ganesh chowk
-
క్లాక్ టవర్‌ను కూల్చేయాలని ఎమ్మెల్యే ఆదేశం.. తల పట్టుకున్న అధికారులు!
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణలో భాగంగా స్థానిక వినాయక్‌చౌక్‌లోని క్లాక్‌టవర్ ని ర్మాణం రాజకీయ దుమారానికి కారణమవుతుంది. ఈ టవర్ కూల్చివేయాలంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటీవల మున్సిపల్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ కౌన్సి లర్లు ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తుండటం రాజకీయ వేడి రాజేస్తోంది. ఈ క్రమంలో బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రూ.కోటి వ్యయంతో నిర్మాణం.. పట్టణ ప్రగతి నిధులు రూ.కోటి వ్యయంతో వినా యక్చౌక్ సుందరీకరణలో భాగంగా 40 అడుగుల ఎత్తులో క్లాక్ టవర్ నిర్మించారు. చుట్టూరా గోడలను అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్ (ఏసీపీ క్లాడింగ్)తో చేపట్టారు. టవర్ గోడలకు వినాయకుడి ప్రతిమలతో పైభాగాన గ్లోబు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఏటా అట్టహాసంగా నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఈ చౌక్‌లోని శిశు మందిర్ నుంచే చేపట్టడంతో ఆరు రోడ్లతో కూడిన ఇక్కడి కూడలి వినాయక్ చౌక్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ చౌక్‌లో వినాయకుడి విగ్రహాన్నే ఏర్పా టు చేయాలంటూ టవర్ నిర్మాణ సమయంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆందోళనలు చేపట్టారు. అందుకు అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న స్పందిస్తూ వినాయకుడి విగ్రహాంతో పాటు వినాయక్చౌక్గానే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కూల్చివేతకు ఎమ్మెల్యే ఆదేశం ఈ టవర్ నిర్మాణంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, నిర్మాణం కూడా ప్రణాళికాబద్ధంగా చేపట్టలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటీవల బల్దియా అధికారులతో నిర్వహించిన సమీక్షలో అభిప్రాయపడ్డారు. తక్షణమే కూల్చివేయాలని, నిబంధనలు అడ్డంకిగా ఉంటే ప్రభుత్వానికి రాయాలని మున్సి పల్ అధికారులను ఆదేశించారు. అయితే బల్దియా కౌన్సిల్ ఆమోదంతోనే చేపట్టిన టవర్‌ను కూల్చివేయడమేంటని, ఎమ్మెల్యే వ్యాఖ్యలను బీఆర్ఎస్ కౌన్సిలర్లు తప్పుపడుతున్నారు. రాజకీయాల కోసం టవర్ కూల్చివేత సరికాదంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ల భిన్నమైన వ్యాఖ్యలతో ఏం చేయాలో తెలియక బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కూల్చివేత సాధ్యమేనా... ఎమ్మెల్యే ఆదేశాలకనుగుణంగా టవర్ నిర్మాణాన్ని కూల్చివేయడం సాధ్యపడుతుందా అనే ప్రశ్నలు త లెత్తుతున్నాయి. ఎందుకంటే నిర్మాణ సమయంలో పలు శాఖల అధికారులతో కూడిన ఓ కమిటీ స్థలాన్ని పరిశీలించి నివేదిక అందజేసింది. తదనుగుణంగా కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారుల అనుమతులు సైతం తీసుకున్నారు. అనంతరమే బల్దియా కౌన్సిల్ తీర్మానంతో టవర్ నిర్మాణం చేపట్టారు. ఇంతటి ప్రక్రియతో చేపట్టిన క్లాక్ టవర్ కూల్చివేత అసలు సాధ్యపడుతుందా సందేహాం తలెత్తుతుంది. ఇప్పటికిప్పుడు దాన్ని కూల్చివేయాలంటే రూ.10లక్షలు అవసరమవుతాయని, మరో కొత్త నిర్మాణం చేపట్టా లన్నా రూ.20లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని బల్ది యా అధికారులు చెబుతుండడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఇటీవల జరిగిన సమావేశంలో క్లాక్ టవర్‌ను కూల్చివేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కౌన్సిల్ తీర్మానంతో ఉన్నతాధికారుల అనుమతితో నిర్మించిన ఈ టవర్ కూల్చివేత సాధ్యపడదు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దానిపై తదుపరి చర్యలు తీసుకుంటాం. – అరుణ్‌కుమార్, ఏఈ, ఆదిలాబాద్ -
వీధి దీపం.. నిడదవోలుకు శాపం
నిడదవోలు, న్యూస్‌లైన్ : నిడదవోలు వీధుల్లో వెలుగులు నింపేందుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయూరైంది. నాజూకైన పెద్ద స్తంభాలు.. వాటికి అమర్చిన బల్బులు అలంకారప్రాయంగా మారారుు. మునిసిపల్ యంత్రాంగం వీటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేయడంతో పట్టణంలో ఏ వైపు చూసినా చీకటి రాజ్యమేలుతోంది. గణపతి సెంటర్, గణేష్ చౌక్, వీధి దీపం.. నిడదవోలుకు శాపం ఓవర్ బ్రిడ్జి, రైల్వేస్టేషన్, సంత మార్కెట్, గాంధీ బొమ్మ, బస్టాండ్, రైల్వే గేటు, పాత మునిసిపల్ కార్యాలయం సెంటర్లలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కూడలి ప్రాంతాల్లోని స్తంభాలకు నాలుగేసి లైట్లు, మిగిలినచోట్ల ఉన్న స్తంభాలకు రెండేసి చొప్పున 94 లైట్లు వేశారు. గణేష్ చౌక్లోలో ఏడాది కాలంగా లైట్లు వెల గడం లేదు. ఈ సెంటర్ వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. లైట్లు పనిచేయకపోవడంతో రాత్రివేళ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారుు. ఈ సెంటర్ మీదుగా రాజ మండ్రి, నరసాపురం, తణుకు, పంగిడి ప్రాం తాల నుంచి వాహనాలు వస్తూపోతుంటారుు. లైటింగ్ లేకపోవడం వల్ల వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. ఓవర్ బ్రిడ్జి సెంటర్లో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్‌లో ఒక్క దీపం మాత్రమే వెలుగుతోంది. గాంధీ బొమ్మ సెంట ర్లో ఒక్క లైటు కూడా వెలగటం లేదు. రైల్వేస్టేషన్ సెంటర్లో మాత్రం ఒకే ఒక దీపం మిణుకు మిణుకుమంటుండగా, మిగిలినవి పనిచేయడం లేదు. సంత మార్కెట్ సెంటర్లోనూ ఇదే పరిస్థితి. మిగిలిన చోట్ల కూడా ఒకటి, రెండు దీపాలు మినహా వెలగడం లేదు. దీంతో దొంగల భయం అధికమవుతోంది. ఓవర్ బ్రిడ్జి, బస్టాండ్ సెంటర్లలో చీకట్లు కమ్ముకోవడంతో చీకటి కార్యకలాపాలు అధికమవుతున్నారుు.