nidadavole
-
నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్
అమెరికాలో తెలుగు వారికి పలుసార్లు అండగా నిలిచిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నిడదవోలు మండలం రావిమెట్లలో హృదయాలయం మానసిక దివ్యాంగుల పాఠశాలకు నాట్స్ తన వంతు చేయూత అందించింది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ఈ పాఠశాలను సందర్శించారు. మానసిక దివ్యాంగుల చదువుకు వినియోగించే మెటీరియల్ కోసం 50 వేల రూపాయలను నాట్స్ అందించింది. హోప్ ఫర్ స్పందన సహకారంతో గత కొంత కాలంగా నాట్స్ మానసిక దివ్యాంగులకు చేయూత అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. సమాజంలో మానసిక దివ్యాంగులకు మానవత్వంతో ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన బాధ్యత ఉందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి అన్నారు. నాట్స్ మానసిక దివ్యాంగులకు అండగా నిలిచేందుకు తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. దివ్యాంగుల కోసం నాట్స్‌తో కలిసి పనిచేస్తున్న హోఫ్ ఫర్ స్పందనకు నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తి మృతి..వాటర్ ట్యాంక్‌ని క్లీన్ చేస్తుండగా..) -
సీఎం వైఎస్ జగన్ సభకు తరలివచ్చిన జనసంద్రం
-
నిడదవోలులో వివాహ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్
-
నిడదవోలు: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
నిడదవోలు(తూ.గో. జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పర్యటనకు బయల్దేరివెళ్లిన సీఎం జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి నిడదవోలుకు బయల్దేరి వెళ్లిన సీఎం జగన్‌కు సుబ్బరాజుపేట హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ సుదీర్ కుమార్‌లు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గం.లకు వివాహ రిసెప్షన్ వేదికకు చేరుకున్న సీఎం జగన్.. వధూవరులను ఆశీర్వదించారు. హోం మంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వేణుగోపాల కృష్ణ, జిల్లా అధ్యక్షుడు జక్కం పూడి రాజా, ఎంపీ మర్గాని భరత్ , పలువురు ప్రజా ప్రతినిధులు వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. \ -
తూర్పుగోదావరిలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
సాక్షి, నిడదవోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు నిడుదవోలు చేరుకుంటారు. 11 గంటలకు నిడుదవోలు గాంధీనగర్‌లో సెయింట్ ఆంబ్రోస్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. అనంతరం 11.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: దుష్టచతుష్టయానికి దత్తపుత్రుడు జతకలిశాడు: సీఎం జగన్ -
బాబు పర్యటన వేళ టీడీపీలో వర్గపోరు.. తన్నుకున్నంత పనిచేశారు!
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని నిడదవోలు టీడీపీలో వర్గపోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే శేషారావు, కుందల సత్యనారాయణ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఈ ఘటన జరగడం విశేషం. వివరాల ప్రకారం.. నిడదవోలు నియోజకవర్గంలో చంద్రబాబు యాత్ర పారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడకు వస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే శేషారావు, కుందల సత్యనారాయణ వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. చంద్రబాబుకు స్వాగతం పలికే విషయంపై వాదనలకు దిగారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు కల్పించుకుని వారికి సర్దిచెప్పడంతో ఈ వ్యవహరం సద్దుమణిగింది. -
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు టీడీపీలో వర్గపోరు
-
టీడీపీ బినామీలు గో బ్యాక్.. వికేంద్రీకరణ ముద్దు అంటూ నినాదాలు
సాక్షి, నిడదవోలు: అమరావతి పాదయాత్రకు తూర్పుగోదావరిలోని నిడదవోలులో నిరసన సెగ తగిలింది. కాగా, నిడదవోలులో పాదయాత్రకు వ్యతిరేకంగా ప్రజలు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రా స్టేట్ ముద్దు అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. టీడీపీ బినామీలు గో బ్యాక్ అంటూ ప్రజా సంఘాల నిరసన తెలిపాయి. వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య చిచ్చు వద్దంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. మూడు రాజధానులకే మా మద్దతు అంటూ ప్రజా సంఘాల నేతలు నినాదాలు చేశారు. -
అమరావతి పాదయాత్రకు రెండో రోజూ నిరసన సెగలు
-
సీఎం జగన్‌ది అభివృద్ధి.. మరి చంద్రబాబుది?
