అన్నదాత పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరవి.. అనే చందంగా మారింది. ఆరుగాలం కష్టించి పండించిన వేరుశనగకు మద్దతుధర లభించని దయనీయస్థితి నెలకొంది. ఆరుతడి పంటలను ప్రోత్సహించిన ప్రభుత్వం వేరుశనగకు కనీస మద్దతుధరను విస్మరించింది. గతంలో ఇచ్చిన హామీమేరకు ప్రభుత్వ రంగసంస్థల ద్వారా కొనుగోళ్లు చేపట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో నేడు(సోమవారం)పల్లీకి మద్దతుధర కల్పించే విషయమై రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ సొసైటీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోళ్ల విషయమై తుదినిర్ణయం తీసుకోనుంది.
సాక్షి, మహబూబ్‌నగర్: వేరుశనగ రైతు కు మద్దతుధర కల్పించే విషయాన్ని ప్ర భుత్వం విస్మరించింది. కాగా, ఇటీవల మద్దతుధర కల్పించాలని డిమాండ్‌చే స్తూ రైతులు మహబూబ్‌నగర్, నారాయణపేట్, జడ్చర్ల తదితర మార్కెట్ల లో ఆందోళన చేపట్టారు. చివరికి కలెక్టరేట్‌ను కూడా ముట్టడించారు. అయినప్పటికీ సర్కారుకు పల్లీరైతుపై ప్రేమచూపలేదు. జిల్లాలో రబీలో రైతులు 2,34,969 హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేయగా ఒక్క వేరుశనగనే 1,05,499 హెక్టార్లలో సాగుచేశారు.
మార్కెట్లలో గింజలధర పడిపోయింద నే నెపంతో వ్యాపారులు వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించకపోగా, ప్రభు త్వ ప్రకటించిన కనీస మద్దతుధరకు కూడా కొనుగోలు చేయలేకపోతున్నా రు. గతేడాది ఇదే సీజన్‌లోని ఫిబ్రవరి లో జిల్లా మార్కెట్లలో క్వింటాలుకు రూ.4500 నుంచి రూ.5500 వరకు ప లుకగా, ప్రస్తుతం రూ.2800 నుంచి రూ.3500కు మించడం లేదు. ఫలితం గా రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 18 వ్యవసాయ మార్కెట్లు ఉండగా, రైతులు సుమారు గా 3.76 లక్షల క్వింటాళ్ల వేరుశనగను విక్రయానికి తీసుకొస్తున్నారు. ఇందు లో 10వేల క్వింటాళ్లకు కూడా వ్యాపారులు ప్రభుత్వ మద్దతుధరకు కొనుగోలు చేయలేకపోతున్నారు.
ఫలితం గా రైతులు క్వింటాలుకు వెయ్యి రూపాయల చొప్పున ఇప్పటివరకు సుమారు రూ. నాలుగుకోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చింది. వేరుశనగ రైతును ఆదుకునేం దుకు సత్వరమే పది మార్కెట్లలో ప్రభుత్వరంగం సంస్థల ద్వారా మద్దతుధరతో వేరుశనగ కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీఇచ్చినా..జిల్లా ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తిచూడలేకపోయారు. పల్లీ గింజ ధర పడిపోవడం వల్లే ధర పడిపోయిందని మార్కెట్‌వర్గాలు పే ర్కొంటున్నాయి. గతేడాది పల్లి గింజలకు క్వింటాలుకు రూ.8వేల నుంచి రూ.8200 పలుకగా, ప్రస్తుతం ఆ ధర రూ.5వేల నుంచి రూ.5500కు పడిపోయింది. వేరుశనగకు ప్రత్యామ్నాయంగా పామాయిల్, సోయా, తదితర నూనెలు మార్కెట్‌లోకి రావడం వల్లే ధరలు పడిపోయాయని వ్యాపారులు సెలవిస్తున్నారు.
సర్కారుపైనే భారం!
పల్లి రైతును సర్కారు ఆదుకుంటే తప్ప న్యాయం జరగని పరిస్థితి నెలకొంది. ఖరీప్ సీజన్‌లో కూడా ప్రభుత్వరంగ సంస్థలు జిల్లాలో ఒక్క క్వింటాలు వేరుశనగ ఉత్పత్తులను కొనుగోలుచేయలేదు. అనంతపురం, కర్నూరు జిల్లాలో జనవరి 31 వరకు వేరుశనగను ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్ ప్ర భుత్వం ప్రకటించిన మద్దతుధరతో కొ నుగోలు చేసింది. మన జిల్లాపై ప్రభుత్వం వివక్షత చూపిందనే విషయం ఈ క్రయవిక్రయలను బట్టి తెలుస్తోంది. ఇ ప్పటికైనా ప్రభుత్వరంగ సంస్థలు రంగప్రవేశం చేసి రబీ వేరుశనగను కొనుగో లు చేయడం ద్వారా తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ నెల 6న హైదరాబాద్‌లో ప్రభుత్వరంగ సంస్థలచే వేరుశనగను ఖరీదు చేసే విషయంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. అదేవిధంగా ఈనెల 10న సోమవారం) మరోమారు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ సొసైటీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ సంస్థలచే కొనుగోళ్లు చేపట్టే విషయమై తుదినిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడైనా వేరుశనగ రైతుకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.
‘మద్దతు’ ఉత్తిదే!
Published Mon, Feb 10 2014 3:33 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement