వినాయక్‌చౌక్‌లో నిర్మించిన క్లాక్ టవర్
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణలో భాగంగా స్థానిక వినాయక్‌చౌక్‌లోని క్లాక్‌టవర్ ని ర్మాణం రాజకీయ దుమారానికి కారణమవుతుంది. ఈ టవర్ కూల్చివేయాలంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటీవల మున్సిపల్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే బీఆర్‌ఎస్ కౌన్సి లర్లు ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తుండటం రాజకీయ వేడి రాజేస్తోంది. ఈ క్రమంలో బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
రూ.కోటి వ్యయంతో నిర్మాణం..
పట్టణ ప్రగతి నిధులు రూ.కోటి వ్యయంతో వినా యక్‌చౌక్ సుందరీకరణలో భాగంగా 40 అడుగుల ఎత్తులో క్లాక్ టవర్ నిర్మించారు. చుట్టూరా గోడలను అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్ (ఏసీపీ క్లాడింగ్)తో చేపట్టారు.
టవర్ గోడలకు వినాయకుడి ప్రతిమలతో పైభాగాన గ్లోబు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఏటా అట్టహాసంగా నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఈ చౌక్‌లోని శిశు మందిర్ నుంచే చేపట్టడంతో ఆరు రోడ్లతో కూడిన ఇక్కడి కూడలి వినాయక్ చౌక్‌గా ప్రసిద్ధి చెందింది.
అయితే ఈ చౌక్‌లో వినాయకుడి విగ్రహాన్నే ఏర్పా టు చేయాలంటూ టవర్ నిర్మాణ సమయంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆందోళనలు చేపట్టారు. అందుకు అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న స్పందిస్తూ వినాయకుడి విగ్రహాంతో పాటు వినాయక్‌చౌక్‌గానే కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కూల్చివేతకు ఎమ్మెల్యే ఆదేశం
ఈ టవర్ నిర్మాణంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, నిర్మాణం కూడా ప్రణాళికాబద్ధంగా చేపట్టలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటీవల బల్దియా అధికారులతో నిర్వహించిన సమీక్షలో అభిప్రాయపడ్డారు. తక్షణమే కూల్చివేయాలని, నిబంధనలు అడ్డంకిగా ఉంటే ప్రభుత్వానికి రాయాలని మున్సి పల్ అధికారులను ఆదేశించారు.
అయితే బల్దియా కౌన్సిల్ ఆమోదంతోనే చేపట్టిన టవర్‌ను కూల్చివేయడమేంటని, ఎమ్మెల్యే వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తప్పుపడుతున్నారు. రాజకీయాల కోసం టవర్ కూల్చివేత సరికాదంటున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల భిన్నమైన వ్యాఖ్యలతో ఏం చేయాలో తెలియక బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కూల్చివేత సాధ్యమేనా...
ఎమ్మెల్యే ఆదేశాలకనుగుణంగా టవర్ నిర్మాణాన్ని కూల్చివేయడం సాధ్యపడుతుందా అనే ప్రశ్నలు త లెత్తుతున్నాయి. ఎందుకంటే నిర్మాణ సమయంలో పలు శాఖల అధికారులతో కూడిన ఓ కమిటీ స్థలాన్ని పరిశీలించి నివేదిక అందజేసింది. తదనుగుణంగా కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారుల అనుమతులు సైతం తీసుకున్నారు. అనంతరమే బల్దియా కౌన్సిల్ తీర్మానంతో టవర్ నిర్మాణం చేపట్టారు.
ఇంతటి ప్రక్రియతో చేపట్టిన క్లాక్ టవర్ కూల్చివేత అసలు సాధ్యపడుతుందా సందేహాం తలెత్తుతుంది. ఇప్పటికిప్పుడు దాన్ని కూల్చివేయాలంటే రూ.10లక్షలు అవసరమవుతాయని, మరో కొత్త నిర్మాణం చేపట్టా లన్నా రూ.20లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని బల్ది యా అధికారులు చెబుతుండడం గమనార్హం.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు
ఇటీవల జరిగిన సమావేశంలో క్లాక్ టవర్‌ను కూల్చివేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కౌన్సిల్ తీర్మానంతో ఉన్నతాధికారుల అనుమతితో నిర్మించిన ఈ టవర్ కూల్చివేత సాధ్యపడదు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దానిపై తదుపరి చర్యలు తీసుకుంటాం. – అరుణ్‌కుమార్, ఏఈ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment