
అమరావతి మహాపాదయాత్ర చేపట్టిన వాళ్లకు అడుగడుగునా నిరసనల స్వాగతమే లభిస్తోంది.
సాక్షి, తూర్పు గోదావరి: నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల మహాపాదయాత్రకు.. అక్కడ కూడా నిరసనే స్వాగతం పలికింది. అమరావతి రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్ర స్టేట్ ముద్దు అంటూ వివిధ స్లొగన్స్ తో పోస్టర్లు ఏర్పాటు చేశారు నాయకులు.
జగన్(సీఎం జగన్‌ను ఉద్దేశించి..)ది స్టేట్ గురించి ఆలోచన అని, చంద్రబాబుది(ప్రతిపక్ష నేత చంద్రబాబు) రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన అని అందులో పేర్కొన్నారు. జగన్ కోరుకొనేది అందరి అభివృద్ధి అయితే.. చంద్రబాబు కోరుకునేది అస్మదీయుల అభివృద్ధి అని, జగన్‌ది సమైక్యవాదం అని, చంద్రబాబుది భ్రమరావతి నినాదం అని, జగన్‌ది అభివృద్ధి మంత్రం అయితే.. చంద్రబాబుది రాజకీయ కుతంత్రం అని.. ఇలా అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా.. జై అమరావతి నినాదానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను ఖుల్లాగా ప్రచురించారు.