తణుకు అర్బన్ : స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 62వ అంతర జిల్లాల అండర్–17 టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. బాలుర వ్యక్తిగత విభాగంలో సి. కుశాల్‌కుమార్ (అనంతపురం) ద్వితీయ స్థానం నిలిచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ పీఎస్ సుధాకర్ తెలిపారు. బాలికల వ్యక్తిగత విభాగంలో కేజే అమూల్య (అనంతపురం) ద్వితీయ స్థానం సాధించి జాతీయస్థాయికి ఎంపికైందన్నారు.
బాస్కెట్ బాల్ అండర్ 14 విభాగంలో..
బాస్కెట్ బాల్ అండర్ 14 బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు, అనంతపూర్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నట్టు సుధాకర్ తెలిపారు. అనంతరపురం జట్టు 18–2 తేడాతో విజయనగరంపైనా గెలిచి సెమీస్‌కు చేరినట్టు తెలిపారు. బాలుర విభాగంలో అనంతరపురం జట్టు 16–11 తేడాతో చిత్తూరుపైనా గెలుపొందిందన్నారు. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ జట్టుకు ఎంపికైన బాలురు, బాలికల జట్టలోని క్రీడాకారులకు ఆదివారం సాయంత్రం మెమొంటోలు, ధ్రువపత్రాలు అందజేశారు.
ముగిసిన టేబుల్ టెన్నిస్ పోటీలు
Published Mon, Oct 24 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
Advertisement