debit weaver
-
ఎకానమీకి మరింత జోష్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద మరిన్ని చర్యలు ప్రకటించారు. నిర్దిష్ట గృహ విక్రయ లావాదేవీలపై పన్నుపరమైన ప్రయోజనాలు, మరికొన్ని రంగాలకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీకి అదనంగా కేటాయింపులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) నిర్మలా సీతారామన్ తెలిపారు. పటిష్టంగా రికవరీ... దీర్ఘకాలం లాక్డౌన్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన రికవరీ నమోదు చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉత్పత్తి గణాంకాల మెరుగుదలతో పాటు, అక్టోబర్‌లో ఇంధన వినియోగ వృద్ధి 12 శాతం పెరిగిందని.. వస్తు, సేవల పన్నుల వసూళ్లు 10 శాతం వృద్ధి చెంది రూ. 1.05 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన.. కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ప్రావిడెంట్ ఫండ్పరమైన సబ్సిడీని ఇవ్వడం ద్వారా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన ఆవిష్కరించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో నమోదై, కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం రెండేళ్ల పాటు పీఎఫ్ చందాలో ఉద్యోగి వాటా (జీతంలో 12 శాతం), సంస్థ వాటా (జీతంలో 12 శాతం) కలిపి మొత్తం 24 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఈపీఎఫ్‌వోలో నమోదైన సంస్థలో, రూ. 15,000 లోపు నెలవారీ జీతంపై చేరే కొత్త ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే రూ. 15,000 కన్నా తక్కువ వేతనమున్న ఈపీఎఫ్ సభ్యులు, కరోనా వైరస్ పరిణామాలతో మార్చి 1వ తేదీ తర్వాత ఉద్యోగం కోల్పోయి, అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలోకి చేరినా.. వారికి కూడా ఈ పథ కం వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2021 జూన్ 30 దాకా ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈ స్కీమును ఉపయోగించుకోదల్చుకున్న పక్షంలో.. 50 మంది దాకా ఉద్యోగులు ఉన్న సంస ్థలు కొత్తగా కనీసం ఇద్దరు ఉద్యోగులకు, 50 మంది కి పైగా సిబ్బంది ఉన్న సంస్థలు కనీసం అయిదు మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. ఈసీఎల్జీఎస్ మార్చి దాకా పొడిగింపు... వచ్చే ఏడాది మార్చి 31 దాకా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను కేంద్రం పొడిగించింది. చిన్న, లఘు సంస్థలకు ఈ పథకం కింద తనఖా లేని రుణాలు లభిస్తాయి. కామత్ కమిటీ గుర్తించిన 26 రంగాలతో పాటు హెల్త్‌కేర్ రంగానికి కూడా ఈ స్కీమ్ వర్తింపచేయనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ కంపెనీలకు రుణాలపై ఏడాది మారటోరియంతో పాటు చెల్లింపునకు నాలుగేళ్ల వ్యవధి లభిస్తుందని వివరించారు. రియల్టీకి తోడ్పాటు... గృహ కొనుగోలుదారులు, డెవలపర్లకు ఆదాయ పన్నుపరమైన ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ. 2 కోట్ల దాకా విలువ చేసే కొత్త గృహాలను స్టాంప్ డ్యూటీ సర్కిల్ రేటు కన్నా 20 శాతం తక్కువకు విక్రయించేందుకు అనుమతించేలా ఆదాయ పన్ను చట్టాన్ని సవరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 10 శాతం దాకా మాత్రమే ఉంది. అమ్ముడుపోకుండా పేరుకుపోయిన గృహాల విక్రయానికి ఊతమివ్వడంతో పాటు కొనుగోలుదారులు, డెవలపర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ప్రస్తుతం ఐటీ చట్టంలోని సెక్ష¯Œ 43సీఏ ప్రకారం.. సర్కిల్ రేటు కన్నా ఒప్పంద విలువ 10 శాతానికి మించి తగ్గిన పక్షంలో పన్నుపరమైన జరిమానాలు ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీనివల్ల నిల్వలు పేరుకుపోతున్నా.. బిల్డర్లు రేట్లు తగ్గించే పరిస్థితి లేదని వివరించాయి. ఈ నిబంధన సడలించడమనేది.. రేట్లు తగ్గించేందుకు, విక్రయాలు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. రూ. 65వేల కోట్ల ఎరువుల సబ్సిడీ .. ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఎరువుల సబ్సిడీ కోసం రూ. 65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు. పంట సీజ¯Œ లో రైతులకు సరైన సమయంలో, తగినంత స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది రైతాంగానికి గణనీయంగా తోడ్పడగలదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. ఎరువుల వినియోగం 2016–17లో 499 లక్షల టన్నులుగా ఉండగా 2020–21లో 673 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. మరిన్ని చర్యలు.. ► పట్టణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు. ► కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత మరికాస్త మెరుగ్గా ఉండే విధంగా ప్రాజెక్టులకు కట్టాల్సిన ముందస్తు డిపాజిట్ పరిమాణం తగ్గింపు. 2021 డిసెంబర్ 31 దాకా వర్తింపు. ► కోవిడ్–19 టీకాపై పరిశోధనలకు బయోటెక్నాలజీ విభాగానికి రూ. 900 కోట్ల గ్రాంటు. ► గ్రామీణ ఉపాధికి రూ.10,000 కోట్లు. ► మరింతగా రుణ వితరణకు తోడ్పడేలా ఎగ్జిమ్ బ్యాంక్‌కు రూ. 3,000 కోట్లు. ► డిఫెన్స్, ఇన్ఫ్రా కోసం బడ్జెట్ కేటాయింపులకు మించి రూ. 10,200 కోట్లు. -
వారికే ఖజానా తాళాలు
చరమా(ఛత్తీస్‌గఢ్): ‘నాలుగేళ్లలో ప్రధాని మోదీ తనకు సన్నిహితులైన 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు ఏడాదికి అయ్యే వ్యయానికి ఈ మొత్తం సుమారు 10 రెట్లు. మోదీ ఆ 15 మందికే దేశ ఖజానా తాళాలు అప్పగించారు. కానీ కాంగ్రెస్.. రైతులు, యువత, పేదలు, మహిళలు, గిరిజనులకు ఆ తాళాలు ఇవ్వాలనుకుంటోంది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ శనివారం ప్రధాని మోదీ, ఛత్తీస్ సీఎం రమణ్‌సింగ్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. చిట్‌ఫండ్, పౌరసరఫరా కుంభకోణాల్లో రమణ్‌సింగ్‌కు పాత్ర ఉందని, పనామా పత్రాల్లో రమణ్‌సింగ్ కొడుకు అభిషేక్ సింగ్ పేరు ఉన్నా, ఆయనకు ఎలాంటి శిక్ష పడలేదని అన్నారు. చేష్టలుడిగిన రమణ్‌సింగ్.. చరామాలో జరిగిన ర్యాలీలోనూ రాహుల్ మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ చిట్‌ఫండ్ కుంభకోణంలో రూ.5 వేల కోట్లు అదృశ్యమయ్యాయని, సుమారు 60 మంది మరణించగా, 310 కేసులు నమోదయ్యాయని అన్నారు. అయినా ఎవరికీ శిక్షలు పడలేదని, ఈ వ్యవహారంలో చర్యలు తీసుకునేందుకు రమణ్‌సింగ్ వెనకడుగు వేశారని ధ్వజమెత్తారు. ఇక పౌర సరఫరా కుంభకోణంలో రూ.36 వేల కోట్లను దోచుకున్నారని, ఇందులో రమణ్‌సింగ్ పాత్రను తేటతెల్లంచేసే పత్రాలు లభ్యమయ్యాయని అన్నారు. రమణ్‌సింగ్ 15 ఏళ్ల పాలనలో 40 లక్షల మంది యువత నిరుద్యోగులుగానే మిగిలారని, 65 శాతం భూభాగానికి సాగునీరు లేదని, గిరిజనుల నుంచి 56 వేల ఎకరాల భూమిని లాక్కుని సీఎం స్నేహితులకు కట్టబెట్టారని ఆరోపించారు. స్థానికులు నిరు ద్యోగులుగా మిగలడానికి కారణమైన ఔట్సోర్సింగ్ విధానానికి స్వస్తి పలుకుతామన్నారు. స్నేహమే అర్హతా?..: ప్రధాని మోదీకి స్నేహితుడు అయినందుకే అనిల్ అంబానీ రఫేల్ ఒప్పందాన్ని దక్కించుకున్నారని రాహుల్ ఆరోపించారు. దేశానికి కాపలాదారుడిగా చెప్పుకునే మోదీ..తన స్నేహితుడికి లబ్ధిచేకూర్చడానికే యూపీఏలో కుదిరిన ఒప్పందంలో మార్పులు చేశారన్నారు. ఒక్కో విమానానికి రూ.526 కోట్ల చొప్పున మొత్తం 126 విమానాల్ని కొనడానికి యూపీఏ హయాంలో ఒప్పందం కుదిరితే, ఒక్కో విమానానికి రూ.1600 కోట్లు చెల్లించడానికి ఎన్డీయే అంగీకరించిందని ఆరోపించారు. ‘తొలి’ ప్రచారం సమాప్తం రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు శనివారం సాయంత్రం 3 గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 8 జిల్లాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 12వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సహా మొత్తం 190 మంది అభ్యర్థులు మొదటి విడత ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండగా జనతా కాంగ్రెస్(జే), బీఎస్పీ, సీపీఐల కూటమి కూడా ఈసారి తలపడుతోంది. మొత్తం 31,79,520 మంది ఓటర్ల కోసం 4,336 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రజలకు మావోలు పిలుపివ్వడంతో భద్రత ఏర్పాట్లు పెంచారు.కొండ ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లకు సిబ్బందిని, సామగ్రిని చేరవేసేందుకు హెలికాప్టర్లను వినియోగి స్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 72 నియోజకవర్గాలకు 20న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్‌తో ప్రజలకు వినోదం రాయ్‌పూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంతో ప్రజలకు వినోదం పంచారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఎద్దేవా చేశారు. తమ రాష్ట్రం గురించి ఆయనకు ఏమీ తెలియదని దెప్పిపొడిచారు. ‘ఛత్తీస్‌గఢ్ గురించి రాహుల్‌కు ఏమీ తెలియదు. ఆయన విమర్శలను రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రచార కార్యక్రమాలతో ప్రజలకు రాహుల్ కేవలం వినోదం పంచారు’ అని రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో రాహుల్ ప్రచారం బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయలేకపోగా ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌కే హాని కలిగించేలా ఉన్నాయి’ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారీ మిత్రులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న రాహుల్ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ఇలాంటివి కాంగ్రెస్ హయాం లో జరిగాయని తిప్పికొట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోల ప్రభావాన్ని దాదాపు లేకుండా చేశారంటూ సీఎంపై బీజేపీ చీఫ్ బీజేపీ అమిత్‌షా ప్రశంసల వర్షం కురిపించారు. -
రుణమాఫీ అర్హుల జాబితా సమర్పించాలి
కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మహబూబ్‌నగర్ టౌన్: రుణమాఫీ పథకానికి సిద్ధంచేసిన ‘ఈ’జాబితాను గురువారం మధ్యాహ్నం లోగా అన్ని మండలాల తహశీల్దార్లు సమర్పించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. రుణమాఫీ పథకంపై ఇదివర కే రెండుసార్లు గడువు విధించినా సిద్ధం చేయకపోవడంపై అసహనం వ్యక్తంచేశా రు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, సకాలంలో అందరి సంతకాలతో కూడిన జాబితాను సమర్పించాలని సూచిం చా రు. లేనిపక్షంలో సంబంధిత అధికారుల పై కఠినచర్యలు తప్పవని హెచ్చరించా రు. ఇన్నాళ్లూ బ్యాంకర్లపై మీరు మీపై బ్యాంకర్లు సాకులు చూపుతూ కాలయాప న చేశారని, ఇకపై సాకులు చెప్పేందుకు ఎలాంటి అవకాశం లేదన్నారు. సిద్ధంచేసిన జాబితాను ‘డి’ సెక్షన్ తహశీల్దార్ సువర్ణరాజుకు సమర్పించాలన్నారు. బినామీలపై ప్రత్యేక నిఘా సోషల్ ఆడిట్ ప్రారంభంలో వేలలో ఉన్న బినామీలు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోతున్నారని, ఈ విషయంలో తాను ప్రత్యేకనిఘా ఉంచినట్లు వెల్లడించారు. ఏ మండలానికైనా వచ్చి తనిఖీ చేసిన సమయంలో బినామీలు బయటపడితే సం బంధిత అధికారులపై చర్యలు తీసుకుం టానని హెచ్చరించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పథకాన్ని వర్తింపజేసేందుకు కృషిచేయాలని కోరారు. ఎంపికచేసిన జాబితా పారదర్శకంగా ఉండాలని, తప్పులు చేస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ డాక్టర్ రాజారాం, డీఆర్వో రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
అనైతికం
అటవీ గోడౌన్లలో ఎర్రచందనం నిల్వలు అపారంగా ఉన్నాయి. వాటిని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయిస్తాం. తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతాం. రుణమాఫీ వంటి హామీలను నెరవేర్చేందుకు ఈ సొమ్ము ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. సాక్షి ప్రతినిధి, కడప: ఎర్రచందనం అరుదైన ప్రకృతి సంపద. అది రాయలసీమకే సొంతం. ప్రపంచ దేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు అడ్డంగా అడవులను నాశనం చేస్తున్నారు. 90 శాతం అక్రమ రవాణా అవుతుండగా కేవలం 10శాతం మాత్రమే పట్టుబడుతోంది. అలా పట్టుబడిన ఎర్రచందనం సుమారు 9వేల టన్నులు అటవీ గోడౌన్లలో మగ్గుతోంది. దానిని విక్రయించి రుణమాఫీ చేస్తామని ఓమారు, రాజధాని నిర్మాణానికి ఉపయోగిస్తామని మరోమారు రాష్ట్ర మంత్రులు ఒకరి తర్వాత మరొకరు ప్రకటనలు గుప్పిస్తున్నారు. అమాత్యుల తీరు చూస్తుంటే సొమ్మొకరిది.., సోకొకరిది అన్నట్లుగా ఉందని రాయలసీమ వాసులు నిలదీస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం విశేష కృషి చేపట్టాల్సిన పాలక పక్షం అలాంటి ఆలోచన చేయడం లేదని మదనపడుతున్నారు. ఎర్రచందనం విక్రయం ద్వారా లభించే ఆదాయాన్ని ఆ ప్రకృతి సంపద లభ్యమయ్యే ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏడు ఫారెస్టు డివిజన్లలోనే .. ప్రకృతి సంపద అయిన ఎర్రచందనం వైఎస్సార్, చిత్తూరు, కర్నూల్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే లభ్యమవుతోంది. కడప, రాజంపేట, ప్రొద్దుటూరు, తిరుపతి, చిత్తూరు ఈస్ట్, నంద్యాల, గిద్దలూరు, నెల్లూరు ఫారెస్టు డివిజన్లలోనే ఎర్రచందనం అక్రమనిల్వలు ఉన్నాయి. ప్రధానంగా వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం అపారంగా ఉంది. ఇక్కడి నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అటవీ చెక్‌పోస్టులు, పోలీసులు ద్వారా పట్టుబడిన ఎర్రచందనం 8,870 టన్నుల నిల్వలు ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. విదేశాలకు ఎగుమతి చేసే సందర్భాలలో పోర్టులు వ ద్ద డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ (డీఆర్ఐ) దాడులు చేసినప్పుడు స్వాధీనం చేసుకున్న చందనం వేల టన్నుల్లో ఉన్నట్లు సమాచారం. ఎర్రచందనం ఎక్కడ పట్టుబడ్డా విక్రయాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలని 2011లో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం నిల్వలను విక్రయించి తాను ఇచ్చిన ఎన్నికల హామీల కోసం వెచ్చించాలని చంద్రబాబు నాయుడు భావిస్తుండటాన్ని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజానీకం ఆక్షేపణ వ్యక్తం చేస్తోంది. ఎర్రచందనం ద్వారా లభించే రూ.1000 కోట్లు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలనే డిమాండ్ ఊపుందుకుంటోంది. సాగునీటి పనులుకు, భూగర్భజలాలు పెంపొందించే కార్యక్రమాలకు ఈ సొమ్మును వినియోగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సీమలోనే ఖర్చు చేయాలి... ఎర్రచందనం విక్రయం ద్వారా లభించే ఆదాయం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనే ఖర్చు చేయాలి. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులకు వినియోగించాలి. ఈప్రాంతం ప్రజల హక్కు అది. ఎర్రచందనాన్ని ఆదాయ వనరుగా చూడడమే పెద్ద తప్పు. హామీల అమలు కోసం ఎర్రచందనం సొమ్మును వినియోగించుకోవాలనుకోవడం తీవ్ర ఆక్షేపణీయం. - దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి, తుంగభద్ర జలాల సాధన కమిటీ నాయకుడు, చెరువుల పునః నిర్మాణం కోసం వెచ్చించాలి.... ఎర్రచందనం విక్రయం ద్వారా లభించే ఆదాయాన్ని రాయలసీమలో చెరువులను పునః నిర్మించేందుకు ఉపయోగించాలి.ఇప్పటికే రాయలసీమ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉంది. ఇక్కడి సంపద ద్వారా వచ్చే డబ్బును వేరెక్కడో ఖర్చు చేస్తామనడం ఎంతమాత్రం భావ్యం కాదు. - బొజ్జా దశరథరామిరెడ్డి, రాయలసీమ ఐక్యకారాచరణ కార్యదర్శి నంద్యాల.