
సాక్షి, పశ్చిమ గోదావరి: రైతులుగా చెప్పుకుంటూ అమరావతి పేరిట పాదయాత్ర చేపట్టివాళ్లకు రెండో రోజూ(బుధవారం) నిరసన సెగ తగిలింది. జిల్లాలోని తణుకు పట్టణంలో పాదయాత్రకు వ్యతిరేకంగా అడుగడుగునా నిరసనలు దర్శనమిచ్చాయి. టీడీపీ బినామీలు గోబ్యాక్.. గోబ్యాక్ నినాదాలు చేశారు అక్కడి ప్రజలు.
వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మద్య చిచ్చు వద్దంటూ సందేశాలతో పట్టణంలో అమరావతి యాత్రకు స్వాగతం పలికాయి. గోబ్యాక్ సందేశాలతో బ్యానర్లు వెలిశాయి. ఇంకోవైపు మూడు రాజధానులే కావాలంటూ ప్రజలు ఫ్లకార్డులు సైతం ప్రదర్శించారు.
ఇదీ చదవండి: చంద్రబాబు పేకలో పవన్‌కల్యాణ్ జోకర్
Comments
Please login to add a commentAdd a comment