట్ మున్సిపల్ కార్పొరేషన్ అధీనంలో వచ్చింది. అనంతరం కొన్నేళ్ల వరకు మార్కెట్ క్లాక్‌టవర్‌లోని గడియారం పని చేసిందని, అయితే నిర్వహణ లేకపోవడంతో తరువాత ఆగిపోయింది. ప్రస్తుతం గడియారం పని తీరు.. ఈ గడియారం సక్రమంగా పని చేసేందుకు అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా బ్యాటరీ బ్యాకప్‌తో గడియారం పని చేసేలా చర్యలు తీసుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో బ్యాటరీ బ్యాకప్ లేకపోయినా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాగానే గడియారం తిరిగి సమయాన్ని సరి చేసుకుని పని చేస్తుంది. అలాగే ప్రతి గంటకు గడియారం మోగుతుంది. రాత్రి పూట ప్రజలకు ఇబ్బంది కలగకుండా అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు గడియారం గంటలు మోగకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే రాత్రి వేళలో దూరం నుంచి గడియారం కనిపించేలా లైట్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొజంజాహీ మార్కెట్ గడియారం చరిత్ర... 1908లో హైదరాబాద్ నగరం భారీ వరదలతో అతలాకుతలమైంది. దీంతో 1912లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సిటీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పా టు చేశాడు. ఈ బోర్డుకు అతని రెండో కుమారుడు మొజంజా(షుజాత్ అలీఖాన్)ను అధ్యక్షుడిగా వ్యవ హరించారు. అప్పటికే నగరంలో మహెబూబ్చౌక్, రెసిడెన్సీ బజార్, బేగంబజార్ వంటి మార్కెట్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఒకేచోటా అన్ని రకాల వస్తువులు, పండ్లు, కిరాణంతో పాటు తినుబండారాలు లభించేలా 1933–35 మధ్య మొజంజాహీ మార్కెట్‌ను నిర్మించారు. మార్కెట్ అంతా రాళ్లతో నిర్మించి పై భాగంలో ఎత్తైన ఓ గోపురం నిర్మించారు. ఆ గోపురానికి నాలుగు వైపుల గడియారాలు ఏర్పాటు చేశారు. -
ముసుగు కాదు..బొమ్మే తీసేయండి
బాపట్ల: ‘‘వందేళ్ల చరిత్ర కలిగిన గడియార స్తంభాన్ని కూల్చేస్తే.. అందరం కలిసి విరాళాలు వేసుకుని గడియార స్తంభాన్ని నిర్మించాం...ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బొమ్మను తొలగిస్తే స్తంభం దెబ్బతినే ప్రమాదం ఉంది’ అంటూ బాపట్ల మున్సిపాలిటీలోని తెలుగుదేశం పార్టీకి చెందిన వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబుతోపాటు ఆ పార్టీ కౌన్సిలర్లు చాటకొండ సాయిరామ్, ఐనంపూడి యోహోషువా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు చరిత్ర కలిగిన గడియార స్తంభాలపై ఇతరుల ఫొటోలు ఉండరాదని, బొమ్మకు వేసిన ముసుగు తొలగించి రంగు వేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బొమ్మలు తొలగించటం, హోర్డింగ్ విషయంలో అలసత్వాన్ని ఏమాత్రం సహించేది లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. బాపట్ల పట్టణంలోని గడియార స్తంభంపె ఎమ్మెల్సీ బొమ్మ, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలపై హైకోర్టు మండిపడింది. మున్సిపల్ అధికారులపై మరోసారి అగ్రహం పట్టణంలో రాజకీయ నాయకుల బొమ్మలను ప్రారంభోత్సవ పలకలపై వేయటం, అనధికారికంగా హోర్డింగ్ పెట్టడంపై అగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. మళ్లీ టీడీపీకి చెందిన కౌన్సిలర్లు కోర్టును ఆశ్రయించటంతో అధికారులకు అక్షింతలు వేసింది. బొమ్మలను ఉంచటం వలననే వాటిపై కోర్టులను ఆశ్రయిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. వెంటనే బొమ్మలున్న ప్రదేశంలో రంగులు వేయించాలంటూ సూచించింది. -
అందుకే.. బిగ్‌బెన్ ధ్వని అంత మధురం
లండన్: లండన్‌లో ఉన్న అతి పెద్ద క్లాక్ టవర్ బిగ్‌బెన్. దీని నిర్మాణం జరిగి దాదాపు 160 ఏళ్లు గడుస్తున్నాయి. బిగ్‌బెన్ గంట సుమారు 13.7 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి నిత్యం ఇక్కడకి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఈ బిగ్‌బెన్ గురించి శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ గడియారంలోని గంట చేసే ధ్యని అంత మధురంగా ఎందుకు ఉంటుంది? అన్న విషయాన్ని లేజర్ సహాయంతో కనుగొన్నారు. బిగ్బెన్లో గంటను మోగించడానికి 200 కిలోల బరువుండే సుత్తిని ఉపయోగిస్తారు. ఈ ప్రయోగం కోసం వారు రెండు లేజర్లను ఉపయోగించారు. వీటి సహాయంతో గంట నుంచి ఉత్పత్తి అయ్యే పౌనః పున్యాలను మ్యాపింగ్ చేసి ఒక యానిమేషన్‌ను రూపొందించారు. దీని ద్వారా గంట వెలువరించే విభిన్న కంపనాల నమూనాలను గుర్తించారు. ప్రత్యేక పౌనః పున్యాల వరుసల కారణంగా బిగ్‌బెన్ నుంచి శ్రావ్యమైన ధ్వని వెలువడుతుందని పరిశోధకులు గుర్తించారు. అదన్నమాట సంగతి! అందుకే, బిగ్‌బెన్ నుంచి వెలువడే ధ్వని అంత మధురంగా ఉంటుంది అని వివరించారు. -
యేసు ప్రభువుతోనే మానవాళికి రక్షణ
క్లాక్‌టవర్: మానవాళి కోసం ఈలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుతోనే మనకు సంపూర్ణ రక్షణ లభిస్తుందని అంతర్జాతీయ ముఖ్య ప్రసంగీకులు బ్రదర్ అనిల్‌కుమార్ అన్నారు. రక్షణ టీవీ ఎండి జక్కుల బెనహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సువార్త సంగీత ఉజ్జీవ మహోత్సవాలు చివరిరోజు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా బ్రదర్ అనిల్‌కుమార్ హాజరై ప్రసంగించారు. యేసుక్రీస్తును నమ్ముకొన్న ప్రతి విశ్వాసి ఆయనకు సాక్షులుగా ఉంటూ నిత్యజీవంలోకి ప్రవేశిద్దామన్నారు. చివరిరోజు శక్తివంతమైన దేవుని వాక్యాన్ని ఉత్సాహంగా అందించి ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నింపారు. దేవుడు తన కృపను అనుగ్రహిస్తే పాలమూర్‌కు మళ్లీ వచ్చి మూడు రోజుల పాటు సభలు నిర్వహిస్తానన్నారు. అనంతరం స్థానిక సం ఘాల పాస్టర్లు బ్రదర్ అనిల్‌కుమార్ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆకట్టుకొన్న బ్రదర్ హనోకు గీతాలు... ప్రత్యేక సంగీత కచ్చేరితో సువార్త గాయకుడు బ్రదర్ హనోకు అందించిన ఆరాధన స్తుతి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందుకు సంగీత దర్శకుడు పిజెడి కుమార్ అందించిన సంగీతం మైదానంలో ఉన్నా విశ్వాసులందరిలో ఒక నూతనోత్సవాన్ని నింపింది. మూడు రోజులపాటు నిర్వహించిన మహోత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించడంతో ఎంబిసి చెర్మన్ రెవ.వరప్రసాద్ ప్రత్యేక గ్రీటింగ్స్ తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలిపారు. కెమెరామెన్ నుంచి మేనేజింగ్ డెరైక్టర్ స్థాయికి ఎదిగా... వృతిరీత్యా సినిమాల్లో కెమెరామెన్‌గా పనిచేస్తూ దేవుని ఆశీర్వాదంతో రక్షణ టీవీకి మేనేజింగ్ డెరైక్టర్ని అయ్యానని జక్కుల బెనహర్ అన్నారు. ఈరోజు సినిమాలో పనిచేసే కళాకారులంతా తమ చానెల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దేవుడు అనుగ్రహిస్తే ఉన్నత స్థాయికి వస్తామనేందుకు తానే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పొగ్రాం కన్వీనర్ యేసుపాదం, స్థానిక సంఘాల పాస్టర్లు ఎంఆర్ సుందర్‌పాల్, బిఎస్ పరంజ్యోతి, పృథ్వీరాజ్, జయపాల్తోపాటు, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. -
లాస్ట్ కప్...చివరి సిప్
కొద్దిరోజుల్లో దూరం కానున్న గార్డెన్ ఛాయ్ కోసం శనివారం నగర ప్రజలు బారులు తీరారు. ఆదివారం నుంచి రెస్టారెంట్ మూతపడనున్నట్లు తెలియడంతో గార్డెన్ రెస్టారెంట్ అభిమానులు వందల సంఖ్యలో క్లాక్‌టవర్ వద్దకు తరలి వచ్చి గార్డెన్ రెస్టారెంట్లో ఉస్మానియా బిస్కెట్, ఇరానీ చాయ్ సేవించారు. ఈ సందర్బంగా రెస్టారెంట్‌కు వచ్చిన ప్రతి కస్టమర్ హోటల్ కనుమరుగుకానుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు యువకులు చివరి ఛాయ్గా భావించి చీర్స్ కొట్టి మరీ ఛాయ్ మాధుర్యాన్ని గుండెలనిండా నింపుకున్నారు. పలువురు సీనియర్ సిటిజన్లు గార్డెన్ రెస్టారెంట్‌తో తమకు దశాబ్దాల తరబడి పెనవేసుకున్న అనుబంధాన్ని మననం చేసుకోవడం గమనార్హం. శనివారం గార్డెన్ రెస్టారెంట్లో కనిపించిన దృశ్యాలివీ.. కొసమెరుపు...ఇదిలా ఉండగా మెట్రో అధికారుల నుంచి పరిహారం అందని కారణంగా ఈ ప్రాంతంలో మెట్రో పనులకు మరికొంత కాలం పట్ట వచ్చునని సమాచారం. అప్పటి వరకు గార్డెన్ రెస్టారెంట్ యధావిధిగా కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. - సికింద్రాబాద్ -
టీడీపీ నేతలతోనే వెళ్లండి
‘మా వాళ్లేమి చేసినా చూసీచూడనట్టు వెళ్లిపోండి ... మరీ ముక్కు సూటిగా పోవద్దంటూ’ విజయవాడలో గతంలో జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో హుకుం జారీ చేశారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరో ముందడుగు వేశారు. మంగళవారం నగరపాలక సంస్థలోని పలు విభాగాల సమీక్ష సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ‘నగరంలో ఏయే పనులు చేస్తారో నివేదిక తయారు చేసుకోండి ... పక్కా ప్రణాళికతో పనులు చేయడానికి డివిజన్లలోకి వెళ్లండి ...అలా వెళ్లే సమయంలో టీడీపీ స్థానిక నేతలను మీ వెంట తీసుకువెళ్లండి ... వారితోనే తిరగండి. వారిని కాదని వీధుల్లో ఏ పనీ చేయవద్దు’ అని ఆదేశించారు. అక్కడికే పరిమితం కాలేదు గత ప్రభుత్వాల్లో ఇచ్చిన పట్టాలు రద్దు చేస్తాం ... ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తే తొలగిస్తాం... కోర్టుకు వెళ్లినా సరే మా పని మేం చేసుకుపోతామంటూ తమ దౌర్జన్య ప్రణాళికనూ వారి ముందుంచారు. ఒంగోలు అర్బన్: నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని సమస్యలపై నివేదిక తయారు చేయాలని, ఆ సమస్యలను గుర్తించేందుకు ఆయా డివిజన్లకు అధికారులు వెళ్ళినపుడు తప్పకుండా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులను వెంట తీసుకువెళ్ళాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్థన్ నగరపాలక సంస్థ సిబ్బందికి హుకుం జారీ చేశారు. ఈ మేరకు స్థానిక నగరపాలక సంస్థలో విభాగాల వారీగా దామచర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ సెంటర్లో గతంలో ఇచ్చిన పట్టాలను, ఆక్రమణలను తొలగిస్తామని స్పష్టం చేశారు. దీనిపై కోర్డుకి వెళ్లినా మరింకేమి చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నీరు వృథాకాకుండా ప్రతి ఇంటిలో నీటి సంపులుండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాత నాయకులు, అధికారులకు అలవాటు పడి చేసే పనులను మానుకొని సజావుగా పూర్తి చేయాలనిన్నారు. నగరంలో ఉన్న అన్నీ ముఖ్య కూడల్లో చెత్త డబ్బాలని ఉంచాలని సూచాంచారు. జనవరి 7 నుంచి తానుకూడా వార్డుల్లో పరిశీలిస్తానని అన్నారు. సమీక్ష అనంతరం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పరిశుభ్ర ఒంగోలు కోసం రోడ్లు విస్తరించడం, ఆ రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటుతామన్నారు. రోడ్డుకి మధ్యలో డివైడర్లు,సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్ల మధ్యలో అక్కడక్కడా దేశ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురుగు కాలువల మరమ్మతులు, నిర్మాణాలతో పాటు సిమెంట్ రోడ్లు, ప్రతిరోజు మంచినీటి సరఫరా అయ్యేలా కృషి చేస్తానన్నారు. ట్రాఫిక్‌కి సంబంధించి సిగ్నల్ వ్యవస్థని పటిష్టంగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. 100 రోజుల్లో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టాలని చెప్పారు. - క్లాక్ టవర్ నిర్మాణానికి అభ్యంతరాలతో స్థలం మార్చాం నగరంలో క్లాక్‌టవర్ నిర్మాణ విషయంపై విలేకర్లు ప్రశ్నించగా స్థానిక చర్చి సెంటర్లో చేపట్టాలని తొలుత అనుకున్నాం... చర్చి ప్రతినిధులు ‘అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహమే ముద్దు క్లాక్ టవర్ వద్దు’ అనే విధంగా అడ్డుకోవడంతో పాత మార్కెట్ సెంటర్, మంగమూరు రోడ్డు భైపాస్ రోడ్డుపై నిర్మించేందుకుమార్పులు చేస్తామని అన్నారు. -
క్రీస్తు ప్రేమను పంచాలి
క్లాక్‌టవర్(మహబూబ్‌నగర్): రాష్ట్రంలో క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. బుధవారం రాత్రి జిల్లాకేంద్రంలోని ఎంబీసీ చర్చి ఆవరణలో రెవ.వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలను ఆయన కేక్‌కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. క్రైస్తవుల సమస్యలు ఏమిటో తమకు తెలుసునన్నారు. క్రైస్తవులకు క్రీస్తుప్రేమను లోకమంతా పంచాలన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..శాంతి సమాధానాలతో పండుగను జరుపుకోవడం క్రైస్తవులకే సాధ్యమన్నారు. దేవుడి ఆశీర్వాదంతోనే ఈరోజు మీముందు ఉన్నానని అన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి మంత్రిగా తనవంతు కృషిచేస్తానని హామీఇచ్చారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్టారావు మాట్లాడుతూ.. క్రీస్తుప్రేమ వర్ణించలేదని, విశ్వాసులంతా క్రీస్తును పోలి నడుచుకోవడం అభినందనీయమన్నారు. లోకమంతా ప్రేమను పంచుతూ రాణించాలన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ.. ప్రేమతో నడుచుకోవడం క్రైస్తవులకే సాధ్యమన్నారు. క్రైస్తవుల పట్ల తనకు ఎనలేని అభిమానం ఉందన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత లోకంలో శాంతి సమాధానాలు కరువడంతో అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. వాటిని అధిగమించేందుకు ప్రార్థించాలన్నారు. అనంతరం అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా ఈమందిరంలో ప్రార్థనలు చేశా.. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చాడని గుర్తుచేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ మాట్లాడుతూ.. చిన్నప్పట్నుంచి సండేస్కూల్కి వెళ్లేవాడిని, బైబిల్‌పై తనకు పూర్తిగా విశ్వాసం ఉందన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రైస్తవులు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను పంచాలన్నారు. జెడ్పీచైర్మన్ బండారి బాస్కర్ మాట్లాడుతూ.. మూటలు మూసే తనను దేవుడు ఈస్థితికి తీసుకొచ్చాడన్నారు. కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. ఈ లోకంలో ప్రజలు బాధలు, ఆవేదనలో కూరుకుపోయి ఉన్నారని, వీటి నుంచి విముక్తి కల్పించడం యేసుక్రీస్తు ప్రభువుకే సాధ్యమన్నారు. అనంతరం జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ డాక్టర్ రాజారాం తదితరులు మాట్లాడారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంబీసీ వైస్ చైర్మన్ బీఏ పురుషోత్తం, కార్యదర్శి జోసెఫ్, కౌన్సిల్ నేతలు, అధికసంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. -
రాకపోక..అస్తవ్యస్తం
అడుగడుగున గుంతలు.. అడ్డంగా వచ్చే వాహనాలు.. ఎక్కడా అమలుకాని ట్రాఫిక్ నిబంధనలు.. మహబూబ్ నగర్ పట్టణంలో ఒక చోట నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. నిత్యం రద్దీగా ఉండే క్లాక్ టవర్ నుంచి పాత బస్తీ వరకు రాకపోకలకు పెద్ద సాహసమే చేయాలి. ఈ ప్రాంతాల్లో చిన్నారులను, వృద్ధులను వెంట బెట్టుకొని రోడ్డు దాటడం కష్టంతో కూడుకున్న పని. ఏ క్షణమైనా ఆదమరిచినా ఏదొక వాహనం వచ్చి ఢీకొంటుంది. కలెక్టరేట్, పాన్ చౌరస్తా, న్యూటౌన్ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరు ఎటువైపు వెళ్తున్నారో అర్థం కాదు. ఇక సినిమా థియేటర్ల వద్ద పరిస్థితి అధ్వానం. ట్రాఫిక్ విషయమై నిత్యం ఇక్కడ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల ఇబ్బందులను గమనించి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
కుల వివక్షపై పోరాడిన మహనీయుడు పూలే
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే అని కలెక్టర్ టి.చిరంజీవులు కొనియడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక క్లాక్‌టవర్ సెంటర్లో జరిగిన పూలే వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, మహిళా అక్షరాస్యత అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పోరాడాడన్నారు. అందరూ అక్షరాస్యులు అయితేనే పూలే ఆశయాలను సాధించినట్టవుతుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. బీసీల్లో 144 కులాలున్నాయన్నారు. ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చునన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూలన, నిర్బంధ విద్య కోసం పూలే ఎంతో కృషి చేశారన్నారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని.. పూలే ఆశయాలను నెరవేర్చాలన్నారు. కేంద్రం విద్యాభివృద్ధికి రూ.50 వేల కోట్లు యేటా ఖర్చు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, ఏజేసీ నీలకంఠం, డీఈఓ జగదీష్, బీసీ సంక్షేమ శాఖ ఈడీ గంగాధర్, డీడీ రాజశేఖర్, ఆర్డీఓ జహీర్, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, సుంకరి మల్లేష్‌గౌడ్, వీరెల్లి చంద్రశేఖర్, చక్రహరి రామరాజు, కొండేటి మల్లయ్య, పంకజ్‌యాదవ్, ఎస్.మల్లయ్య, పర్వతాలు, బొర్ర సుధాకర్, జి.వెంకన్న, డి.లక్ష్మీనారాయణ, వెంకటపతి, అంబటి వెంకన్న, మాసారం సిద్ధార్థ పూలే తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల వివరాలు నోటీసు బోర్డులో ఉంచాలి కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో సబ్సిడీని భరిస్తూ ప్రజలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేసేందుకు కృషి చేస్తుందని.. పంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డుపై వాటి వివరాలు ఉంచాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. గురువారం జేసీ ఛాంబర్లో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్లు, కిరోసిన్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఉన్న రేషన్‌షాపుల వివరాలు.. అందులో వచ్చే సరుకుల వివరాలు గ్రామ ప్రజలకు తెలిసేలా చూడాలని కోరారు. కిరోసిన్ సక్రమంగా ప్రజలకు అందేలా చూడాలని తెలిపారు. అమ్మహస్తం కార్యక్రమం ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్నప్పుడు వాటిని డీలర్లు డీడీలు చెల్లించడంలో అలసత్వం వహిస్తున్నారని, 3 నెలల వరకు డీడీలు చెల్లించని వారికీ నోటీసులు జారీ చేయాలని పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. అనంతరం ఎల్పీజీ, సీడింగ్, దీపం పథకం గ్రౌండింగ్, రేషన్‌కార్డుల సీడింగ్, కొత్త కార్డుల పంపిణీ, సేల్ ప్రొసీడ్స్పై జేసీ హరిజవహర్‌లాల్ సమీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ సీడింగ్‌లో ఆధార్‌నమోదు అనుకున్నంత రీతిలో జరగడం లేదని, దానిని ఏజెన్సీల వారు బాధ్యతగా తీసుకుని నమోదు చేయించాలని తెలిపారు. సమావేశంలో డీఎస్ఓ నాగేశ్వరరావు, ఎఎస్‌ఓ వెంకటేశ్వర్లు, కిరోసిన్ డీలర్లు, ఆధార్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు. -
క్లాక్ టవర్‌కు కొత్త హంగులు
సాక్షి, ముంబై: నగరంలోని పురాతన కట్టడాల్లో ఒకటైన ‘రాజాబాయి క్లాక్ టవర్’ త్వరలో కొత్త హంగులతో దర్శనమివ్వనుంది. ఏకంగా 135 సంవత్సరాల తరువాత ఈ టవర్‌కు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ముంబై యూనివర్సిటీ ఆవరణలో ఉన్న రాజాబాయి టవర్‌ను ప్రపంచంలోనే ప్రముఖ ఆర్కిటె క్చర్‌గా పేరుగాంచిన సర్ జార్జ్ గిల్బర్ట్ స్కాట్ రూపకల్పన చేశారు. దీన్ని 1878లో నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దీనికి పెద్దగా మరమ్మతులు జరగలేద ంటే నమ్మశక్యం కాదు. అయితే ఇది అక్షరాలా నిజం. దూరం నుంచి చూస్తే చెక్కు చెదరలేదని అనిపించినా దగ్గరగా చూస్తే పగుళ్లిచ్చిన రాళ్లు కనిపిస్తాయి. కొన్ని ఊడి కిందపడిపోయే దశలో ఉన్నాయి. దీంతో మరమ్మతులు చేపట్టి, రాళ్లకు పాలిష్ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇది హెరిటేజ్ కట్టడం కావడంతో నిపుణుల మార్గదర్శనంతో పనులు చేపడుతున్నారు.