క్లాక్ టవర్‌కు కొత్త హంగులు | Clock Tower of the new arrangements | Sakshi
Sakshi News home page

క్లాక్ టవర్‌కు కొత్త హంగులు

Published Mon, Sep 16 2013 12:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

Clock Tower of the new arrangements

సాక్షి, ముంబై: నగరంలోని పురాతన కట్టడాల్లో ఒకటైన ‘రాజాబాయి క్లాక్ టవర్’ త్వరలో కొత్త హంగులతో దర్శనమివ్వనుంది. ఏకంగా 135 సంవత్సరాల తరువాత ఈ టవర్‌కు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ముంబై యూనివర్సిటీ ఆవరణలో ఉన్న రాజాబాయి టవర్‌ను ప్రపంచంలోనే ప్రముఖ ఆర్కిటె క్చర్‌గా పేరుగాంచిన సర్ జార్జ్ గిల్బర్ట్ స్కాట్ రూపకల్పన చేశారు. దీన్ని 1878లో  నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దీనికి పెద్దగా మరమ్మతులు జరగలేద ంటే నమ్మశక్యం కాదు. అయితే ఇది అక్షరాలా నిజం. దూరం నుంచి చూస్తే  చెక్కు చెదరలేదని అనిపించినా దగ్గరగా చూస్తే పగుళ్లిచ్చిన రాళ్లు కనిపిస్తాయి. కొన్ని ఊడి కిందపడిపోయే దశలో ఉన్నాయి. దీంతో మరమ్మతులు చేపట్టి, రాళ్లకు పాలిష్ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇది హెరిటేజ్ కట్టడం కావడంతో   నిపుణుల మార్గదర్శనంతో పనులు చేపడుతున్నారు.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement