రైలు ఢీకొని వృద్ధురాలి మృతి
Published Fri, Sep 9 2016 2:16 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
నిడదవోలు : రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. యశ్వంత్ పూర్–హౌరా ఎక్స్‌ప్రెక్ నిడదవోలు స్టేషన్ నుంచి విశాఖ వైపు వెళ్తుడగా చిన్నకాశీరేవు సమీపంలోని రైల్వేట్రాక్‌ను తైలమ్మ(70) అనే వృద్ధురాలు దాటుతోంది. ఆమెను గమనించిన లోకోపైలట్ సడన్ బ్రేక్ వేశారు. అయినా ఫలితం లేకపోవడంతో రైలు వృద్ధురాలిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన తైలమ్మను స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించింది. తైలమ్మ స్థానిక చర్లసుశీల వృద్ధాశ్రమంలో ఉంటుంది.
ఇంజన్‌లో సమస్య.. 30 నిమిషాలు నిలిచిన రైలు
బ్రేక్ వేసిన సమయంలో ఇంజన్‌లో సమస్య తలెత్తడంతో 30 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో గేటు వేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రైల్వే గేటు వద్ద నుంచి పోలీస్‌స్టేషన్ వరకు, ఇటువైపు శెట్టిపేట వరకు వాహనాలు బారులు తీరాయి. పట్టణ ఎస్‌ఐ భగవాన్ ప్రసాద్ రైల్వే మేనేజర్ ఆకుల ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Advertisement