కలెక్టరేట్‌లో మాజీ సైనికోద్యోగి ఆత్మహత్యాయత్నం | Ex Service man attempts suicide in Mahabubnagar Collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో మాజీ సైనికోద్యోగి ఆత్మహత్యాయత్నం

Published Mon, Aug 3 2015 4:07 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Ex Service man attempts suicide in  Mahabubnagar Collectorate

కలెక్టరేట్ (మహబూబ్‌నగర్ జిల్లా) : ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలం వివాదం పదేళ్లుగా పరిష్కారం కాకపోవడంతో మనస్తాపం చెందిన మాజీ సైనికోద్యోగి ఒకరు కలెక్టరేట్‌లో పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్న అబ్రహాం(65) అనే మాజీ సైనికోద్యోగి గ్రీవెన్స్ డేలో పాల్గొన్నాడు.

షాద్‌నగర్ మండలం కందిమల్ల గ్రామంలో తనకు కేటాయించిన స్థలాన్ని ఆ గ్రామస్తులు పదేళ్లుగా అడ్డుకుంటున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. పదేళ్లుగా పోరాటం చేస్తున్నా తనకు న్యాయం జరగకపోవడంతో కలెక్టరేట్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఆయన్ని 108లో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement