
మలబార్ హిల్ వాక్‌వేకు విశేష ప్రజాదరణ
సింగపూర్ ‘ట్రీ టాప్‌వాక్’తరహాలో చెట్ల మధ్యనుంచి వాక్‌వే నిర్మాణం
ప్రారంభించిన 10 రోజుల్లో 10,000 మంది సందర్శన
మరో రెండు వారాల వరకూ బుకింగ్స్ ఫుల్
మలబార్ హిల్ పరిసరాల్లో ఇటీవల ప్రారంభించిన ‘వాక్‌వే’కు పర్యాటకులు, ముంబైకర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభించిన వారం రోజుల్లోనే 10 వేలకుపైగా పర్యాటకులు ఈ ఎలివేటెడ్ మార్గం మీదుగా రాకపోకలు సాగించి ప్రకృతి అందాలను ఆస్వాదించగా కొందరికి టెకెట్లు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరో రెండు వారాల వరకు బుకింగ్ ఫుల్ కావడంతో ఈ వాక్‌వే సందర్శనకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. టికెట్లు ఆన్‌లైన్‌లో తప్ప నేరుగా అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల్లో 300మందికి పైగా పర్యాటకులు మలబార్ హిల్ అందాలను చూడకుండానే తిరిగి వెళ్లిపోయారు.
ఒక్క చెట్టుకూ హాని కలగకుండా.. నిర్మాణం
మలబార్ హిల్ ప్రాంతంలో కొండపై కమలా నెహ్రూ పార్క్ ఉంది. దీనికి కూతవేటు దూరంలో బూట్ (షూ) బంగ్లా ఉద్యాన వనం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు కచి్చతంగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తారు. దీంతో ఇక్కడికి వచి్చన పర్యాటకులను మరింత ఆహ్లాదాన్ని పంచాలన్న ఉద్దేశ్యంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సింగపూర్‌లోని ‘ట్రీ టాప్ వాక్’తరహాలో నైసర్గిక ఎలివేటెడ్ మార్గాన్ని నిరి్మంచింది. ఇలాంటి మార్గాన్ని ముంబైలోని ఉద్యానవనంలో నిర్మించడం ఇదే ప్రథమం. అందుకు బీఎంసీ దాదాపు రూ.30 కోట్లకుపైనే ఖర్చు చేసింది. వందలాది చెట్ల మధ్యనుంచి ఈ మార్గాన్ని నిర్మించినప్పటికీ ఒక్క చెట్టుకు కూడా హాని కలగకుండా జాగ్రత్త తీసుకున్నారు.
రూ.25తో మానసికోల్లాసం..
ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎలివేటెడ్ మార్గం తెరిచి ఉంటుంది. ఒక్కొక్కరూ రూ.25 చెల్లించి చెట్ల మధ్యలోంచి ఈ మార్గం మీదుగా వెళుతూ ఉద్యాన వనంలో ఉన్న వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. అదేవిధంగా కొండ కిందున్న అరేబియా సముద్ర తీరం అందాలను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు, చరి్నరోడ్ (గిర్గావ్) చౌపాటి, క్వీన్ ¯ð నెక్లెస్ (మెరైన్ డ్రైవ్)లను తిలకించవచ్చు. దీంతో శని, ఆదివారాల్లో ఇక్కడ విపరీతమైన రద్దీ చోటుచేసుకుంటోంది.
‘ఆన్‌లైన్’మాత్రమే ఎందుకు?
అయితే సందర్శకులు ఆఫ్‌లైన్‌లో టికెట్లు లభించకపోవడంపై ఇక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంచడంపై నిలదీస్తున్నారు. సీనియర్ సిటిజన్లు, చదువుకోని వారు ఆన్‌లైన్‌లో టికెట్లు ఎలా పొందగలరని ప్రశి్నస్తున్నారు. నేరుగా టికెట్లు కొనే వీలు లేక చాలా దూరం నుంచి వచి్చన పర్యాటకులు వెనుదిరుగుతున్నారని, ఇలాంటి వారికోసం ఆఫ్‌లైన్‌లో కొన్ని టికెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
పర్యాటకుల క్షేమంకోసమే..
ఈ వాక్‌వేపై మొబైల్లో ఫొటోలకు అనుమతి లేదు. దీని వల్ల ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కొంతమంది యువతీ యువకులు ఈ నిబంధనను అతిక్రమించి ఎలివేటెడ్ మార్గంపై నిలబడి వీడియోలు, ఫొటోలు తీసుకుంటున్నారు. రీల్స్ పేరుతో ప్రాణాంతక స్టంట్లు చేస్తున్నారు. ఈ కారణంగా రద్దీ ఏర్పడి పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఇందువల్లే మొబైల్ ఫోన్లకు అనుమతించడం లేదని ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీఎంసీ సిబ్బంది తెలిపారు.