tree bushes
-
సింగపూర్ ‘ట్రీ టాప్‌వాక్’ తరహాలో వాక్‌వే, క్యూ కడుతున్న పర్యాటకులు
మలబార్ హిల్ పరిసరాల్లో ఇటీవల ప్రారంభించిన ‘వాక్‌వే’కు పర్యాటకులు, ముంబైకర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభించిన వారం రోజుల్లోనే 10 వేలకుపైగా పర్యాటకులు ఈ ఎలివేటెడ్ మార్గం మీదుగా రాకపోకలు సాగించి ప్రకృతి అందాలను ఆస్వాదించగా కొందరికి టెకెట్లు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరో రెండు వారాల వరకు బుకింగ్ ఫుల్ కావడంతో ఈ వాక్‌వే సందర్శనకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. టికెట్లు ఆన్లైన్లో తప్ప నేరుగా అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల్లో 300మందికి పైగా పర్యాటకులు మలబార్ హిల్ అందాలను చూడకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఒక్క చెట్టుకూ హాని కలగకుండా.. నిర్మాణం మలబార్ హిల్ ప్రాంతంలో కొండపై కమలా నెహ్రూ పార్క్ ఉంది. దీనికి కూతవేటు దూరంలో బూట్ (షూ) బంగ్లా ఉద్యాన వనం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు కచి్చతంగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తారు. దీంతో ఇక్కడికి వచి్చన పర్యాటకులను మరింత ఆహ్లాదాన్ని పంచాలన్న ఉద్దేశ్యంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సింగపూర్‌లోని ‘ట్రీ టాప్ వాక్’తరహాలో నైసర్గిక ఎలివేటెడ్ మార్గాన్ని నిరి్మంచింది. ఇలాంటి మార్గాన్ని ముంబైలోని ఉద్యానవనంలో నిర్మించడం ఇదే ప్రథమం. అందుకు బీఎంసీ దాదాపు రూ.30 కోట్లకుపైనే ఖర్చు చేసింది. వందలాది చెట్ల మధ్యనుంచి ఈ మార్గాన్ని నిర్మించినప్పటికీ ఒక్క చెట్టుకు కూడా హాని కలగకుండా జాగ్రత్త తీసుకున్నారు. రూ.25తో మానసికోల్లాసం.. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎలివేటెడ్ మార్గం తెరిచి ఉంటుంది. ఒక్కొక్కరూ రూ.25 చెల్లించి చెట్ల మధ్యలోంచి ఈ మార్గం మీదుగా వెళుతూ ఉద్యాన వనంలో ఉన్న వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. అదేవిధంగా కొండ కిందున్న అరేబియా సముద్ర తీరం అందాలను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు, చరి్నరోడ్ (గిర్గావ్) చౌపాటి, క్వీన్ ¯ð నెక్లెస్ (మెరైన్ డ్రైవ్)లను తిలకించవచ్చు. దీంతో శని, ఆదివారాల్లో ఇక్కడ విపరీతమైన రద్దీ చోటుచేసుకుంటోంది. ‘ఆన్లైన్’మాత్రమే ఎందుకు? అయితే సందర్శకులు ఆఫ్‌లైన్‌లో టికెట్లు లభించకపోవడంపై ఇక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంచడంపై నిలదీస్తున్నారు. సీనియర్ సిటిజన్లు, చదువుకోని వారు ఆన్లైన్లో టికెట్లు ఎలా పొందగలరని ప్రశి్నస్తున్నారు. నేరుగా టికెట్లు కొనే వీలు లేక చాలా దూరం నుంచి వచి్చన పర్యాటకులు వెనుదిరుగుతున్నారని, ఇలాంటి వారికోసం ఆఫ్‌లైన్‌లో కొన్ని టికెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. పర్యాటకుల క్షేమంకోసమే.. ఈ వాక్‌వేపై మొబైల్లో ఫొటోలకు అనుమతి లేదు. దీని వల్ల ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కొంతమంది యువతీ యువకులు ఈ నిబంధనను అతిక్రమించి ఎలివేటెడ్ మార్గంపై నిలబడి వీడియోలు, ఫొటోలు తీసుకుంటున్నారు. రీల్స్ పేరుతో ప్రాణాంతక స్టంట్లు చేస్తున్నారు. ఈ కారణంగా రద్దీ ఏర్పడి పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఇందువల్లే మొబైల్ ఫోన్లకు అనుమతించడం లేదని ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీఎంసీ సిబ్బంది తెలిపారు. View this post on Instagram A post shared by MANISH DEO | Travel Photographer (@deomanish) -
నేనేం పాపం చేశానమ్మా..
భువనగిరి: నవజాత శిశువును ఓ తల్లి కనకరం లేకుండా వదిలేసింది. చెట్ల పొదల్లో విసిరేసిన ఆ శిశువును కుక్కలు పీక్కుతింటూ బయటకు తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. భువనగిరి పట్టణంలోని పాత శిల్పా హోటల్ వెనుక భాగంలో బాబూ జగ్జీవన్‌రామ్ భవనం ఉంది. అక్కడ ఓ పార్టీకి చెందిన నాయకులు శనివారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భవనం సమీపంలోనే సమాధులు, చెట్ల పొదలు ఉన్నాయి. సమావేశం నుంచి బయటికి వచ్చి న ఓ మహిళ చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువును కుక్కలు బయటకు లాక్కురావడాన్ని గమనించింది. ఈ విషయాన్ని ఆమె తోటి నాయకులకు చెప్పగానే వారు అక్కడికి వచ్చి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే ఆ ఆడశిశువు మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఐసీడీఎస్ సిబ్బంది సహాయంతో పోస్టుమార్టం నిమిత్తం శిశువు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
కొమ్మలు కొట్టేసి.. కోట్లు నొక్కేసి..
విద్యుత్ లైన్లను పునరుద్ధరించడమంటే.. ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ లీకేజీలు గుర్తించి సరిచేయడం, ఎర్తింగ్‌ను మెరుగుపర్చడం, దెబ్బతిన్న కండెన్సర్లను గుర్తించి కొత్తవి అమర్చడం, లూజ్ కాంటాక్ట్‌లను సరి చేయడం.. కానీ డిస్కంలో కొంత మంది ఇంజినీర్లు లైన్ల పునరుద్ధరించడమంటే కేవలం విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా చిన్నపాటి ఈదురుగాలులతో కూడిన వర్షానికే విద్యుత్ ఫీడర్లు కుప్పకూలుతుండటానికి ఇదే కారణం. లైన్ల పునరుద్ధరణకు డిస్కం ఏటా రూ.100–120 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ.. సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటంలేదు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో పరిధిలో 13 వేలకుపైగా కిలోమీటర్ల 11 కేవీ, 2500 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 3600 కిలోమీటర్ల ఎల్టీ లైన్లు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యత సెంట్రల్ బ్రేక్ డౌన్ (సీబీడీ) విభాగం చూస్తోంది. ఇందుకోసం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) 2013–14 వార్షిక సంవత్సరానికి రూ.110 కోట్లు కేటాయించగా, 2015–16 వార్షిక సంవత్సరానికి రూ.120 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత ఏటా పది శాతం చొప్పున పెంచుతూనే ఉంది. లైన్ల పునరుద్ధ రణ పనుల్లో భాగంగా కేవలం ప్రధాన రహదారుల ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడం మినహా దెబ్బతిన్న కండెన్సర్లు గుర్తించి తొలగించడం, ట్రాన్స్ఫార్మర్లలోని ఆయిల్ లీకేజీలను అరికట్టడం, లూజు కాంటాక్ట్‌లను సరిచేయడంవంటి పనులను విస్మరిస్తున్నారు. లైన్ల పునరుద్ధరణ అంటే కేవలం చెట్ల కొమ్మలు తొలగించడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన రహదారులు మినహా వీధుల్లోని లైన్స్ కింద ఉన్న చెట్లు కొమ్మలు తొలగించకపోవడంతో గాలివానకు కొమ్మలు తీగలు ఆనుకోవడంతో షార్ట్‌సర్క్యూట్స్ తలెత్తుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయానికి కారణమవుతున్నాయి. చేయని పనులకు బిల్లులు.. ఇటీవల కురిసిన చినుకులకు ఆస్మాన్ఘర్, సరూర్‌నగర్, చంపాపేట్, జూబ్లిహిల్స్, బంజా రాహిల్స్, గచ్చిబౌలి, హబ్సిగూడ, బోడుప్పల్, నాగోలు, చాంద్రాయణ గుట్ట, రాజేంద్రనగర్, వనస్థలిపురం, నల్లకుంట, రామంతాపూర్, గన్‌రాక్ డివిజన్లలో సుమారు 350 ఫీడర్లు ట్రిప్పు అయ్యాయి. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. లైన్ల కింద ఉన్న చెట్ల కొమ్మలు తొలగించకపోవడం, పాడైన కండెన్సర్లను పునరుద్ధరించక పోవడంతో షార్ట్‌సర్క్యూట్ తలెత్తి.. ఇళ్లల్లోని విలువైన గృహోపకరణాలు దగ్ధమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో లోపాన్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం డిస్కం వద్ద లేక పోవడంతో సిబ్బందే స్వయంగా లైన్ టు లైన్ తిరిగి సమస్యను గుర్తించాల్సి వస్తోంది. చెట్ల కొమ్మల నరికివేత పేరుతో ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటం లేదు. పాడైన కండెన్సర్లు, శిధిలావస్థకు చేరిన వైర్లు మార్చకున్నా.. మార్చినట్లు బిల్లు పెట్టి డిస్కం నుంచి డ్రా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు స్థానిక ఏఈలు, డీఈలు కాంట్రాక్టర్లకు సహకరిస్తుండటం విశేషం. లైన్ల పునరుద్ధరించడమంటే కేవలం చెట్ల కొమ్మలు నరకడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పునరుద్ధరణ పనులపై విచారణ జరిపించాలి నగరంలో విద్యుత్ పునరుద్ధరణ పనుల పేరుతో అధికారులు గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చాలా చోట్ల అసలు పనులే చేయడం లేదు. కానీ లైన్లను పునరుద్ధరించినట్లు బిల్లులు పెడుతున్నారు. స్థానిక డీఈ, ఏఈలే బినామీ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి చేయని పనులకు బిల్లులు పెడుతున్నారు. ఈ అంశంపై రాజేంద్రనగర్ డివిజన్లో ఇప్పటికే విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, వారికి సహ కరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. –నాగరాజు, విద్యుత్ కార్మిక సంఘం నాయకుడు -
జాఫర్‌గడ్‌లో దారుణం.. చెట్లపొదల్లో ఆడశిశువు
జాఫర్గడ్(వరంగడ్ జిల్లా): జాఫర్గడ్ మండలం తీగారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లో వదిలివెళ్లారు. గ్రామస్తుల సమచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆడశిశువును ఘన్పూర్ ఆసుపత్రి తరలించారు. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో శిశువును ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.