సాక్షి, తూర్పు గోదావరి: నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల మహాపాదయాత్రకు.. అక్కడ కూడా నిరసనే స్వాగతం పలికింది. అమరావతి రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్ర స్టేట్ ముద్దు అంటూ వివిధ స్లొగన్స్ తో పోస్టర్లు ఏర్పాటు చేశారు నాయకులు. జగన్(సీఎం జగన్‌ను ఉద్దేశించి..)ది స్టేట్ గురించి ఆలోచన అని, చంద్రబాబుది(ప్రతిపక్ష నేత చంద్రబాబు) రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన అని అందులో పేర్కొన్నారు. జగన్ కోరుకొనేది అందరి అభివృద్ధి అయితే.. చంద్రబాబు కోరుకునేది అస్మదీయుల అభివృద్ధి అని, జగన్‌ది సమైక్యవాదం అని, చంద్రబాబుది భ్రమరావతి నినాదం అని, జగన్‌ది అభివృద్ధి మంత్రం అయితే.. చంద్రబాబుది రాజకీయ కుతంత్రం అని.. ఇలా అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా.. జై అమరావతి నినాదానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను ఖుల్లాగా ప్రచురించారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా నిడదవోలులో రౌండ్ టేబుల్ సమావేశం
-
గ్రహ శకలం కనుగొన్న విద్యార్థిని.. అరుదైన రికార్డు సొంతం
నిడదవోలు(తూర్పుగోదావరి జిల్లా): నిడదవోలుకి చెందిన పదో తరగతి విద్యార్థి కుంచాల కైవల్యరెడ్డి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ముఖ్యమైన ఆ్రస్టాయిడ్ బెల్ట్‌లో గ్రహ శకలం 2021 సీఎం37ను కనుగొన్నది. నాసా భాగస్వామ్య సంస్థ అయిన అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన క్యాంపెయిన్‌లో ఈ గ్రహశకలాన్ని కనిపెట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబిరేషన్ సంబంధిత ధ్రువీకరణపత్రాన్ని కైవల్యకు అందజేసింది. చదవండి: మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే.. పాన్‌స్టార్స్ టెలిస్కోప్ సాయంతో తీసిన అంతరిక్ష ఛాయా చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విశ్లేషించడం ద్వారా ఈ గ్రహశకలాన్ని గుర్తించినట్లు కైవల్య తెలిపింది. ఢిల్లీకి చెందిన స్వచ్ఛంధ సంస్థ స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సమీర్ సత్యదేవ్ వద్ద కైవల్యరెడ్డి శిక్షణ తీసుకుని ‘గామా’ టీం పేరు తో శకలాన్ని గుర్తించింది. గతంలో కైవల్య 2020 పీఎస్ 24 అనే మెయిన్ బెల్ట్‌లో ఉన్న గ్రహశకలాన్ని కనుగొనడంతో సీఎం వైఎస్ జగన్ ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు. రెండో గ్రహశకలం కనుగొన్న కైవల్యని తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి అభినందించారు. -
నిడదవోలులో బ్లాక్ ఫంగస్ లక్షణాలు
సాక్షి, పశ్చిమ గోదావరి: నిడదవోలులో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. సమాచారం ప్రకారం..15 రోజుల క్రితం బాధితుడు కరోనా నుంచి కోలుకున్నాడు. కాగా ఏలూరు ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన సమయానికే బాధితుడు కన్నువాపుగా ఉండేది. అయితే గత వారం రోజులుగా కన్నువాపు పెరుగుతుండడంతో రాజమండ్రి, విశాఖ ఆస్పత్రుల్లో పరీక్షలు చేసుకోగా ఫంగస్ లక్షణాలుగా నిర్థారణ అయ్యింది. ఈ వాపు కన్నుతో పాటు, ముక్కు, మెదడుకు వ్యాపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ( చదవండి: ఏలూరు ఆంధ్రా హాస్పిటల్‌పై క్రిమినల్ కేసు ) -
తల్లి రెండో భర్త లైంగిక వేధింపులే కారణమా..?
పశ్చిమగోదావరి , నిడదవోలు : పట్టణంలో పాటిమీద సెంటర్లో పాత ట్రెజరరీ వీధిలో దుర్రు ప్రియ బాంధవి(20)అనే విద్యార్థిని సోమవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలో సంచలనం రేపిన ఈ సంఘటనపై విద్యార్థిని తల్లి నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె మరణానికి తన రెండో భర్త ఈగల అప్పలరాజు కారణమని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదులో వివరాలు ఇలా ఉన్నాయి. ప్రియ బాంధవి ఉరి వేసుకుని చనిపోయిందని అప్పలరాజు తన భార్య నాగమణికి సమాచారం ఇచ్చి అక్కడ నుంచి పరారయ్యాడు. ఇంత వరకు అతని ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రియ బాంధవి ప్రస్తుతం తణుకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ రెండో సంవత్సరం చదువుతోంది. పట్టణంలో పాటిమీద సెంటర్లో నివాసం ఉంటున్న దుర్రు నాగమణి భర్త నాగరాజు మృతి చెందగా ఏడేళ్ల క్రితం విశాఖపట్నం గాజువాకకు చెందిన ఈగల అప్పలరాజు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. నాగమణి మొదటి భర్త నాగరాజుకు ప్రియ బాంధవి జన్మించింది. ఏడేళ్లలో వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భార్యభర్తలు తరచూ గొడవలు పడేవారు. కన్నతల్లికి తీరని కడుపుకోత ఇంటిలో ఉన్న చీటీ పాట ద్వారా వచ్చిన 32,000 రూపాయలను తీసుకుని పట్టణంలో రహస్య ప్రాంతంలో పేకాట ఆడుతున్న అప్పలరాజు అచూకీ తెలుసుకుని తల్లీకూతుళ్లు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో అప్పలరాజు నాగమణిని కొట్టడంతో చనిపోతానని అక్కడ నుంచి ఆటోలో వెళ్లిపోయింది. ప్రియ కూడా అక్కడ నుంచి ఇంటికి తానే వెళ్లిపోయిందా ..ఇంటి దగ్గర ఎవరైనా దింపారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగమణి కొంత దూరం వెళ్లే సరికి తన భర్త ఫోన్ చేసి ప్రియ బాంధవి ఇంటిలో తలుపులు వేసుకుందని చెప్పడంతో నాగమణి తిరిగి వెనక్కి వచ్చేసింది. నేను వచ్చే లోపల ఇదంతా జరిగిపోయిందని, కన్న కూతురిలా చూసుకోవాల్సిన తండ్రి కూతురు వరసైనా ప్రియ బాంధవిని లైంగిక వేధింపులకు గురిచేశాడని, తన కూతురు అనేక సార్లు తనతో మొర పెట్టుకుందని నాగమణి ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటకు తెలిస్తే తన కూతురు భవి ష్యత్, పరువు నాసనమవుతాయని బయట పెట్ట లేక కడుపులోనే దాచుకున్నానని నాగమణి కన్నీరు మున్నీరవుతోంది. అప్పలరాజు గతంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. తన భర్త ప్రస్తుతం ప రారీలో ఉన్నాడని నాగమణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నాగమణి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు. -
ఇసుక విక్రయదారులపై అధికారుల దాడి
అధిక ధరలు వసూలుపై తొమ్మిది మందిపై కేసులు నాలుగు లారీలు, ఐదు పడవలు సీజ్ నిడదవోలు రూరల్ : గోదావరి నది నుంచి ఇసుకను తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై శనివారం ఉదయం రెవెన్యూ, పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. మండలంలోని తాళ్లపాలెం, శెట్టిపేట గ్రామాల్లో పడవల ద్వారా ఇసుకను రవాణా చేసి అధిక ధరలకు విక్రయించడంతో పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, సీఐ ఎం.బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేసి ఐదు పడవలు, నాలుగు లారీలు సీజ్ చేశారు. పడవల నుంచి లారీలకు ఇసుకను విక్రయిస్తున్న 9 మందిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై జి.సతీష్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ ఇసుకను రూ.800కు విక్రయించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేయగా పడవ నిర్వాహకులు మాత్రం యూనిట్ ఇసుకను రూ.1500 పైనే వసూలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. అధిక ధరలకు ఇసుక విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
కాలువలో జారిపడి మహిళ మృతి
నిడదవోలు : నిడదవోలులో గూడెం రైల్వేగేటు సమీపంలోని చెక్‌పోస్టు వద్ద పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో మంగళవారం కాలుజారి పడి ఓ మహిళ మృతిచెందింది. పట్టణంలోని చర్చిపేటకు చెందిన తూరుగోపు కుమారి (45) అనే మహిళ కాలువ ఒడ్డున బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలోకి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు ఆమెను కాపాడేలోపు మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పిల్లల చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. దీంతో కూలీ పనులు చేసుకుంటూ ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది. తల్లి అకాలమరణంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. పట్టణ ఎస్సై జి.సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
కాల్వలోకి దూసుకుపోయిన కారు
ఏలూరు: అదుపుతప్పి కారు కాల్వలోకి దూసుకుపోవడంతో ఇద్దరు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామం వద్ద ఆదివారం ఉదయం ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాల్వలోకి దూసుకుపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు. మృతులు విజయవాడకు చెందిన కంబాల సాయిరాం, గోపీచంద్‌గా గుర్తించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కరెంట్ కాటేసింది
నిడదవోలు రూరల్: నిడదవోలు మండలంలోని శెట్టిపేట శివారులో కాకరపర్రు రెగ్యులేటర్ కాంట్రాక్టర్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఖమ్మం గోపాలకృష్ణ (66) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతిచెందినట్టు పట్టణ ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆచంట గ్రామానికి చెందిన గోపాలకృష్ణ ఏడేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం భార్య రాధమ్మతో వచ్చి రెగ్యులేటర్ వద్ద వాచ్‌మెన్‌గా చేరాడు. అప్పటినుంచి రెగ్యులేటర్ నిర్మాణానికి వినియోగించే సామాన్లను భద్రంగా చూడటంతో పాటు కాకరపర్రు లాకుల వద్ద పనిచేసే ఇరిగేషన్ సిబ్బందికి చేదోడువాదోడుగా ఉంటూ అక్కడే నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోజుమాదిరిగానే మంగళవారం ఉదయం రెగ్యులేటర్ కార్యాలయం ముందు ఉన్న కొండాలమ్మవారిని దర్శించుకుని లైట్లు ఆపడానికి స్వీచ్ ఆన్‌చేయగా షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతదేహం వద్ద భార్య రాధమ్మ, బంధువులు గుండెలవిసేలా రోదించారు. గోపాలకృష్ణ మంచి వ్యక్తిని, నమ్మకంతో పనిచేసేవాడని ఇరిగేషన్, రెగ్యులేటర్ కాంట్రాక్టర్లు గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు. లాక్ సూపరింటెండెంట్లు చిక్కాల బ్రహ్మజీ, రాజు, నీటిసంఘం అధ్యక్షుడు బూరుగుపల్లి శ్రీనివాసరావు శవపంచానామ కార్యక్రమాలను పర్యవేక్షించారు. భార్య రాధమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీష్ చెప్పారు. -
సెల్ బ్యాలెన్సుల కోసం సమాధుల తవ్వకం!
నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని 28 వార్డులో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలోని సమాధులను ధ్వంసం చేసిన కేసులో 10 మంది మైనర్ పిల్లలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆకతాయి తనంతో చేసినట్టు నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ ఎం.బాలకృష్ణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. పట్టణంలోని క్రైస్తవ శ్మశాన వాటికలోని సమాధులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కన్వీనర్ పిల్లి డేవిడ్ కుమార్, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు పట్టణ పోలీస్ స్టేష¯ŒSలో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ కేసులో చర్చిపేటకు చెందిన 10 మంది మైనర్ పిల్లలు ఆకతాయితనంతో సమాధులను ధ్వంసం చేసినట్టు గుర్తించామన్నారు. సమాధులు, సమాధులపై శిలువలో ఉన్న ఇనుప ఊచలను స్థానిక పాత ఐర¯ŒS షాపుల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో సెల్ బ్యాలె¯Œ్స వేసుకుని పిల్లలు తప్పుదోవ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతుందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు సీఐ తెలిపారు. ఆకతాయి చిన్నారుల తల్లిదండ్రులను పోలీస్‌స్టేష¯ŒSకు పిలిపించి వారికి పిల్లల పెంపకం, తీసుకోవాలి్సన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇచ్చారు. పట్టణ ఏస్సై జి.సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. -
మోటార్ సైకిళ్ల దొంగ అరెస్ట్
నిడదవోలు : పట్టణంలోని వివిధ కూడళ్లలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడిన యువకుడిని నిడదవోలు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సై జి.సతీష్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పట్టణంలో వైఎస్సార్ కాలనీకి చెందిన కోయి శివప్రసాద్ పట్టణంలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. పట్టణంలోని బసివిరెడ్డిపేట రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర నిడదవోలు–తాడేపలి్లగూడెం రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా పాత నేరస్తుడైన కోయి శివప్రసాద్ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకుని విచారించగా మోటార్ సైకిళ్లు దొంగతనం చేసినట్టు తెలిపాడన్నారు. పట్టణంలోని గణపతి సెంటర్లో ఈ నెల 12న డిస్కవరీ నీలంరంగు మోటార్ సైకిల్, అదే రోజు రాత్రి గాంధీనగర్‌లోని బార్భర్ షాపు తాళం పగులగొట్టి ఎల్ఈడీ టీవీ, షాపు ఎదురుగా ఉన్న హోండా యాక్టివా మోటార్ సైకిల్‌ను దొంగిలించాడు. రూ.1.30 లక్షల విలువ చేసే మోటార్ సైకిళ్లు, టీవీని స్వాధీనపరుచుకున్నామని చెప్పారు. పోలీస్, క్రైమ్ పార్టీ సిబ్బందిని సీఐ ఎం. బాలకృష్ణ అభినందించారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం రూరల్ : వేర్వేరు చోట్ల చోరీలకు పాల్పడిన ఘటనల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు ఆటోలు, ఏడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్.మూర్తి తెలిపారు. మంగళవారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మోదుగగుంట గ్రామానికి చెందిన దండ్రు వెంకన్నబాబు, దండ్రు దుర్గారావులు ఈ చోరీలకు పాల్పడ్డారన్నారు. పట్టణ శివారు కొండాలమ్మ గుడి వద్ద మంగళవారం అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారన్నారు. వారి వద్ద నుంచి రెండు ఆటోలు, ఏడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.3 లక్షలు ఉంటుందన్నారు. కొవ్వూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ జె.వెంకట్రావు సూచనల మేరకు మోటారు సైకిళ్ల దొంగలపై నిఘా ఏర్పాటు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సమావేశంలో పట్టణ ఎస్సై చిన్నం ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
నిజంగా.. వానేనా
తాడేపల్లిగూడెం రూరల్ : మండే ఎండలు, ఊపిరిసల్పని ఉక్కపోతలు. ఇలాంటి సమయంలో చల్లని గాలి.. హాయిగొలిపే చినుకు.. ఇంతకన్నా ఏముంది ఓదార్పు. గురువారం రాత్రి ఒక్కసారిగా వర్షం పడి ప్రజలను సేదతీర్చింది. జిల్లాలోని తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పలకరించింది. రాత్రి 7.15 గంటలకు ప్రారంభమైన వర్షం 8 గంటల వరకు పడింది. ఆకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. -
పారిశుద్ధ్య కార్మికులపై దాడి
నిడదవోలు : పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా పందులను పట్టుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులపై పందుల పెంపకందారులు దాడికి పాల్పడిన సంఘటన నిడదవోలులో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలో పందుల సంచారం ఎక్కువకావడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ పలువురు మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి చర్యలకు ఉపక్రమించారు. ప్రజారోగ్యం దృష్ట్యా పందులను నిర్మూలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో పట్టణంలో సంత వద్ద పందుల సంచారం ఎక్కువగా ఉండటంతో శానిటరీ మేస్త్రీ చంద్రబాబు పర్యవేక్షణలో బుధవారం ఉదయం 6.30 గంటలకు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు పందులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సుమారు 20 మంది పందుల పెంపకందారులు ఇక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారుల ఆదేశాల ప్రకారమే పందులను పట్టుకుంటున్నామని పారిశుద్ధ్య మేస్త్రి, కార్మికులు చెబుతున్నా వినిపించుకోకుండా పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేశారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు బంగారు సత్తిబాబు, ముత్యాల సాయి, బొచ్చా దుర్గాప్రసాద్ స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి, పట్టణ ఏస్సై ఎస్.సతీష్, కమిషనర్ జి.కృష్ణమోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చైర్మన్ కృష్ణమూర్తి బాధితులను పరామర్శించారు. పందుల నిర్మూలనకు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదని పెంపకందారులను హెచ్చరించారు. సంఘటనపై కమిషనర్ జి.కృష్ణమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన పందుల పెంపకందారులు కోతాడ చిన్నా, జి.సూరిబాబు, గాడా బాలజీపై ఎస్సై జి.సతీష్ కేసు నమోదు చేశారు. -
సహనం.. మన జీవన మార్గం
నిడదవోలు : తన కోపమే తన శత్రువు.. ఏ కార్యమైన శాంతి, సహనంతోనే జయించవచ్చని ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. నిడదవోలు మండలంలోని ఉనకరమిల్లిలో సీతారామ మందిరం వద్ద శ్రీరామనవమి వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పారు. సుమారు గంటపాటు రామాయణంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, రా ముడు, సీత అన్యోన్యత, భక్తిమార్గాలను ప్రబోధించేలా ఆయన ప్రసంగం ఆసాం తం ఆకట్టుకుంది. ఓర్పు, సహనం జీవన మార్గం కావాలని, వీటిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని చెప్పారు. సీతామాత శాంతి, సహనం మార్గాలతో విజయం సాధించిందన్నారు. ఆలయాలకు వెళ్లి పూజలు చేసినంత మాత్రం ఫలితం సిద్ధించదని, మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా చేసిన పూజ సంపూర్ణంగా ఫలితాని్నస్తుందని చెప్పారు. సీతామాతను మహిళలంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చాగంటి ప్రవచనానికి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చారు. -
పింఛను కోసం తిరిగి తిరిగి.. గుండె పగిలి
నిడదవోలు : పింఛను సొమ్ము కోసం మూడు రోజులపాటు బ్యాంకు చుట్టూ తిరిగిన ఓ వృద్ధుడు తన ఖాతాలో ఆ మొత్తం జమ కాలేదని తెలిసి ఆవేదనతో గుండెపోటు గురై మృత్యువాతపడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నిడదవోలు ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న బైపే యేసేబు (75) తనకు రావాల్సిన వృద్ధాప్య పింఛను సొమ్ము కోసం రెండు కిలోమీటర్ల దూరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మూడు రోజులుగా వెళుతున్నాడు. కాళ్లు లాగుతున్నా గంటలకొద్దీ క్యూలో నిలబడటం, చివరకు పింఛను సొమ్ము జమకాలేదని బ్యాంక్ సిబ్బంది చెప్పడం పరిపాటిగా మారింది. తనకు పింఛను సొమ్ము వస్తుందో రాదో తెలియడం లేదని, బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నానని, నడిచివెళ్లడం, క్యూలో గంటలకొద్దీ నిలబడాల్సి రావడంతో ఆయాసం, ఒగుర్పు వస్తోందని గురువారం రాత్రి కన్నీళ్లు పెట్టుకున్నాడని యేసేబు కుమార్తె రత్నమ్మ వాపోయింది. శుక్రవారం వేకువజామున గుండె పోటుకు గురై మరణించాడని చెప్పింది. యేసేబు భార్య, ఇద్దరు కుమారులు గతంలోనే మరణించాడు. మూడు రోజులపాటు బ్యాంక్ చుట్టూ తిరిగినా పింఛను సొమ్ము రాకపోవడంతో మందులు కొనుక్కోలేకపోయాడని, చివరకు మృత్యువాత పడ్డాడని అతని కుమార్తె కన్నీళ్లు పెట్టుకుంది. -
పశ్చిమడెల్టాకు 5000 క్యూసెక్కుల సాగు నీరు
నిడదవోలు : విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ నుండి పశ్చిమడెల్టా ప్రధాన కాలువకు శుక్రవారం నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని తగ్గించి విడుదల చేస్తున్నారు. గురువారం వరకు 7,000 క్యూసెక్కుల విడుదల చేసిన అధికారులు 1,000 క్యూసెక్కులు తగ్గించి విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న మూడు డెల్టాలకు 10,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు3,000 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 2,200 క్యూసెక్కులు వదులుదున్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 13.96 మీటర్లు నమెదయ్యంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీల నుండి 25,183 క్యూసెక్కుల మిగులు జలాలలను సముద్రంలోకి వదులుతున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలోని ఏలూరు కాలువకు 865 క్యూసెక్కులు,నరసాపురం కాలువకు 1774, తణుకు కాలువకు 465, ఉండి కాలువకు 1129 క్యూసెక్కులు, అత్తిలి కాలువకు 390 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.