తల్లి రెండో భర్త లైంగిక వేధింపులే కారణమా..? | Student Suicide Case Twist in Nidadavole West Godavari | Sakshi

అసలేం జరిగింది..?

Published Wed, Aug 29 2018 12:43 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

Student Suicide Case Twist in Nidadavole West Godavari - Sakshi

చిత్రంలో నాగమణి, ఆమె రెండో భర్త ఈగల అప్పలరాజుతో ప్రియ బాంధవి(ఫైల్‌ ఫొటో)

పశ్చిమగోదావరి , నిడదవోలు :  పట్టణంలో పాటిమీద సెంటర్‌లో పాత ట్రెజరరీ వీధిలో దుర్రు ప్రియ బాంధవి(20)అనే విద్యార్థిని సోమవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలో సంచలనం రేపిన ఈ సంఘటనపై విద్యార్థిని తల్లి నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె మరణానికి తన రెండో భర్త ఈగల అప్పలరాజు కారణమని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదులో వివరాలు ఇలా ఉన్నాయి. ప్రియ బాంధవి ఉరి వేసుకుని చనిపోయిందని అప్పలరాజు తన భార్య నాగమణికి సమాచారం ఇచ్చి అక్కడ నుంచి పరారయ్యాడు. ఇంత వరకు అతని ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రియ బాంధవి ప్రస్తుతం తణుకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్‌ రెండో  సంవత్సరం చదువుతోంది. పట్టణంలో పాటిమీద సెంటర్‌లో నివాసం ఉంటున్న  దుర్రు నాగమణి భర్త నాగరాజు మృతి చెందగా ఏడేళ్ల క్రితం విశాఖపట్నం గాజువాకకు చెందిన ఈగల అప్పలరాజు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. నాగమణి మొదటి భర్త నాగరాజుకు ప్రియ బాంధవి జన్మించింది. ఏడేళ్లలో వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భార్యభర్తలు తరచూ గొడవలు పడేవారు.

కన్నతల్లికి తీరని కడుపుకోత
ఇంటిలో ఉన్న చీటీ పాట ద్వారా వచ్చిన 32,000 రూపాయలను తీసుకుని పట్టణంలో రహస్య ప్రాంతంలో పేకాట ఆడుతున్న అప్పలరాజు అచూకీ తెలుసుకుని తల్లీకూతుళ్లు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో అప్పలరాజు నాగమణిని కొట్టడంతో చనిపోతానని అక్కడ నుంచి ఆటోలో వెళ్లిపోయింది. ప్రియ కూడా అక్కడ నుంచి ఇంటికి తానే వెళ్లిపోయిందా ..ఇంటి దగ్గర ఎవరైనా దింపారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగమణి కొంత దూరం వెళ్లే సరికి తన భర్త ఫోన్‌ చేసి ప్రియ బాంధవి ఇంటిలో తలుపులు వేసుకుందని చెప్పడంతో నాగమణి తిరిగి వెనక్కి వచ్చేసింది. నేను వచ్చే లోపల ఇదంతా జరిగిపోయిందని, కన్న కూతురిలా చూసుకోవాల్సిన తండ్రి కూతురు వరసైనా ప్రియ బాంధవిని లైంగిక వేధింపులకు గురిచేశాడని, తన కూతురు అనేక సార్లు తనతో మొర పెట్టుకుందని నాగమణి ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటకు తెలిస్తే తన కూతురు భవి ష్యత్, పరువు నాసనమవుతాయని బయట పెట్ట లేక కడుపులోనే దాచుకున్నానని నాగమణి కన్నీరు మున్నీరవుతోంది. అప్పలరాజు గతంలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. తన భర్త ప్రస్తుతం ప రారీలో ఉన్నాడని నాగమణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నాగమణి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement