రుణమాఫీ పథకానికి సిద్ధంచేసిన ‘ఈ’జాబితాను గురువారం మధ్యాహ్నం లోగా అన్ని మండలాల తహశీల్దార్లు సమర్పించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని జిల్లా అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ జీడీ ప్రియదర్శిని
మహబూబ్‌నగర్ టౌన్: రుణమాఫీ పథకానికి సిద్ధంచేసిన ‘ఈ’జాబితాను గురువారం మధ్యాహ్నం లోగా అన్ని మండలాల తహశీల్దార్లు సమర్పించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. రుణమాఫీ పథకంపై ఇదివర కే రెండుసార్లు గడువు విధించినా సిద్ధం చేయకపోవడంపై అసహనం వ్యక్తంచేశా రు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, సకాలంలో అందరి సంతకాలతో కూడిన జాబితాను సమర్పించాలని సూచిం చా రు. లేనిపక్షంలో సంబంధిత అధికారుల పై కఠినచర్యలు తప్పవని హెచ్చరించా రు. ఇన్నాళ్లూ బ్యాంకర్లపై మీరు మీపై బ్యాంకర్లు సాకులు చూపుతూ కాలయాప న చేశారని, ఇకపై సాకులు చెప్పేందుకు ఎలాంటి అవకాశం లేదన్నారు. సిద్ధంచేసిన జాబితాను ‘డి’ సెక్షన్ తహశీల్దార్ సువర్ణరాజుకు సమర్పించాలన్నారు.
బినామీలపై ప్రత్యేక నిఘా
సోషల్ ఆడిట్ ప్రారంభంలో వేలలో ఉన్న బినామీలు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోతున్నారని, ఈ విషయంలో తాను ప్రత్యేకనిఘా ఉంచినట్లు వెల్లడించారు. ఏ మండలానికైనా వచ్చి తనిఖీ చేసిన సమయంలో బినామీలు బయటపడితే సం బంధిత అధికారులపై చర్యలు తీసుకుం టానని హెచ్చరించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పథకాన్ని వర్తింపజేసేందుకు కృషిచేయాలని కోరారు. ఎంపికచేసిన జాబితా పారదర్శకంగా ఉండాలని, తప్పులు చేస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ డాక్టర్ రాజారాం, డీఆర్వో రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.