పశ్చిమడెల్టాకు 5000 క్యూసెక్కుల సాగు నీరు
Published Fri, Oct 28 2016 6:00 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
నిడదవోలు :
విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ నుండి పశ్చిమడెల్టా ప్రధాన కాలువకు శుక్రవారం నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని తగ్గించి విడుదల చేస్తున్నారు. గురువారం వరకు 7,000 క్యూసెక్కుల విడుదల చేసిన అధికారులు 1,000 క్యూసెక్కులు తగ్గించి విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న మూడు డెల్టాలకు 10,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు3,000 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 2,200 క్యూసెక్కులు వదులుదున్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 13.96 మీటర్లు నమెదయ్యంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీల నుండి 25,183 క్యూసెక్కుల మిగులు జలాలలను సముద్రంలోకి వదులుతున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలోని ఏలూరు కాలువకు 865 క్యూసెక్కులు,నరసాపురం కాలువకు 1774, తణుకు కాలువకు 465, ఉండి కాలువకు 1129 క్యూసెక్కులు, అత్తిలి కాలువకు 390 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Advertisement
Advertisement