నిడదవోలు, న్యూస్‌లైన్ : నిడదవోలు వీధుల్లో వెలుగులు నింపేందుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయూరైంది. నాజూకైన పెద్ద స్తంభాలు.. వాటికి అమర్చిన బల్బులు అలంకారప్రాయంగా మారారుు. మునిసిపల్ యంత్రాంగం వీటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేయడంతో పట్టణంలో ఏ వైపు చూసినా చీకటి రాజ్యమేలుతోంది.
గణపతి సెంటర్, గణేష్ చౌక్, వీధి దీపం.. నిడదవోలుకు శాపం ఓవర్ బ్రిడ్జి, రైల్వేస్టేషన్, సంత మార్కెట్, గాంధీ బొమ్మ, బస్టాండ్, రైల్వే గేటు, పాత మునిసిపల్ కార్యాలయం సెంటర్లలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కూడలి ప్రాంతాల్లోని స్తంభాలకు నాలుగేసి లైట్లు, మిగిలినచోట్ల ఉన్న స్తంభాలకు రెండేసి చొప్పున 94 లైట్లు వేశారు. గణేష్ చౌక్‌లోలో ఏడాది కాలంగా లైట్లు వెల గడం లేదు. ఈ సెంటర్ వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. లైట్లు పనిచేయకపోవడంతో రాత్రివేళ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారుు.
ఈ సెంటర్ మీదుగా రాజ మండ్రి, నరసాపురం, తణుకు, పంగిడి ప్రాం తాల నుంచి వాహనాలు వస్తూపోతుంటారుు. లైటింగ్ లేకపోవడం వల్ల వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. ఓవర్ బ్రిడ్జి సెంటర్‌లో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్‌లో ఒక్క దీపం మాత్రమే వెలుగుతోంది. గాంధీ బొమ్మ సెంట ర్‌లో ఒక్క లైటు కూడా వెలగటం లేదు. రైల్వేస్టేషన్ సెంటర్‌లో మాత్రం ఒకే ఒక దీపం మిణుకు మిణుకుమంటుండగా, మిగిలినవి పనిచేయడం లేదు.
సంత మార్కెట్ సెంటర్‌లోనూ ఇదే పరిస్థితి. మిగిలిన చోట్ల కూడా ఒకటి, రెండు దీపాలు మినహా వెలగడం లేదు. దీంతో దొంగల భయం అధికమవుతోంది. ఓవర్ బ్రిడ్జి, బస్టాండ్ సెంటర్లలో చీకట్లు కమ్ముకోవడంతో చీకటి కార్యకలాపాలు అధికమవుతున్నారుు.
వీధి దీపం.. నిడదవోలుకు శాపం
Published Sat, Jan 18 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement