సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అకాలవర్షం వణికించింది.. అన్న దాతలను కుదిపేసింది.. జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు మహా వృక్షాలు నేలకొరిగాయి. కూరగాయలు, మామిడితోటలు దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. వనపర్తి, కల్వకుర్తి, కొడంగల్, బిజినేపల్లి, ఆమనగల్లు మండలాల్లో వరి పంట దెబ్బతింది. ధన్వాడలోనూ వరికి పాక్షికంగా న ష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా 469.60 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఉద్యానవనశాఖ ఒకటో డివిజన్ పరిధిలో 233.60 హెక్టార్లలో మామిడి, కూరగాయల తోటలు వర్షార్పణమయ్యాయి.
కొడంగల్, కోస్గి, మద్దూరు, దౌల్తాబాద్ మండలాల్లో మామిడి కాయలు నేలరాలా యి. సుమారు రూ.1.10కోట్ల నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనావేశారు. ఉద్యానవనశాఖ రెండో డివిజన్ పరిధిలోని 11మండలాల్లో 138హెక్టార్ల మేర మామిడి రైతులు నష్టపోయారు. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో నష్టం తీ వ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. మక్తల్ మం డలం మాద్వార్‌లో శ్రీనివాస్‌రెడ్డి అనే రైతుకు చెందిన రెండు గేదెలు, ఆవు, దూడ పిడుగుపాటుకు మరణించాయి. కల్వకుర్తి మండలం తోటపల్లిలో నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
వరుసనష్టంతో కుదేలు
ఈనెల రెండోవారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మూడురోజుల పాటు వర్షం కురిసింది. అకాలవర్షాలతో 1334.40 హెక్టార్ల మేర పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు. అకాలవర్షాలు, వడగళ్లతో ఆస్తి, ప్రాణనష్టంతో పాటు పంటలు దెబ్బతింటున్నా అధికారులు నివేదికలతో సరిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
వణికించిన వర్షం
Published Sat, Apr 25 2015 1:43 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement