అడుగడుగున గుంతలు.. అడ్డంగా వచ్చే వాహనాలు.. ఎక్కడా అమలుకాని ట్రాఫిక్ నిబంధనలు.. మహబూబ్ నగర్ పట్టణంలో ఒక చోట నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే.
అడుగడుగున గుంతలు.. అడ్డంగా వచ్చే వాహనాలు.. ఎక్కడా అమలుకాని ట్రాఫిక్ నిబంధనలు.. మహబూబ్ నగర్ పట్టణంలో ఒక చోట నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. నిత్యం రద్దీగా ఉండే క్లాక్ టవర్ నుంచి పాత బస్తీ వరకు రాకపోకలకు పెద్ద సాహసమే చేయాలి.
ఈ ప్రాంతాల్లో చిన్నారులను, వృద్ధులను వెంట బెట్టుకొని రోడ్డు దాటడం కష్టంతో కూడుకున్న పని. ఏ క్షణమైనా ఆదమరిచినా ఏదొక వాహనం వచ్చి ఢీకొంటుంది. కలెక్టరేట్, పాన్ చౌరస్తా, న్యూటౌన్ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరు ఎటువైపు వెళ్తున్నారో అర్థం కాదు. ఇక సినిమా థియేటర్ల వద్ద పరిస్థితి అధ్వానం. ట్రాఫిక్ విషయమై నిత్యం ఇక్కడ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల ఇబ్బందులను గమనించి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.