Clash Between TDP Leaders In East Godavari Nidadavole - Sakshi
Sakshi News home page

బాబు పర్యటన వేళ టీడీపీలో వర్గపోరు.. తన్నుకున్నంత పనిచేశారు!

Published Fri, Dec 2 2022 7:02 PM | Last Updated on Fri, Dec 2 2022 7:38 PM

Clash Between TDP Leaders In East Godavari Nidadavole - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని నిడదవోలు టీడీపీలో వర్గపోరు పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే శేషారావు, కుందల సత్యనారాయణ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఈ ఘటన జరగడం విశేషం. 

వివరాల ప్రకారం.. నిడదవోలు నియోజకవర్గంలో చంద్రబాబు యాత్ర పారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడకు వస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే శేషారావు, కుందల సత్యనారాయణ వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. చంద్రబాబుకు స్వాగతం పలికే విషయంపై వాదనలకు దిగారు. ఈ నేపథ్యంలో​ సీనియర్‌ నేతలు కల్పించుకుని వారికి సర్దిచెప్పడంతో ఈ వ్యవహరం సద్దుమణిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement