thanuku
-
టీడీపీ బినామీలు గోబ్యాక్.. గోబ్యాక్
సాక్షి, పశ్చిమ గోదావరి: రైతులుగా చెప్పుకుంటూ అమరావతి పేరిట పాదయాత్ర చేపట్టివాళ్లకు రెండో రోజూ(బుధవారం) నిరసన సెగ తగిలింది. జిల్లాలోని తణుకు పట్టణంలో పాదయాత్రకు వ్యతిరేకంగా అడుగడుగునా నిరసనలు దర్శనమిచ్చాయి. టీడీపీ బినామీలు గోబ్యాక్.. గోబ్యాక్ నినాదాలు చేశారు అక్కడి ప్రజలు. వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మద్య చిచ్చు వద్దంటూ సందేశాలతో పట్టణంలో అమరావతి యాత్రకు స్వాగతం పలికాయి. గోబ్యాక్ సందేశాలతో బ్యానర్లు వెలిశాయి. ఇంకోవైపు మూడు రాజధానులే కావాలంటూ ప్రజలు ఫ్లకార్డులు సైతం ప్రదర్శించారు. ఇదీ చదవండి: చంద్రబాబు పేకలో పవన్‌కల్యాణ్ జోకర్ -
ఎమ్మెల్యే కారుమూరి సోదరుడు మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు అన్నయ్య కారుమూరి వెంకట ప్రసాద్(59) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం మరణించారు. ఎమ్మెల్యే కారుమూరి అమెరికా పర్యటనకు బయల్దేరుతుండగా.. సోదరుడి మరణవార్తతో ప్రయాణం రద్దుచేసుకుని అత్తిలి చేరుకున్నారు. వెంకట ప్రసాద్‌కు భార్య సుభద్రాదేవి, కుమారుడు రామసాయిచరణ్, కుమార్తె లహరి ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వెం కట ప్రసాద్ తణుకు ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. స్వగ్రామం అత్తిలిలో గురువారం అంత్యక్రియలు నిర్వహించా రు. నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీనాయకులు, అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావును పరామర్శించి సంతాపం తెలిపారు. -
సీబీఐ దాడి..జీఎస్టీ అధికారి అరెస్ట్
సాక్షి, తణుకు(పశ్చిమ గోదావరి): సీబీఐ.. ఈ పదం తణుకు పట్టణంలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అధికారులను హడలెత్తిస్తోంది. గతంలో సీబీఐ అధికారులు తణుకు పట్టణంలోని పలువురు అధికారులతోపాటు వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు చేసిన ఘటనలు మరువక ముందే తాజాగా సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కారుమూరి కల్యాణ్‌చక్రవర్తి లంచం తీసుకుంటూ పట్టుబడటం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. జీఎస్టీ రద్దు చేయడానికి ఒక వ్యాపారి నుంచి రూ.2 వేలు డిమాండ్ చేసిన ఘటనలో సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా కల్యాణ్ చక్రవర్తిని పట్టుకుని అరెస్టు చేయడం కలకలం రేపింది. మరోవైపు గతంలో ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (వెస్ట్ మీరట్)గా పని చేసిన ఐఎఫ్ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాదరావు వ్యవహారంలోనూ సీబీఐ అధికారులు పెద్దఎత్తున సోదాలు నిర్వహించారు. తణుకు పట్టణానికి చెందిన రాంప్రసాదరావు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై రెండేళ్ల క్రితం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఆయన భార్య ఆకుల కనకదుర్గపైనా కేసులు నమోదు చేశారు. తదనంతరం గతేడాది మార్చిలో రాంప్రసాదరావు అక్రమాస్తుల వ్యవహారంలో అస్తులు విక్రయించిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన, బినామీలుగా ఉన్న వ్యక్తులకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అప్పట్లో తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సీబీఐ నోటీసులు అదుకున్నారు. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. కోడిగుడ్ల వ్యాపారిపైనా..? తణుకు పట్టణానికి చెందిన కోడిగుడ్లు ఎగుమతి చేసే ఒక వ్యాపారిపైనా సీబీఐ అధికారులు గతంలోనే కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఒక బ్యాంకులో రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఆయనకు చెందిన కొన్ని ఆస్తులనూ ఎటాచ్ చేసుకున్నారు. తణుకు పట్టణంలోని వేల్పూరు రోడ్డు, సజ్జాపురం ప్రాంతాల్లో ఈయనకు చెందిన పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల మరోసారి తణుకు వచ్చిన సీబీఐ అధికారులు ఇక్కడే తిష్ట వేసి సంబంధిత కోడిగుడ్ల వ్యాపారికి చెందిన ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగినట్లు తెలుస్తోంది. గతంలో ఇతనికి సహకరించిన వారితోపాటు బినామీలుగా వ్యవహరించిన వ్యక్తుల కదలికలపై దృష్టి సారించిన అధికారులు మరోసారి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి ఐపీ ప్రకటించిన వ్యాపారికి స్థానికంగా కొందరు ఉద్యోగులు సహకారం అందించినట్లు విశ్వసనీయ సమాచారం. గతం నుంచి వ్యాపారులకు వేధింపులు తరచూ సీబీఐ అధికారులు తణుకు పట్టణంపై దృష్టి సారిస్తుండటంతో స్థానికంగా కలకలం రేగుతోంది. గత రెండేళ్లుగా సీబీఐ అధికారులు తణుకులో అటు ప్రభుత్వ అదికారులు, ఇటు పలువురు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారులపై దృష్టి సారించారు. తాజాగా తణుకు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ జీఎస్టీ కార్యాలయంలో సూపరింటెండెంటుగా పని చేస్తున్న కల్యాణ్‌చక్రవర్తి సీబీఐ అధికారులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. గతం నుంచి ఆయన పలువురు వ్యాపారులను మామూళ్లు పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రూ. లక్షల్లోనే లంచాలు డిమాండ్ చేసిన సదరు అధికారి కేవలం రూ.2 వేలు లంచం డిమాండ్ చేసి సీబీఐ అధికారులకు దొరికిపోయారు. తాడేపల్లిగూడెం నుంచి వచ్చి వెళ్లే కల్యాణ్‌చక్రవర్తి బాధితులు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు స్థానిక కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసంలోనూ తనిఖీలు చేయడం కొసమెరుపు. -
అక్రమార్కులకు వేసవి ‘బొనాంజ’
సాక్షి, తణుకు : వేసవి కాలం వచ్చిందంటే చాలు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మట్టి పేరుతో యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తూ కాసులు ఆర్జిస్తున్నారు. ఒక పక్క అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుతుండగా మరోపక్క ప్రభుత్వానికి ఎలాంటి కన్వర్షన్ ఫీజులు చెల్లించకుండానే పూడికలు చేపడుతున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని పెద్ద ఎత్తున పొలాలను పూడ్చుతున్నప్పటికీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తణుకుతో పాటు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డెల్టాలోని తణుకు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు తదితర పట్టణ సమీప ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. మరోవైపు ట్రాక్టర్లు, లారీల్లో మట్టి తరలిస్తుండటంతో రోడ్లు ఛిద్రమవుతున్నాయి. జాతీయ రహదారిపై సైతం అపసవ్య దిశలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ పర్యవేక్షించాల్సిన పెట్రోలింగ్ సిబ్బంది పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు ఏవి? ఇళ్ల స్థలాలకు అనువుగా వరిచేలను లేఅవుట్లుగా మార్చుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. ప్రభుత్వానికి 3 శాతం రుసుం చెల్లించడంతో పాటు భూమార్పిడి చేయించుకోవాలి. అనంతరం వరిచేలను పూడ్చడానికి మట్టి అవసరం అవుతుంది. చేలల్లో మట్టి దిబ్బల నుంచి మట్టిని తవ్వుకోవడానికి ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. గనుల శాఖకు రుసుం చెల్లించి అనుమతులు తెచ్చుకుని మట్టితో పూడ్చుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండానే తణుకు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారితో పాటు ప్రధాన రోడ్లు అనుకుని ఉన్న భూములను కొబ్బరి ఇతరత్రా పంటలు వేసుకుంటున్నామనే సాకుతో పూడికలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు మాత్రమే చెల్లించి మట్టి అనుమతులు తీసుకోకుండా పూడికలు కానిచ్చేస్తున్నారు. తణుకు పట్టణ పరిధితో పాటు మండలం పరిధిలోని దువ్వ, తేతలి, ముద్దాపురం, మండపాక తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే పూడికలు కానిచ్చేస్తున్నారు. ఇటు రెవెన్యూ, అటు గనుల శాఖకు చెందిన అధికారులు సైతం మామళ్ల మత్తులో జోగుతూ ఇష్టానుసారం మట్టిని తవ్వుకుంటూ తరలిస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా వందల ఎకరాల్లో పూడికలు చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్లాది రూపాయిల ఫీజులను ఎగ్గొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. నియంత్రణ లేని వాహనాలు ఒకపక్క అక్రమంగా మట్టిని తరలించుకుపోతున్న అక్రమార్కులు వాహనాలపై సరైన నియంత్రణ లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాక్టర్లు, లారీల్లో మట్టిని ఎత్తుగా వేసుకుని అతి వేగంగా రహదార్లుపై నడుపుతున్నారు. తణుకు మండలం దువ్వ జాతీయ రహదారి ఆనుకుని పెద్ద ఎత్తున పూడ్చుతున్న నిర్వాహకులు వాహనాలను ఇష్టానురీతిగా నడుపుతున్నారు. జాతీయ రహదారి నుంచి వరిచేలల్లోకి సబ్ రోడ్లు నిర్మించేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను గమనించకుండానే మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు, లారీలు ఒక్కసారిగా హైవేపైకి దూసుకువస్తున్నాయి. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు డ్రైవర్లు సైతం చెవులకు ఇయర్ ఫోన్లు పెట్టుకుని సినిమా పాటలు వింటూ రోడ్డుపై వెళ్లే వారికి దారి ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొందరు డ్రైవర్లకు కనీసం లైసెన్సులు లేకపోగా ఒక్కో వాహనంలో మైనర్లే డ్రైవింగ్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం నుంచి సక్రమంగా అనుమతులు తీసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుంలు చెల్లించేలా అధకారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అనుమతులు తప్పనిసరి మట్టి పూడిక చేసినా లేక పొలాల్లోని మట్టిని తవ్వి తరలించుకోవాలనుకున్నా గనుల శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుంలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాహనాలు రాకపోకలు సాగించాలి. – ఎల్.శివకుమార్, తహసీల్దార్, తణుకు -
మెరుపై సాగరా.. గెలుపే నీదిరా..
తణుకు అర్బన్: సంగీతం వినిపిస్తే చాలు కాళ్లు, చేతులే కాదు యావత్ శరీరం స్ప్రింగ్‌లా వంగిపోయేలా నృత్యం చేసేయడం ఈ బాలుడి సొంతం. నృత్యం అంటే ప్రాణం అంటూ డ్యాన్స్‌తో ఉర్రూతలూగిస్తున్నాడు తణుకుకు చెందిన విద్యార్థి ఈద నిర్మల్ వినయ్‌కుమార్. తణుకుకు చెందిన ఈద నవీన్ సుందర్, నీలిమదేవి పెద్ద కుమారుడు నిర్మల్ వినయ్‌కుమార్. అతడికి చిన్ననాటి నుంచి నృత్యంపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లితండ్రులు నృత్యంపై పట్టు సాధించేలా శిక్షణ ఇప్పించారు. దీంతో ఇప్పుడు పలుప్రాంతాల్లో ప్రదర్శనలు ఇస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఖమ్మం, ఏలూరు తదితర ప్రాంతాల్లో జరిగిన నృత్యప్రదర్శనల్లో పాల్గొన్నాడు. అంతేకాదు ఇటీవల చైల్డ్ ఆర్టిస్ట్‌గా మూడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు నవీన్. ఫేస్బుక్ ద్వారా సినీ అరంగ్రేటం కుమారుడి నృత్యం వీడియోలను తల్లి నీలిమదేవి తన ఫేస్బుక్ అకౌంట్లో అప్లోడ్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. వీడియోల్లో కళ్లు చెదిరేలా కుమార్ వేసిన స్టెప్పులు అతడి కెరీర్‌ను మలుపుతిప్పాయి. వీడియో చూసిన ఎస్డీ కేర్ ఆఫ్ వెంచపల్లి సినిమా దర్శకుడు పాలిక్ శ్రీనివాస్, నిర్మాత గోదారి భానుచందర్ తమ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తీసుకుని పాలేరు పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో కొత్త హీరో శ్రీజిత్ లవణ్, హీరోయిన్ కారుణ్య కత్రిన్తోపాటు నవీన్ నటిస్తున్నాడు. ఈ సినిమాతోపాటు హీరో సుమన్ నటిస్తున్న సడి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవకాశం రాగా, ఇటీవల మరో సినిమాలో కూడా అవకాశం దక్కడం విశేషం. అన్నింటా ప్రథమమే.. నృత్యం అంటే ప్రాణం అంటూనే ఇటు విద్యలోనూ ముందు వరుసలో నిలుస్తున్నాడు నవీన్. చిత్రలేఖనం, వాలీబాల్, క్రికెట్లో కూడా నైపుణ్యాన్ని చూపిస్తున్నాడు. అన్నిటికంటే మించి గొప్ప దాన గుణం నిర్మల్ వినయ్‌కుమార్ సొంతం. తల్లితండ్రులు ఇచ్చే పాకెట్ మనీని అనాథలు, వికలాంగులకు ఖర్చుచేస్తుండటం అతని నైజం. ఇలా చిన్నతనంలోనే అటు డ్యాన్స్, కళలు, చదువులో రాణిస్తూ భేష్ అనిపించుకుంటున్నాడు. కుటుంబ నేపథ్యం తండ్రి ఈద నవీన్‌సుందర్ తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం జెడ్పీ హైస్కూలులో జూనియర్ అసిస్టెంట్‌గా, తల్లి నీలిమదేవి తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూలులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిర్మల్ ప్రస్తుతం 7వ తరగతి పరీక్షలు రాసి 8వ తరగతిలోకి ప్రవేశించనున్నాడు. తమ్ముడు నిర్మల్ రాజేష్‌కుమార్ ఎల్కేజీ చదువుతున్నాడు. తల్లి కూడా చదువుకునే వయసు నుంచి మంచి నృత్యకారిణి కావడం విశేషం. లక్ష్యాన్ని చేరేలా ప్రోత్సహిస్తున్నాం నృత్యం కోసం ప్రాణం పెట్టే మా బాబు అన్ని రంగాల్లోనూ ముందుం టున్నాడు. తను ఎంచుకున్న రంగంలో ప్రోత్సాహించాలని నా భర్త నవీన్‌సుందర్, నేను నిశ్చయించుకున్నాం. క్రీడలు, చిత్రలేఖనం, దాన గుణంలోనూ వాడికి వాడే సాటి. బాబు లక్ష్యాన్ని చేరుకునేందుకు మేము కష్టపడతాం. చదువుతోపాటు వాడి అభిరుచి మేరకు ఇటు నృత్యం అటు సినీ రంగంలోనూ ప్రోత్సహిస్తున్నాం.–ఈద నీలిమదేవి, తల్లి తల్లితండ్రుల ప్రోత్సాహంతోనే.. నృత్యంలో ఆరితేరిన అమ్మతోపాటు నాన్న ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. నృత్యంలోనే నడుస్తున్న నాకు సినీ రంగంలోనూ అవకాశం వచ్చింది. ఈ రెండు రంగాలతోపాటు విద్యకు కూడా ప్రాధాన్యతనిచ్చి మంచి స్థానానికి చేరుకోవాలనేది నా ఆశ.–ఈద నిర్మల్వినయ్కుమార్, తణుకు -
తణుకు ఎన్నికల ప్రచార సభలో వైఎస్ షర్మిల
-
చంద్రబాబుకి ఓటేస్తే భవిష్యత్ నాశనమే : వైఎస్ షర్మిల
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : ‘ఐదేళ్లుగా అధికారంలో ఉండి ఏమి చేయని చంద్రబాబు ఇప్పుడు ‘ మీ భవిష్యత్ - నా బాధ్యత’ అంటూ వస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? లోకేష్ భవిష్యత్ మాత్రమే చంద్రబాబు బాధ్యతా? ఈ ఐదేళ్లు లోకేష్ కోసం పనిచేసి ఇప్పుడు మీ భవిష్యత్ నా బాధ్యత అంటున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలట. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేసి గెలిపిస్తే మీ భవిష్యత్ నాశనం చేస్తారు. జాగ్రత్త.. ఈ నారాసుర రాక్షసులను నమ్మి మోసపోకండి’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రజలను కోరారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... రాజన్న రాజ్యం ఎలా ఉండేది? తణుకు నియోజకవర్గప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజన్న రాజ్యం ఎలా ఉండేది? ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించే ఉండేది. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బంత ఏమైంది? ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం?ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. పోలవరం.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు. ఈయన కమిషన్ మింగొచ్చనని ప్రాజెక్టును తీసుకున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా? చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు. అమరావతిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? ఆ డబ్బంత చంద్రబాబు బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. మన చెవిలో పూలు పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. ఇది పుత్ర వాత్సల్యం కాదా? బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చెశారు. ఈ పప్పుగారు తెలుగు దేశం పార్టీలో ఉన్నారు కానీ తెలుగు రాదు. ఈ పప్పు లోకేష్‌కు కనీసం వర్ధంతికి , జయంతికి తేడా కూడా తెలియదు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకు ఏమో మూడు ఉద్యోగాలు అట. మాములు ప్రజలకు ఏమో ఉద్యోగాలు లేవు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేశారు కానీ.. ప్రత్యేక హోదా ఎంత అవసరం. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి వంటింది. అలాంటి హోదాన్ని నీరు గార్చిన వారు చంద్రబాబు. ఈ రోజు రాష్ట్రానికి హోదా రాలేదంటే చంద్రబాబే కారణం. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేశారు. మంత్రి పదవులు కూడా అనుభవించారు. కానీ హోదా తేలేకపోయారు. గత ఎన్నికల ముందు హోదా అన్నారు. పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలన్నారు. తర్వత ప్యాకేజీ అన్నారు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు. రేపు ఏమి అంటారో అతనికే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు. అంటే చంద్రబాబు ఎప్పుడు ఎలా మాట మారుస్తారో ఆయనకే తెలియదు. రోజుకో మాట..పూటకో వేషం చంద్రబాబుది. నిజం చెప్పే దమ్ము చంద్రబాబు లేదు దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హోదా కోసం చేయని పోరాటం లేదు. హోదా కోసం రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అఖరికి వైఎస్సార్సీపీ ఎంపీలతో రాజీనామా కూడా చెయించారు. చంద్రబాబు ఇవాళ యూటర్న్ తీసుకొని హోదా అంటున్నాడు అంటే దానికి కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాదా? చంద్రబాబుకు నిజం చెప్పే దమ్ములేదు. చంద్రబాబు నెత్తి మీద శాపం ఉందట. ఏ రోజు అయితే చంద్రబాబు నిజాలు మాట్లాడుతాడో ఆ రోజు తల వేయ్యి ముక్కలు అవుతాయట. అందుకే చంద్రబాబు నిజం మాట్లాడరు. చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్, జనసేనను, కేజ్రీవాల్‌ను, ఫరూక్ అబ్దుల్లాను గుంపుగా వేసుకొని తిరుగుతున్నారు. ఏ పొత్తు లేకుండా చంద్రబాబు ఇంతవరకు ఎన్నికలకే రాలేదు. ఓటు వేయమని వస్తే చంద్రబాబును ఇవి అడగండి గతఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్క వాగ్ధానం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చేపలకు ఎరవేసి నట్లు కొత్త పథకాలతో వస్తున్నారు. ఎరవేస్తే ప్రజలు నమ్ముతారా? చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్లుకాదు. ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారా. మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ ఇవన్నీ మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి ఈ నెల 11న ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. 45 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి 75 వేల రూపాయిలు అందిస్తాం. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృషంరాజును, తణుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగేశ్వరరావును జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. -
తణుకు రాజకీయ తళుకు
సాక్షి, తణుకు: స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి తణుకు రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉంది. అన్ని రాజకీయ భావాలనూ ఆదరించిన చరిత్ర తణుకుది. ఇక్కడి ప్రజలకు చైతన్యం ఎక్కువ. తణుకు అసెంబ్లీ నియోజకవర్గం తొలి నుంచీ విలక్షణతను చాటుకుంటోంది. ముళ్లపూడి, చిట్టూరి వర్గాల ఆధిపత్య పోరు ఇటీవల వరకూ సాగుతూ ఉండేది. పార్టీల ప్రాబల్యం కంటే వర్గాల ప్రాబల్యమే ఎక్కువగా ఉండేది. ముళ్లపూడి, చిట్టూరి వర్గాల్లో ముళ్లపూడి వర్గం తెలుగుదేశం పార్టీలోనూ, చిట్టూరి వర్గం కాంగ్రెస్‌లోనూ ఉండేవి. టీడీపీ ఆవిర్భావానికి ముందు ముళ్లపూడి వర్గం కాంగ్రెస్‌లో ఉండేది. చిట్టూరి వర్గం మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. 1975 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీకి, 1983 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికింది. అయితే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన కారుమూరి వెంకటనాగేశ్వరరావు గెలుపుతో నియోజకవర్గ ముఖచిత్రం ఒక్కసారిగా మారింది. అప్పటి వరకు రెండు వర్గాలకే పరిమితమైన రాజకీయం విస్తరించింది. 1952లో నియోజకవర్గం ఆవిర్భవించింది. అప్పటి నుంచి 2014 వరకు 14 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. భౌగోళిక స్వరూపం పుణ్య గోస్తనీ నది ప్రవహించే ప్రాంతంగా తణుకు ప్రసిద్ధి గాంచింది. నియోజకవర్గ కూడలిగా ఉన్న తణుకు ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆదికవి నన్నయ్య యజ్ఞం చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. దీన్ని బట్టి తణుకు ప్రాంతానికి వెయ్యేళ్ల కంటే ఎక్కువ చరిత్ర ఉన్నట్లు స్పష్టమవుతుంది. వ్యవసాయం, పారిశ్రామికంగా, విద్య, వైద్య రంగాల్లో తణుకు ఎంతో అభివృద్ధి చెందింది. వ్యవసాయం వ్యవసాయాధార ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు. తణుకుతోపాటు ఇరగవరం, అత్తిలి మండలాల్లో మొత్తం 45 వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. రాష్ట్రంలో ఆంధ్రాసుగర్స్ పేరు ప్రసిద్ధిగాంచింది. దీంతో ఈ ప్రాంతంలో చెరకు సాగు విరివిగా జరిగేది. ప్రస్తుతం ఆంధ్రాసుగర్స్‌లో ఉత్పత్తి నిలిచిపోవడంతో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. పారిశ్రామిక ప్రగతి పారిశ్రామికీకరణ ఇక్కడి నాగరికతను పూర్తిగా మార్చివేసింది. 1947లో ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ సారథ్యంలో ఆంధ్రాసుగర్స్ ఏర్పాటుతో పారిశ్రామికీకరణకు బీజం పడింది. దీంతోపాటు టెక్స్టైల్స్, సుమిల్లులు ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేస్తున్న రాకెట్ ప్రయోగాలకు కావాల్సిన ద్రవరూప ఇంధనాన్ని రూపొందించడంలో ఆంధ్రాసుగర్స్ ఘన విజయాన్ని సాధించింది. తగ్గిన ఓటర్ల సంఖ్య తణుకు నియోజకవర్గంలో మొత్తం 2,16,183 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 1,06,804, మహిళలు 1,11,353 మంది ఉన్నారు. ఆరుగురు ఇతరులు ఉన్నారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో 2,19,225 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి గత ఎన్నికలతో పోల్చితే 3,042 మంది ఓటర్లు తగ్గారు. గత ఎన్నికల్లో 222 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం తణుకు నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 242కు పెరిగింది. ప్రధాన సమస్యలు తణుకు పట్టణంలోని ప్రజలకు గోదావరి జలాలు అందించేందుకు ఉద్దేశించిన పథకానికి స్థల సేకరణ ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. ఫలితంగా వేసవిలో గోదావరి జలాలు అందడం లేదు. ఇందుకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి సుమారు 60 ఎకరాల స్థల సేకరణ చేపట్టాల్సి ఉండగా రైతులు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. తణుకు వెంకట్రాయపురంలో గోస్తనీ మళ్లింపు భూమి 7.26 ఎకరాలను ఆంధ్రాసుగర్స్కు పచ్చదనం కోసం కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రస్తుత అధికార పార్టీ నేతలు మాత్రం ఈ స్థలాన్ని ఆంధ్రాసుగర్స్ యాజమాన్యానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ హయాంలో అభివృద్ధి తణుకు పట్టణంలో సుమారు 600 మంది పేదలకు ఇందిరమ్మ కాలనీ పేరుతో అజ్జరం రోడ్డులో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కొన్నేళ్లుగా పేద ప్రజలు ఇళ్లులేక ఇబ్బందులు పడుతుండటంతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తణుకులో ఇందిరమ్మ కాలనీ పేరుతో కాలనీ నిర్మించారు. తణుకుకు గోదావరి జాలాలు అందించే క్రమంలో సుమారు రూ.120 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును గత ప్రభుత్వ హయాంలో నిర్మించారు. గోదావరి జలాలను పైపులైన్ల ద్వారా మళ్లించి ఇక్కడ శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. మరోవైపు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి 60 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ప్రస్తుత పాలకులు శ్రద్ధ చూపడంలేదు.వైఎస్సార్సీపీ దూకుడు ప్రస్తుతం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలం పుంజుకుంది. ఎన్నికల సమరంలో ముందుంది. ఆ పార్టీ నియోజవర్గ కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఇరగవరం మండలం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే రావాలి జగన్–కావాలి జగన్, నిన్ను నమ్మంబాబూ, గడపగడపకూ వైఎస్సార్, నవరత్నాలు వంటి కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమయ్యారు. అధికారపార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అవినీతి, అక్రమాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. ఫలితంగా కారుమూరికి విజయావకాశాలు పెరిగాయి. ఇదిలా ఉంటే అధికారపార్టీ వైఫల్యాలు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అవినీతిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మండలాలు తణుకు, ఇరగవరం, అత్తిలి జనాభా : 2,57,314 పురుషులు 1,09,132 స్త్రీలు1,48,176 ఇతరులు 06 ఓటర్లు : 2,18,163 పురుషులు 1,06,804 స్త్రీలు1,11,353 ఇతరులు 06 పోలింగ్ కేంద్రాలు : 242 -
మెడాల్.. పరీక్షలు నిల్
తణుకు అర్బన్: తణుకు ఏరియా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న ప్రైవేటు వైద్య పరీక్షల సంస్థ మెడాల్ వారం రోజులుగా మూతపడింది. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద రోగులు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఆస్పత్రిలోని ల్యాబ్ కొన్ని పరీక్షలకే పరిమితం చేసి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మెడాల్ సంస్థచే 48 రకాల ఖరీదైన వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకువచ్చారు. కాని సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వేతనాల బకాయిలు అందకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. థైరాయిడ్, ప్లేట్లెట్స్ కౌంట్, లివర్ ఫంక్షన్, లిపిడ్ ప్రొఫైల్, క్యాన్సర్ నిర్ధారణ వంటి పరీక్షలు అందుబాటులో ఉన్న ఈ సేవలు నిలిచిపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. మూడు నెలలుగా వేతనాల్లేవ్ మెడాల్ సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ వైద్యపరీక్షలను నిలిపివేసింది. తమకు రావాల్సిన మొత్తాన్ని మెడాల్ సంస్థ చెల్లించలేదని ప్రభుత్వం నుంచి వారికి బిల్లులు రాకపోవడంతో తమకు కూడా నిలిపివేశారని మెడాల్ అనుబంధ సంస్థ అయిన ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకులు చెబుతున్నారు. వైద్యపరీక్షలు చేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో సిబ్బంది కూడా విధులకు హాజరుకావట్లేదని తెలుస్తోంది. నిత్యం 500 మందికి పైగా.. తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యవర్గాలు అందిస్తున్న నాణ్యమైన వైద్యసేవల కారణంగా ఇటీవల కాలంలో నిత్యం 500కు పైగా రోగులు, గర్భిణులు వైద్యసేవల కోసం వస్తున్నారు. ఇందులో 70 శాతం మందికి వివిధ పరీక్షలు వైద్యులు రాస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు అల్లాడుతున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో వైద్య పరీక్షలు చేయించుకుని తమ జేబులు గుల్లచేసుకుంటున్నామని వాపోతున్నారు. ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లాల్సిందే.. మా నాన్నకు ఆరోగ్యం సరిగాలేదని వైద్యులు కొన్నిరకాల పరీక్షలు చే యించుకోమన్నారు. ఆస్పత్రిలో మెడాల్ వైద్యపరీక్షలు నిలిచిపోవడంతో ప్రైవేట్ ల్యాబ్‌లో చేయించాల్సి వచ్చింది. ఆస్పత్రిలో ఈ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలి.– బి.సాయి కమార్, తణుకు వారం రోజులుగా నిలిచిపోయాయి ఆస్పత్రిలో అందుబాటులో ఉండే మెడాల్ వైద్య పరీక్షలు వారం రోజులుగా నిలిచిపోయాయి. ఒక రోజు స్ట్రైక్ చేస్తున్నామని చెప్పారు కాని ఇప్పటివరకు విధుల్లోకి రాలేదు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వైద్య పరీక్షలు మాత్రమే బయటికి రాస్తున్నాం.– డాక్టర్ వెలగల అరుణ, తణుకు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
బాలుడి కిడ్నాప్ కధ సుఖాంతం
-
తణుకులో బాలుడి కిడ్నాప్
పశ్చిమగోదావరి, తణుకు : తణుకు పట్టణంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆరేళ్ల బాలుడ్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్లు తల్లిదండ్రులు తణుకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం రద్దీగా ఉండే తణుకు పట్టణంలోని సోమవారం ఉదయం 11.40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. అయితే కిడ్నాప్ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తణుకు పట్టణ పోలీసులు కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఛేదించారు. తాడేపల్లిగూడెం మండలం ముక్కిరాలపాడు గ్రామంలోని ఒక ఇంట్లో నిందితులు బాలుడ్ని వదిలి వెళ్లినట్లు సమాచారం అందుకున్న పోలీసులు బాలుణ్ని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఆర్థిక లావాదేవీలే కారణం గణపవరం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన తోట పెద్దకాపు ధాన్యం వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో మధ్యవర్తులతో పాటు గ్రామంలోని రైతుల నుంచి సుమారు రూ.2 కోట్ల వరకు ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో నగదు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరోవైపు అప్పులపాలైన పెద్దకాపునకు ఒత్తిళ్లు పెరిగిపోవడంతో భార్య దుర్గాభవాని, ఇద్దరు పిల్లలతో ఇరవై రోజుల క్రితం ఊరు వదిలి వెళ్లిపోయారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి న్యాయవాదిని సంప్రదించడానికి తణుకు వచ్చిన పెద్దకాపు రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. సోమవారం ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని న్యాయవాది ఇంటికి భార్య దుర్గాభవాని, కుమారుడు తోట సోమసూర్య శశివర్థన్ (6)లను తోడుకుని పెద్దకాపు వచ్చారు. లోపల తల్లిదండ్రులు న్యాయవాదితో మాట్లాడుతున్న క్రమంలో బాలుడు శశివర్థన్ ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. ఇదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటారుసైకిల్‌పై వచ్చి బాలుడిని అపహరించుకుపోయారు. కొద్దిసేపటికి బయటకు వచ్చిన తల్లిదండ్రులకు బాలుడు కనిపించకపోవడంలో లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే తమ కుమారుడిని కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ దర్యాప్తు ప్రారంభించారు. సీఐ డీఎస్.చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో నాలుగు బృందాలను నియమించి గాలింపు చర్యలు చేపట్టారు. పట్టిచ్చిన సీసీ కెమెరా బాలుడి కిడ్నాప్ విషయం దావానంలా వ్యాప్తి చెందడంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని ఒక బియ్యం దుకాణంలో బయట ఉన్న సీసీ కెమెరాలో బాలుణ్ని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని వెళుతున్న దృశ్యాలు నమోదు కావడంతో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఆధారంగా అన్ని చెక్‌పోస్టులను అప్రమత్తం చేసిన పోలీసు అధికారులు ఒక పక్క నిందితులు వాడుతున్న సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. చివరికి తాడేపల్లిగూడెం మండలం ముక్కిరాలపాడు గ్రామంలో బాలుడు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బాలుడి ఆచూకీ కనుగొన్నారు. గణపవరం గ్రామానికి చెందిన తన్నీడి విజయకుమార్ అలియాస్ వాసు, మధులను నిందితులుగా పోలీసులు నిర్థారించారు. విజయకుమార్ బంధువుల ఇంట్లో వదిలి నిందితులు పారిపోయినట్లు సీఐ చెప్పారు. బాలుడిని క్షేమంగా తణుకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ వ్యవహారం ఛేదించడంలో సహకరించిన పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ, పెరవలి, రూరల్ ఎస్సైలు వి.జగదీశ్వరరావు, ఎన్.శ్రీనివాసరావు, పోలీస్ కానిస్టేబుళ్లను సీఐ చైతన్యకృష్ణ అభినందించారు. -
నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు
సాక్షి, తూర్పుగోదావరి : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను టీడీపీ ప్రభుత్వం మంటకలుపుతుదని తణుకు వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు మడిపండ్డారు. స్వామి సన్నిధిలో ఎన్నో తరాలు నుంచి ఒక యాదవ కులానికి చెందిన వారసులే తొలిత తలుపులు తీసే ఆనవాయితీ ఉండగా దాన్ని ఇప్పుడు సీఎం మంటగలుపుతున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, ఛైర్మన్ సుధాకర్ యాదవ్ అనే వ్యక్తిని అడ్డు పెట్టుకొని యాదవులకే అన్యాయం చేయడం చాలా బాధాకమన్నారు. రెవెన్యూ మినిస్టరు ఇప్పుడు టీటీడీ అర్చకులపై కేసులు పెడుతాం, ఎంక్వెరీ చేయిస్తామంటున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని, ఐయినా టీటీడీ వ్యవస్థలో కూడా రాజకీయం చేయటం సిగ్గు చేటన్నారు. టీటీడీని భంగ పరుచాలనుకుంటే నిన్ను ఆ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు. ఇప్పటికైనా సన్నిధిలో ఆచారం కొనసాగాలి అర్చకులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే నిర్ణయాన్ని మానుకోవాలని లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పుదని, ఈ నిర్ణయాన్ని విరమించకుంటే ప్రజలు ఉద్యమాలకు దిగుతారని హెచ్చరించారు. -
ముగిసిన టేబుల్ టెన్నిస్ పోటీలు
తణుకు అర్బన్ : స్థానిక జెడ్పీ హైస్కూల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 62వ అంతర జిల్లాల అండర్–17 టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. బాలుర వ్యక్తిగత విభాగంలో సి. కుశాల్‌కుమార్ (అనంతపురం) ద్వితీయ స్థానం నిలిచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ పీఎస్ సుధాకర్ తెలిపారు. బాలికల వ్యక్తిగత విభాగంలో కేజే అమూల్య (అనంతపురం) ద్వితీయ స్థానం సాధించి జాతీయస్థాయికి ఎంపికైందన్నారు. బాస్కెట్ బాల్ అండర్ 14 విభాగంలో.. బాస్కెట్ బాల్ అండర్ 14 బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు, అనంతపూర్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నట్టు సుధాకర్ తెలిపారు. అనంతరపురం జట్టు 18–2 తేడాతో విజయనగరంపైనా గెలిచి సెమీస్‌కు చేరినట్టు తెలిపారు. బాలుర విభాగంలో అనంతరపురం జట్టు 16–11 తేడాతో చిత్తూరుపైనా గెలుపొందిందన్నారు. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ జట్టుకు ఎంపికైన బాలురు, బాలికల జట్టలోని క్రీడాకారులకు ఆదివారం సాయంత్రం మెమొంటోలు, ధ్రువపత్రాలు అందజేశారు. -
ఆచిన్నారి కళ్లు పోవడానికి కారణం వైద్యులే