
సాక్షి, నిడదవోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం) తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు.
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు నిడుదవోలు చేరుకుంటారు. 11 గంటలకు నిడుదవోలు గాంధీనగర్‌లో సెయింట్ ఆంబ్రోస్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. అనంతరం 11.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
చదవండి: దుష్టచతుష్టయానికి దత్తపుత్రుడు జతకలిశాడు: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment